The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.
Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.
Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.
Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.
Java® is a registered trademark of Oracle and/or its affiliates.
XFS® is a trademark of Silicon Graphics International Corp. or its subsidiaries in the United States and/or other countries.
All other trademarks are the property of their respective owners.
Red Hat Enterprise Linux వుప విడుదలలు అనునవి, పొడిగింపుల, రక్షణ మరియు బగ్ పరిష్కారాల యెర్రాటా యొక్క సమాహారం. Red Hat Enterprise Linux 6.1 విడుదల నోడ్స్ నందు Red Hat Enterprise Linux 6 ఆపరేటింగ్ సిస్టమ్‌కు మరియు దాని అనువర్తనములకు యీ వుపవిడుదల నందు జరిగిన ముఖ్య మార్పులను పత్రకీకరణచేయును. ఈ వుప విడుదల నందు జరిగిన అన్ని మార్పులపై విశదీకృత వివరణ సాంకేతిక నోడ్స్ నందు వుంది.
మొదటినుండి, నెట్వర్కు అంతరవర్తిలు లైనక్సు నందు eth[X] గా పేరు పెట్టబడి వుంటాయి. ఏమైనప్పటికి, చాలా సందర్భాలలో, ఈ పేరులు చాసెస్ పైని యదార్ధ లేబుళ్ళుకు చెంది వుండవు. బహుళ నెట్వర్కు యెడాప్టర్సుతో వున్న నవీన సర్వర్ ప్లాట్‌ఫాంలు యీ నెట్వర్కు అంతరవర్తిల నాన్-డొమెస్టిక్ మరియు కౌంటర్‌యిన్షియేటివ్ పేరులను యెదుర్కొంటాయి.
Red Hat Enterprise Linux 6.1 అనునది biosdevname పరిచయంచేస్తోంది, నెట్వర్కు అంతరవర్తిలకు పేరుపెట్టుటకు వొక ఐచ్చిక వెసులుబాటు. biosdevname అనునది నెట్వర్కు అంతరవర్తిలకు వాటి భౌతిక స్థానముపై ఆధారపడి పేరు పెట్టును. గమనిక, ఏమైనప్పటికి కొన్ని పరిమిత Dell సిస్టమ్సుకు తప్పించి, యీ biosdevname అనునది అప్రమేయంగా అచేతనముచేయబడి వుండును.
Red Hat Enterprise Linux 6.1 నందు యూనివర్సల్ సీరియల్ బస్ (USB 3.0) యొక్క వర్షన్ 3.0కు పూర్తిగా తోడ్పాటు అందించబడుతోంది. గత విడుదలలనందు USB 3.0కు తోడ్పాటు అందించుట అనేది సాంకేతిక పరిదృశ్యంగా మాత్రమే పరిగణించబడింది.
CPU మరియు మెమొరి హాట్-యాడ్
Nehalem-EX పై, Red Hat Enterprise Linux 6.1 నందు CPUలు మరియు మెమొరీను హాట్-యాడ్ చేయుట యిప్పుడు పూర్తిగా మద్దతించబడును. గమనిక, ఆ హార్డువేర్ కూడా తప్పక హాట్-యాడింగ్‌తు తోడ్పాటునివ్వాలి. హాట్-యాడింగ్‌కు తోడ్పాటునివ్వని హార్డువేర్‌పై CPUలు లేదా మెమొరీను హాట్-యాడ్ చేయుటకు ప్రయత్నించితే నష్టం వాటిల్లవచ్చు.
డ్రైవర్ నవీకరణలు
Red Hat Enterprise Linux 6.1 విస్తృత స్థాయిలో డ్రైవర్ నవీకరణలను అందించుచున్నది, కింది పరికర డ్రైవర్లకు నవీకరణలతో సహా:
Intel 10 Gigabit PCI ఎక్స్‌ప్రెస్ నెట్వర్క్ పరికరాల కొరకు ixgbe డ్రైవర్
Mellanox ConnectX HCA ఇన్ఫిబాండ్ హార్డ్‌వేర్ కొరకు mlx4 డ్రైవర్, Mellanox Connect X2/X3 10GB పరికరాల కొరకు తోడ్పాటు అందిస్తోంది.
ServerEngines BladeEngine2 10Gbps నెట్వర్కు పరికరాల కొరకు be2net డ్రైవర్
Broadcom NetXtreme II నెట్వర్క్ పరికరాల కొరకు bnx2 డ్రైవర్, ఎడ్వాన్సుడ్ యెర్రర్ రిపోర్టింగ్ (AER)కు తోడ్పాటును, మరియు 5709 పరికరాలకు PPC తోడ్పాటును చేర్చును
Broadcom Tigon3 ఈథర్నెట్ పరికరాల కొరకు tg3 డ్రైవర్
Brocade Fibre Channel to PCIe Host Bus Adapters కొరకు bfa డ్రైవర్
Brocade 10G PCIe ఈథర్నెట్ నియంత్రణిల కొరకు bna డ్రైవర్
Chelsio Terminator4 10G యూనిఫైడ్ వైర్ నెట్వర్క్ నియంత్రణిల కొరకు cxgb4 డ్రైవర్
ServerEngines BladeEngine 2 Open iSCSI పరికరాల కొరకు be2iscsi డ్రైవర్
ServerEngines BladeEngine2 10Gbps నెట్వర్కు పరికరాల కొరకు be2net డ్రైవర్
Emulex Fibre Channel HBAs కొరకు lpfc డ్రైవర్
Intel PRO/1000 నెట్వర్కు పరికరాల కొరకు e1000 మరియు e1000e డ్రైవర్స్
Intel Iron Pond ఈథర్నెట్ డ్రైవర్
Intel Kelsey Peak వైర్‌లెస్ డ్రైవర్
Intel SCU డ్రైవర్
LSI MegaRAID SAS నియంత్రణిల కొరకు megaraid_sas డ్రైవర్
LSI Logic నుండి SAS-2 ఫ్యామిలి యెడాప్టర్స్ కొరకు mpt2sas డ్రైవర్
2. కెర్నల్
Red Hat Enterprise Linux 6.1 నందు అందించబడుచున్న కెర్నల్ లైనక్స్ కెర్నల్ కొరకు చాలా వందల బగ్ పరిష్కారాలను మరియు విస్తరింపులను కలిగివుంది. ఈ విడుదల నందు పరిష్కరించిన ప్రతి బగ్‌కు సంభందించిన మరియు యీ విడుదల నందు జతచేసిన ప్రతి విస్తరణ గురించిన వివరముల కొరకు, Red Hat Enterprise Linux 6.1 సాంకేతిక నోట్స్ నందలి కెర్నల్ అధ్యయంను చూడండి.
నియంత్రణ సమూహములు
Red Hat Enterprise Linux 6 నందు నియంత్రణ సమూహములు అనునవి లైనక్స్ కెర్నల్ యొక్క కొత్త విశేషణము. ప్రతి నియంత్రణ సమూహం అనునది కర్తవ్యముల యొక్క సమితి అది సిస్టమ్ హర్డువేర్‌తో వాటి వుత్తమ సాహచర్యం కొరకు ఆ సిస్టమ్‌పై వుండును. అవి వుపయోగిస్తున్న సిస్టమ్ వనరులను పర్యవేక్షించుటకు నియంత్రణ సమూహములు ట్రాక్ చేయబడగలవు. అదనంగా, సిస్టమ్ వనరులు అయినటువంటి మెమొరీ, CPUలు (లేదా CPUల యొక్క సమూహం), నెట్వర్కింగ్, I/O, లేదా ప్రణాళకికి కొన్ని నియంత్రణ సమూహల యాక్సెస్‌ను అనుమతించుటకు లేదా తిరస్కరించుటకు నిర్వహణాధికారులు నింయత్రణ సమూహ ఆకృతిని వుపయోగించుకో గలరు.
Red Hat Enterprise Linux 6.1 అనునది నియంత్రణ సమూహాలకు చాలా అభివృద్దులను మరియు నవీకరణలను అందించును, ఫలానా పరికరంకు బ్లాక్ పరికరం యిన్పుట్/అవుట్పుట్ (I/O)ను నెట్టే సమార్ధ్యంను, సెకనుకు బైట్ల చొప్పున లేదా సెకనుకు I/O చొప్పున (IOPS) అందించును.
అదనంగా, libvirt మరియు యితర యూజర్‌స్పేస్ సాధనాలతో యింటిగ్రేషన్ అనునది హైరార్కియల్ బ్లాక్ డివైజ్ నియంత్రణ సమూహాలను సృష్టించే సామర్ధ్యంతో అందించబడుతోంది. కొత్త బ్లాక్ పరికర నియంత్రణ సమూహం group_idle, ఫెయిర్‌నెస్‌ను నిర్వహించునప్పుడు నియంత్రణ సమూహాలతో మెరుగైన త్రౌపుట్ అందించును.
CPU యింటెన్సివ్ పనిభారములనందు మరిన్ని యింటరాక్టివ్ టాస్కులను అనుమతించుటకు లేటెన్సీలను తగ్గించుటకు, Red Hat Enterprise Linux 6.1 కొత్త autogroup సౌలభ్యమును ప్రవేశపెడుతోంది. cgsnapshot సాధనం అనునది, ప్రస్తుత నియంత్రణ సమూహం ఆకృతీకరణ యొక్క స్నాప్‌షాట్‌ను తీసుకొనగలిగే సామర్ధ్యం అందించును.
ఇంకా చదువుటకు
నియంత్రణ సమూహాలు మరియు యితర వనరు నిర్వహణా విశేషణములు Red Hat Enterprise Linux 6 వనరు నిర్వహణా మార్గదర్శిని నందు వివరంగా చర్చించబడెను
నెట్వర్కింగ్ నవీకరణలు
రిసీవ్ పాకెట్ స్టీరింగ్ (RPS) మరియు రిసీవ్ ఫ్లో స్టీరింగ్ (RFS) కొరకు Red Hat Enterprise Linux 6.1 తోడ్పాటును అందిస్తోంది. రిసీవ్ పాకెట్ స్టీరింగ్ అనునది లోనికివచ్చు నెట్వర్కు పాకెట్లను సమాంతరంగా బహుళ CPU కోర్లనందు ప్రోసెస్ అగుటకు అనుమతించును. రిసీవ్ ఫ్లో స్టీరింగ్ అనునది ఫలానా అనువర్తనము కొరకు వుండిన నెట్వర్కు డాటాను ప్రోసెస్ చేయుటకు మెరుగైన CPUను యెంచుకొనును.
kdump
kdump అనునది అధునాతర డంపింగ్ మెకానిజం. చేతనం చేయబడినప్పుడు, సిస్టమ్ అనునది వేరొక కెర్నల్ యొక్క కాంటెస్టునుండి బూట్ అగును. ఈ రెండవ కెర్నల్ అతి తక్కువ మొత్తంలో మెమొరీను కలిగివుండును, మరియు సిస్టమ్ క్రాషైనప్పుడు కోర్ డంప్ యిమేజ్‌ను కాప్చర్ చేయడం మాత్రమే దీని ప్రయోజనం.
Red Hat Enterprise Linux 6.1 కెర్నల్ మెసేజ్ డంపర్‌ను ప్రవేశపెడుతోంది, కెర్నల్ పానిక్ యెదురైనప్పుడు యిది పిలువబడును. కెర్నల్ మెసేజ్ డంపర్ సులువైన క్రాష్ విశ్లేషణను అందించును మరియు ప్రత్యామ్నాయ లక్ష్యాల కొరకు మూడో వ్యక్తి కెర్నల్ మెసేజ్ లాగింగ్‌ను అనుమతించును.
అదనంగా, crashkernel=auto పారామితి సిన్టాక్స్ తీసివేయబడింది. అప్రమేయ పారామితి సిన్టాక్స్ యిప్పుడు crashkernel=:[@offset].
పనితనపు నవీకరణలు మరియు మెరుగుదలలు
Red Hat Enterprise Linux 6.1 నందలి కెర్నల్ కింది గుర్తించదగు పనితనపు మెరుగుదలలను అందిస్తోంది:
ట్రాన్సపరెంట్ హ్యూజ్ పేజెస్ (THP) తోడ్పాటునకు నవీకరణలు మరియు మెరుగుదలలు
kprobes జంప్ ఆప్టిమైజేషన్, ఓవర్‌హెడ్ తగ్గిస్తోంది మరియు సిస్టమ్‌టాప్ పనితనంను పెంచుతోంది.
i7300_edac మరియు i7core_edac కు నవీకరణలు, Intel 7300 చిప్‌సెట్ వుపయోగించి మదర్‌బోర్డ్స్ పై మెమొరీ దోషాల పర్యవేక్షణకు తోడ్పాటును అందిస్తోంది
3. డెస్కుటాప్
గ్రాఫిక్స్ హార్డువేర్
Red Hat Enterprise Linux 6.1 అనునది గ్రాఫిక్స్ హార్డువేర్ కొరకు విస్తృత నవీకరణలను అందించుచున్నది. సాండీ బ్రిడ్జ్ ప్రోసెసర్ పై ఇంటెల్ జనరేషన్ 6 గ్రాఫిక్స్ కొరకు డ్రైవర్ యీ విడుదల నందు ప్రవేశపెట్టబడుతోంది, ఈ పరికరాలపై పూర్తిగా యాగ్జెలరేట్ చేయబడిన 2D మరియు 3D గ్రాఫిక్స్ అందిస్తుంది. అదనంగా, ఈ విడుదల Matrox MGA-G200ER గ్రాఫిక్స్ చిప్‌లెట్‌కు తోడ్టాటును అందిస్తోంది.
XGI Z9S AND Z11 చిప్‌సెట్సుకు తోడ్పాటును అందించుటకు xorg-x11-drv-xgi వీడియో డ్రైవర్‌ను Red Hat Enterprise Linux 6.1 ప్రవేశపెడుతోంది. పాత XGI హార్డువేర్‌కు తోడ్పాటునందించే SIS డ్రైవర్‌ను కొత్త హార్డువేర్‌కు తోడ్పాటు అందించుటకు నవీకరించుటలేదు.
ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఎక్స్‌టెండెడ్ డిస్ప్లే ఐడెంటిఫికేషన్ డాటా (EDID)ను అందించని మానిటర్లు యిప్పుడు అప్రమేయ రెజొల్యూషన్ 1024 x 768 పిగ్జెల్సు కలిగి వున్నాయి.
నెట్వర్క్ నిర్వాహిక
విస్తృత స్థాయిలో నెట్వర్కు అనుసంధానపు రకాలను అమర్చుటకు, ఆకృతీకరించుటకు మరియు నిర్వహించుటకు NetworkManager అనునది డెస్కుటాప్ సాధనం. Red Hat Enterprise Linux 6.1 నందు, Wi-Fi Protected Access (WPA) Enterprise మరియు Internet Protocol version 6 (IPv6) యొక్క ఆకృతీకరణకు తోడ్పాటు అందించుటకు NetworkManager మెరుగుపరచబడింది.
ఆడియో
Red Hat Enterprise Linux 6.1 నవీకృత అడ్వాన్సుడ్ లైనక్స్ సౌండ్ ఆర్కిటెక్చర్ - హై డెఫినిషన్ ఆడియో (ALSA-HDA) డ్రైవర్లను అందిస్తోంది.
4. నిల్వ
మిర్రర్ల యొక్క LVM స్నాప్‌షాట్లు
LVM స్నాప్‌షాట్ విశేషణము లజికల్ వాల్యూమ్ యొక్క బ్యాకప్ ప్రతిబింబములను ఫలానా సందర్భములో యెటువంటి సేవా ఆటంకముకలుగకుండా సృష్టించగలుగు సామర్థ్యమును అందించును. వాస్తవ పరికరమునకు వొక మార్పు చేయగనే (మూలం) స్నాప్‌షాట్ తీసుకొన్న తర్వాత, స్నాప్‌షాట్ సౌలభ్యము మార్చిన డాటా యేరియా యొక్క నకలును చేయును మార్పుకు ముందుగా వున్నప్పటిది అలా అది పరికరము యొక్క స్థితిని తిరిగి నిర్మించగలదు. మిర్రర్డ్ లాజికల్ వాల్యూమ్ యొక్క స్నాప్‌షాట్‌ను తీయగల సామర్థ్యముకు Red Hat Enterprise Linux 6.1 నందు పూర్తింగా తోడ్పాటు అందించబడును.
మిర్రర్ల యొక్క LVM స్ట్రిప్
LVM నందలి వొంటరి లాజికల్ వాల్యూమ్ నందు RAID0 (స్ట్రిపింగ్) మరియు RAID1 (మిర్రరింగ్) మిళితం చేయుట సాధ్యమే. మిర్రర్ల సంఖ్య ('--mirrors X') మరియు స్ట్రిప్స్ సంఖ్య ('--stripes Y') ఫలితాలను యేకకాలంనందు తెలుపునప్పుడు లాజికల్ వాల్యూమ్‌ను సృష్టించుట మిర్రర్ పరికరాలుగా ప్రతిఫలించును వాటి స్థిర పరికరాలు స్ట్రిప్ అయి వుంటాయి.
5. ధృవీకరణ మరియు యింటరాపరబిలిటి
సిస్టమ్ సెక్యూరిటి సర్వీసెస్ డెమెన్ (SSSD)
గుర్తింపు మరియు ధృవీకరణము యొక్క కేంద్రీయ నిర్వహణకు సిస్టమ్ సెక్యూరిటి సర్వీసెస్ డెమెన్ (SSSD) సేవలను అభివృద్దిపరచును. గుర్తింపును మరియు ధృవీకరణమును కేంద్రీకృతం చేయుట వలన గుర్తింపుల యొక్క స్థీనిక క్యాచింగ్ సాధ్యమౌతుంది, దీనివలన సేవికకు అనుసంధానం ఆటంకపరచ బడినప్పుడు కూడా వాడుకరులను గుర్తించుటకు దోహదపడును. SSSD చాలారకాలైన గుర్తింపు మరియు ధృవీకరణ సేవలను అందించును, వాటినందు: Red Hat డైరెక్టరీ సర్వర్, ఏక్టివ్ డైరెక్టరీ, OpenLDAP, 389, కేర్బెరోస్ మరియు LDAP. Red Hat Enterprise Linux 6.1 నందు SSSD వర్షన్ 1.5కు నవీకరించబడింది, కింది బగ్ పరిష్కారాలను మరియు విస్తరింపులను అందిస్తోంది:
నెట్‌గ్రూప్స్ తోడ్పాటు
మెరుగైన ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ గుర్తింపు
షాడో మరియు ధృవీకృతసేవ కొరకు మెరుగైన LDAP యాక్సెస్-కంట్రోల్ ప్రొవైడర్ తోడ్పటుతో సహా
విభిన్న స్కీమేటా కొరకు మెరుగైన క్యాచింగ్ మరియు క్లీనప్ లాజిక్
మెరుగైన DNS ఆధారిత డిస్కవరీ
స్వయంచాలక కేర్బరోస్ టికట్ రెన్యువల్
కేర్బెరోస్ FAST నిభందన యొక్క చేతనీకరణ
సంకేతపద గడువును సమర్థవంతంగా సంభాలించుట
LDAP ఖాతాల కొరకు సంకేతపద అబ్‌ఫెస్కషెన్
ఇకపై చదువుటకు
SSSDను యెలా సంస్థాపించాలి మరియు ఆకృతీకరించాలి అనేది డిప్లోయ్‌మెంట్ గైడ్ వొక విభాగమును కలిగివుంది.
IPA
Red Hat Enterprise Linux 6.1 అనునది IPAను సాంకేతిక పరిదృశ్యంగా అందిస్తోంది. IPA అనునది వొక యింటిగ్రేటెడ్ సెక్యూరిటి యిన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ పరిష్కారం అది Red Hat Enterprise Linux, Red Hat డైరెక్టరీ సర్వర్, MIT కేర్బెరోస్, మరియు NTP ను కలుపును. ఇది వెబ్ బ్రౌజర్ మరియు కమాండ్-లైన్ యింటర్ఫేస్‌ను అందించును, మరియు దీనియొక్క నిర్వహణా సాధనాలు, నిర్వహణాధికారి కేంద్రీకృత ధృవీకరణ మరియు గుర్తింపు నిర్వహణకు వొకటి లేదా అంతకన్నా యెక్కువ సర్వర్లను త్వరగా సంస్థాపించుటకు, అమర్చుటకు మరియు నిర్వహించుటకు దోహదపడును.
సాంబ్ అనునది కామన్ యింటర్నెట్ ఫైల్ సిస్టమ్ (CIFS) నిభందన యొక్క వోపెన్ సోర్స్ అభివృద్ది. ఇది Microsoft విండోస్, లైనక్స్, యునిక్స్, మరియు యితర ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క నెట్వర్కింగ్‌ను వొకటిగా చేర్చుటకు అనుమతించును, విండోస్-ఆధారిత ఫైల్ మరియు ముద్రిక భాగస్వామ్యమునకు యాక్సెస్ చేతనంచేయును. Red Hat Enterprise Linux 6.1 నందలి సాంబా వర్షన్ 3.5.6కు నవీకరించబడెను.
Red Hat Enterprise Linux 6.1 నందలి సాంబా CIFS మౌంట్‌ను యాక్సెస్ చేయునప్పుడు, మౌంట్‌నకు మొత్తం యాక్సెస్ కొరకు అదే మౌంట్ క్రెడెన్షియల్సును కొరుటకు బదులుగా, వాడుకరులు వారి స్వంత కేర్బెరోస్ క్రెడన్షియల్సును వుపయోగించుటకు అనుమతించును.
FreeRADIUS
FreeRADIUS అనునది యింటర్నెట్ ధృవీకరణ డెమోన్, ఇది RADIUS నిభందనను అభివృద్ది పరచినది, RFC 2865 (మరియు యితరములు) నందు నిర్వచించినట్లు. ఇది నెట్వర్క్ యాక్సెస్ సర్వర్స్ (NAS బాక్సెస్)ను డైయిల్-అప్ వాడుకరుల కొరకు ధృవీకరణమును జరుపుటకు అనుమతించును. Red Hat Enterprise Linux 6.1 నందలి FreeRADIUS వర్షన్ 2.1.10కు నవీకరించబడెను.
కేర్బెరోస్
కేర్బెరోస్ అనునది నెట్వర్కుడ్ ధృవీకరణ వ్యవస్థ యిది కంప్యూటర్లు మరియు వాడుకరులు వొకరికొకరు, నమ్మదగిన మూడోవ్యక్తి KDC సహాయంతో ధృవీకరణ జరుపుకొనుటకు అనుమతించును. Red Hat Enterprise Linux 6.1 నందు, కేర్బెరోస్ (krb5 ప్యాకేజీతో అందించిన) వర్షన్ 1.9కు నవీకరించబడెను.
6. రక్షణ
OpenSCAP
OpenSCAP అనునది వోపెన్ సోర్స్ లైబ్రరీల సమితి అది సెక్యూరిటి కాంటెంట్ ఆటోమేషన్ ప్రొటోకాల్ (SCAP) ప్రమాణాలకు నేషనల్ యిన్‌స్టిట్యూట్ ఆప్ స్టాన్డర్డ్స్ అంట్ టెక్నాలజీ (NIST) నుండి తోడ్పాటునిచ్చును. OpenSCAP అనునది SCAP మూలకాలకు తోడ్పాటునిచ్చును:
కామన్ వల్నర్‌బిలిటీస్ అండ్ యెక్సుపోజర్స్ (CVE)
కామన్ ప్లాట్‌ఫాం ఎన్యుమరేషన్ (CPE)
కామన్ కాన్ఫిగరేషన్ యెన్యూమరేషన్ (CCE)
కామన్ వల్నర్‌బిలిటీ స్కోరింగ్ సిస్టమ్ (CVSS)
ఓపెన్ వల్నర్‌బిలిటి అండ్ ఎసెస్‌మెంట్ లాంగ్వేజ్ (OVAL)
అదనంగా, సిస్టమ్ ఆకృతీకరణ గురించి SCAP నివేదికలను సృష్టింపచేయుటకు openSCAP ప్యాకేజీ వొక అనువర్తనాన్ని చేర్చును. Red Hat Enterprise Linux 6.1 నందు OpenSCAP యిప్పుడు పూర్తిగా తోడ్పాటు అందించబడుచున్న ప్యాకేజీ.
SPICE కొరకు స్మార్టుకార్డ్ తోడ్పాటు
సింపల్ ప్రొటోకాల్ ఫర్ యిండిపెండెంట్ కంప్యూటింగ్ యెన్విరాన్మెంట్స్ (SPICE) అనునది వర్చ్యువల్ యెన్విరాన్మెంట్ల కొరకు రూపొందించిన రిమోట్ డిస్‌ప్లే ప్రొటోకాల్. స్థానిక సిస్టమ్ నుండి కాని లేదా సర్వర్‌కు నెట్వర్కు యాక్సెస్ గల యే సిస్టమ్ నుండైనా SPICE వాడుకరులు వర్చ్యులైజ్డు డెస్కుటాప్ లేదా సర్వర్‌ను దర్శించగలరు. SPICE ప్రొటోకాల్ ద్వారా స్మార్టుకార్డ్ పాస్‌దౌకు తోడ్పాటును Red Hat Enterprise Linux 6.1 పరిచయం చేస్తోంది.
ఇకపై చదువుటకు
రక్షణ మార్గదర్శిని స్థానికంగా మరియు దూరస్థంగా దాడిని, దోపిడీని మరియు హానికారక చర్యలనుండి వర్కుస్టేషన్లను మరియు సర్వర్లను రక్షించుటకు విధానాలను వినియోగదారులకు మరియు నిర్వహణాధికారులకు తెలుపును.
7. సంస్థాపన
Emulex 10GbE PCI-E Gen2 మరియు Chelsio T4 10GbE నెట్వర్కు యెడాప్టర్ల కొరకు Red Hat Enterprise Linux 6.1 నందు సంస్థాపన మరియు బూట్ తోడ్పాటు జతచేయబడింది. అదనంగా, UEFI సిస్టమ్సుపై 4KB సెక్టార్ పరిమాణ వాల్యూమ్‌లను బూట్ చేయు తోడ్పాటుతో GRUB బూట్‌లోడర్ నవీకరించబడింది.
Red Hat Enterprise Linux 6.1 నందలి సంస్థాపకి తోడ్పాటులేని హార్డువేర్ ప్లాట్‌ఫాంలను గుర్తించి మరియు వాడుకరికి ప్రకటనను అందించును. సంస్థాపన కొనసాగించబడును, అయితే కింది సందేశం ప్రదర్శించబడును
This hardware (or a combination thereof) is not supported by Red Hat. For more information on supported hardware, please refer to http://www.redhat.com/hardware.
iSCSI యెడాప్టర్ల కొరకు మెరుగైన తోడ్పాటు
సంస్థాపన మరియు బూట్ సమయమందు iSCSI యెడాప్టర్ల కొరకు Red Hat Enterprise Linux 6.1 మెరుగైన తోడ్పాటును అందించును, పాక్షిక ఆఫ్‌లోడ్ iSCSI యోడాప్టర్స్ కొరకు తోడ్పాటును మరియు సంస్థాపననందు iSCSI నిల్వకు లాగిన్ క్రెడన్షియల్సును వేరుచేయగల సామర్థ్యం కలిగివుంది (ఉ.దా. ఎమ్యులెక్స్ టైగర్ షార్క్ యెడాప్టర్).
iBFT నందు BIOS iSCSI అమర్పుల స్వయంచాలక-గుర్తింపు వుపయోగించి iSCSI నందు సంస్థాపనకు Red Hat Enterprise Linux 6 తోడ్పాటునిచ్చును. ఏమైనప్పటికి, సంస్థాపన తర్వాత iBFT అమరికల పునఃఆకృతీకరణ అనునది సాధ్యపడదు. Red Hat Enterprise Linux 6.1 నందు, TCP/IP అమరికలు మరియు iSCSI సిద్దీకరణి ఆకృతీకరణ అనునవి బూట్ సమయమందు iBFT అమర్పుల నుండి గతికంగా ఆకృతీకరించబడును.
8. కంపైలర్ మరియు సాధనములు
సిస్టమ్‌టాప్
సిస్టమ్‌టాప్ అనునది ట్రేసింగ్ మరియు ప్రోబింగ్ సాధనము అది వినియోగదారులు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క క్రియలను అధ్యయనం చేయుటకు మరియు పర్యవేక్షించుటకు అనుమతించును (ప్రత్యేకించి, కెర్నల్). ఇది netstat, ps, top, మరియు iostat వంటి సాధనముల అవుట్పుట్‌కు సమానమైన సమాచారాన్ని అందించును; ఏమైనప్పటికి, సేకరించిన సమాచారము కొరకు మరిన్ని ఫల్టరింగ్ మరియు విశ్లేషణ ఐచ్చికాలను అందించుటకు సిస్టమ్‌టాప్ రూపొందించబడెను.
Red Hat Enterprise Linux 6.1 నందలి సిస్టమ్‌టాప్ 1.4 రూపాంతరం(వర్షన్) కు నవీకరించబడింది, వీటిని అందిస్తూ:
GNU ప్రోజెక్ట్ డీబగ్గర్ (సాధారణంగా GDBగా పిలువబడును) C, C++, మరియు యితర భాషలనందు వ్రాసిన ప్రోగ్రాములను నియంత్రిత శైలిలో నిర్వర్తించుట ద్వారా డీబగ్ చేయును, అప్పుడు వాటి డాటాను ముంద్రించును. Red Hat Enterprise Linux 6.1 నందు GDB 7.2 వర్షన్‌కు నవీకరించబడింది, చాలా బగ్ పరిష్కారాలను మరియు విస్తరణలను అందిస్తోంది, యిది పైథాన్ స్క్రిప్టింగ్ విశేషణాలకు, మరియు C++ డీబగ్గింగ్‌కు విస్తరింపులను అందిస్తోంది.
పర్ఫామెన్స్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ యింటర్ఫేస్ (PAPI)
Red Hat Enterprise Linux 6.1 పర్ఫార్మెన్స్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ యింటర్ఫేస్ (PAPI) పరిచయం చేస్తోంది. నవీక మైక్రోప్రోసెసర్స్ పై హార్డువేర్ పర్ఫార్మెన్స్ కౌంటర్సుకు PAPI అనునది క్రాస్-ప్లాట్‌ఫాం యింటర్ఫేసెస్ విశదీకరణ. ఈ కౌంటర్స్ అనునది ఘటనలను లెక్కవేసే రిజిస్టర్స్ యొక్క చిన్న సమితిగా వున్నాయి, యివి ప్రోసెసర్ యొక్క ప్రమేయంకు చెందిన ఫలానా సంకేతాల సంభవాలు. అప్లికేషన్ పనితనపు విశ్లేషణ నందు మరియు ట్యూనింగ్ నందు యీ ఘటనల పర్యవేక్షణ చాలా వుపయోగాలను కలిగివుంది.
OProfile
OProfile అనునది లైనక్స్ సిస్టమ్సు కొరకు సిస్టమ్-వైడ్ ప్రొఫైలర్. ప్రొఫైలింగ్ అనునది పారదర్శకంగా బ్యాక్‌గ్రౌండ్ నందు నడుచును మరియు ప్రొఫైల్ డాటా యే సమయం వద్దనైనా సేకరించగలము. Red Hat Enterprise Linux 6.1 నందు OProfile 0.9.6-12 వర్షన్‌కు నవీకరించబడెను, యిది AMD 12h/14h/15h ఫ్యామిలీ ప్రోసెసర్సుకు మరియు ఇంటెల్ వెస్టుమెరె కు చెందిన ఘటనలకు తోడ్పాటును అందించును.
Valgrind
ప్రొఫైల్ అనువర్తనములను వివరణాత్మకంగా వుపయోగించుటకు గతిక విశ్లేషణా సాధనాలు (డైనమిక్ యెనాలసిస్ టూల్స్) నిర్మించుటకు Valgrind అనునది వొక యిన్‌స్ట్రుమెంటేషన్ ఫ్రేమ్‌వర్క్. చాలా వరకు మెమొరీ నిర్వహణ మరియు త్రెడింగ్ సమస్యలను స్వయంచాలనంగా గుర్తించుటకు Valgrind సాధనాలను వుపయోగించబడును. మీ అవసరాలకు తగునట్లు కొత్త ప్రొఫైలింగ్ సాధనాలను నిర్మించుటకు Valgrind సూట్ సాధనాలను కలిగివుంటుంది.
Red Hat Enterprise Linux 6.1 అనునది Valgrind వర్షన్ 3.6.0 ను అందించును.
GNU కంపైలర్ కలక్షన్ (GCC)
GNU కంపైలర్ కలక్షన్ (GCC) చేర్చబడెను, వీటితో కలిపి, C, C++, మరియు Java GNU కంపైలర్స్ మరియు సంభందిత మద్దతు లైబ్రరీలు. Red Hat Enterprise Linux 6 అనునది GCC యొక్క వర్షన్ 4.4ను అందించును, అది కింది విశేషణములను మరియు విస్తరింపులను కలిగివుంది:
IBM z196 కొత్త సూచన తోడ్పాటు మరియు ఆప్టిమైజేషన్లు
IBM z10 ప్రిఫెచ్ సూచన తోడ్పాటు మరియు ఆప్టిమైజేషన్లు
libdfp
libdfp లైబ్రరీ అనునది Red Hat Enterprise Linux 6.1 నందు నవీకరించబడెను. libdfp అనునది డెసిమల్ ఫ్లోటింగ్ పాయింట్ గణిత లైబ్రరీ, Power మరియు s390x ఆకృతులపై glibc గణిత ప్రమేయాలకు ప్రత్యామ్నాయంగా అందుబాటులో వుంది, మరియు వుప చానళ్ళనందు అందుబాటులో వుంది.
ఎక్లిప్స్
ఎక్లిప్స్ అనునది శక్తివంతమైన అభివృద్ది పరిసరం అది అభివృద్ది కార్యక్రమం యొక్క ప్రతి దశకు సాధనాలను అందించును. వినియోగం సులభతరం చేయుటకు అది పూర్తిగా ఆకృతీకరించగల వాడుకరి అంతరవర్తికి కలుపుట జరిగింది, ప్లగ్‌బుల్ ఆకృతిని అందించును అది వివిధ మార్గాలలో పోడిగింపునకు అనుమతించును.
Red Hat Enterprise Linux 6.1 నందు ఎక్లిప్స్ అభివృద్ది పరిసరం యొక్క నవీకృత రూపాంతరం(వర్షన్) అందుబాటులో వుంది, కింది నవీకరణలను మరియు విస్తరింపులను అందిస్తోంది:
అన్ని ముఖ్య ప్లగిన్లు రీఫ్రెష్ చేయబడినవి, Valgrind మరియు OProfile చేర్పిక జరిగింది C మరియు C++తో పనిచేయుటకు సాధనాలు చేర్చబడినవి.
వర్కుస్పేస్ విషయాల కొరకు విస్తరిత మూలాధార ఫిల్టరింగ్
C, C++ మరియు Java కోడ్ బేసెస్‌తో పనిచేయునప్పుడు పనితనపు విస్తరింపులు
ఐస్‌డ్‌టీ
OpenJDK కొరకు కొత్త ఐస్‌డ్‌టీ వెబ్ వోపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్ ప్లగిన్ మరియు వెబ్‌స్టార్ట్ అభివృద్ది.
వెబ్ పేజీనందు ఇమిడ్చి వుంచిన జావా ఆప్లెట్లను లోడ్ చేయుటకు ఫైర్‌ఫాక్స్ వంటి బ్రౌజర్లను అనుమతించును
JNLP (జావా నెట్వర్క్ లాంచింగ్ ప్రొటోకాల్స్) ఫైళ్ళను దించుటకు ఫ్రేమ్‌వర్క్ అందించును
9. క్లస్టరింగ్
క్లిష్టమైన వుత్పాదక సేవలకు విశ్వాసతను, సర్దుబాటును, మరియు అందుబాటును పెంచుటకు సంయుక్తంగా పనిచేసే బహుళ కంప్యూటర్లు (నోడ్లు)నే క్లస్టర్స్ అందురు. పనితనమునకు, అధిక-అందుబాటుకు, భార సమతుల్యమునకు, మరియు ఫైల్ భాగస్వామ్యమునకు వంటి వివిధ అవసరాలకు అధిక అందుబాటు అనునది Red Hat Enterprise Linux 6 వుపయోగించి వివిధ ఆకృతీకరణలనందు నియెగించవచ్చును.
Red Hat Enterprise Linux 6.1 నందు క్లస్టరింగ్‌కు కింది ముఖ్య నవీకరణలు అందుబాటులో వున్నాయి
Rgmanager అనునది యిప్పుడు క్లిష్టమైన మరియు క్లిష్టంకాని వనరులు అను విధానానికి తోడ్పాటునిచ్చును
సిస్టమ్ నిర్వహణాధికారులు కమాండ్ లైన్ సాధనాలను వుపయోగించి యిప్పుడు క్లస్టర్‌ను ఆకృతీకరించగలరు మరియు నడుపగలరు. cluster.conf ఆకృతీకరణ ఫైలును మానవీయంగా సరికూర్చుటకు లేదా గ్రాఫికల్ ఆకృతీకరణ సాధనం Luci వుపయోగించుటకు బదులుగా, ఈ విశేషణం వొక ప్రత్యామ్నాయం అందించును.
Red Hat Enterprise Linux KVM హోస్ట్స్ పైని Red Hat Enterprise Linux High Availability అనుదానికి యిప్పుడు పూర్తిగా తోడ్పాటు యీయబడుతోంది
కేంద్రీయ క్లస్టర్ డెమోన్స్ మరియు వుప-భాగాల నుండి కాంప్రహెన్సివ్ SNMP ట్రాప్ తోడ్పాటు
ఒక నోడ్ అది quorum కోల్పోయినప్పుడు తనంతటతానే పునఃప్రారంభమగుటను అదనపు వాచ్‌డాగ్ యింటిగ్రేషన్ అనుమతించును
ఇకపై చదువుట
క్లస్టర్ సూట్ సమీక్ష పత్రము Red Hat Enterprise Linux 6 కొరకు Red Hat క్లస్టర్ సూట్ యొక్క సమీక్షను అందించును. అదనంగా, అధిక అందుబాటు నిర్వహణ పత్రము Red Hat Enterprise Linux 6 కొరకు Red Hat క్లస్టర్ సిస్టమ్సు యొక్క ఆకృతీకరణను మరియు నిర్వహణను వివరించును.
10. వర్చ్యులైజేషన్
vhost
కొత్త హోస్ట్ కెర్నల్ నెట్వర్కింగ్ బాకెండ్, vhost, Red Hat Enterprise Linux 6.1 నందు పూర్తిగా తోడ్పాటుగల విశేషణం. vhost యూజర్‌స్పేస్ అభివృద్ది పై త్రౌపుట్‌ను మరియు లేటెన్సీను అందించును.
qcow2
qcow2 చిత్ర ఫార్మాట్ యిప్పుడు మెటాడాటా యొక్క తోడ్పాటును మద్దతించును. అదనంగా, బాహ్య qcow2 చిత్రాలను వుపయోగించి లైవ్ స్నాప్‌షాట్సుకు తోడ్పాటు జతచేయబడెను.
బ్లాక్ I/O లేటెన్సీ మెరుగుదలలు
ioeventfd యిప్పుడు అందుబాటులో వుంది, బ్లాక్ I/O యొక్క త్వరిత నోటీసును అందించును.
కెర్నల్ సేమ్‌పేజ్ మెర్జింగ్ (KSM)
Red Hat Enterprise Linux 6 నందలి KVM హైపర్విజర్ కెర్నల్ సేమ్‌పేజ్ మెర్జింగ్ (KSM)ను అందించును, యిది KVM గెస్టులను సరిసమాన మెమొరీ పేజీలను పంచుకోనిచ్చుట ద్వారా జరుగును. పేజీ భాగస్వామ్యం అనునది మెమొరీ నకలును తగ్గించును మరియు మరింత మెరుగుగా నడుచుటకు అలాంటి గెస్టు ఆపరేటింగ్ సిస్టమ్సుతోటే హోస్టును అనుమతించును.
Red Hat Enterprise Linux 6.1 నందలి KSM పారదర్శక హ్యూజ్‌పేజ్ తెలిసిందైవుండును. KSM అనునది హ్యూజ్‌పేజీల నందలి సబ్‌పేజీలను స్కాన్ చేయగల సామర్థ్యాన్ని కలిగివుంది మరియు మెర్జింగ్ సాధ్యమైనప్పుడు వాటిని విడగొట్టును.
అదనంగా, యిప్పుడు KSM చేతనీకరణను ఒక్కో-VM ఆధారంగా నియంత్రించగలము.
PCI పరికర అప్పగింత మెరుగుదలలు
PCI ఆకృతీకరణ స్పేస్ యాక్సెస్ మెరుగుపరచబడింది, PCI పరికరాల బోర్డర్ సెట్ చేతనీకరణ గెస్టు VMలకు పరకర-అప్పగింత చేయవలెను.
KVMClock మెరుగుదలలు
Red Hat Enterprise Linux 6.1 నందు, టైమ్ స్టాంప్ కౌంటర్ (TSC) సింక్రోనైజేషన్ యిప్పుడు గెస్టు బూటప్ నందు లేదా హోస్ట్ CPU హాట్-ప్లగ్ చేసినప్పుడు స్వయంచాలనంగా గుర్తించబడును. అదనంగా, TSC సింక్రోనైజేషన్ తరచుదనం అనునది లైవ్ మైగ్రేషన్ తరువాత సర్దుబాటు చేయబడును.
QEMU మానిటర్
అదనంగా, కొత్త drive_del ఆదేశం libvirtను గెస్టునుండి బ్లాక్ పరికరమును సురక్షితంగా తీసివేయుటకు అనుమతించును.
సాధారణ నవీకరణలు మరియు మెరుగుదలలు
ఇప్పుడు qemu-kvm పైని గరిష్ట ప్రదర్శనా రెజొల్యూషన్ 2560x1600 పిగ్జెల్స్
Red Hat Enterprise Linux 6.1 అనునది అన్ని గెస్టులకు యెమ్యులేటెడ్ ఇంటెల్ HDA సౌండ్ కార్డ్ ఎక్సుపోజ్ చేయగల సామర్థ్యాన్ని చేర్చినది. ఈ నవీకరణ Windows 7 యొక్క 64-బిట్ వర్షన్లతో కలుపుకొని చాలా గెస్టులకు స్వాభావిక శబ్ధ తోడ్పాటును చేతనం చేయుచున్నది.
QEMU కార్ డివైజ్ ప్లో కంట్రోల్ చేతనంచేయబడెను
win-virtio-blk డ్రైవర్ కొరకు మెసేజ్ సిగ్నల్డ్ యింటరప్ట్స్ (MSI) మెరుగుపరచబడెను
గెస్టు యొక్క బూట్ పరికరాల యెంపికకు/ప్రాముఖ్యతకు కొత్త ప్రామాణిక అంతర్‌వర్తి
లేవ్ మైగ్రేషన్ కొరకు స్థిర మెరుగుదలలు
QEMU యూజర్‌స్పేస్ స్టాటిక్ ట్రేసింగ్
వర్చ్యువల్ డిస్క్ ఆన్‌లైన్ గతిక పునఃపరిమాణ విశేషణం
gpu, pci బస్ కంట్రోలర్, isa బస్ కంట్రోలర్ వంటి క్లిష్ట పరికరాల pci హాట్ అన్‌ప్లగ్ దాచివుంచును
11. ఎన్‌టైటిల్‌మెంట్
Red Hat సబ్‌స్క్రిప్షన్ నిర్వాహకి మరియు ఎన్‌టైటిల్‌మెంట్స్ ప్లాట్‌ఫాం
ప్రభావిత సాఫ్టువరే మరియు వ్యవస్థీకృత నిర్వహణ అనుదానికి సాఫ్టువేర్ యిన్వెంటరీను సంభాలించుటకు మెకానిజం అవసరం — అది వుత్పత్తుల రకాలను మరియు ఆ సాఫ్టువేర్ యెన్ని సిస్టమ్సుపై సంస్థాపించినది రెంటిని చూస్తుంది. సమాంతరంగా Red Hat Enterprise Linux 6.1 నందు, Red Hat కొత్త యెన్‌టైటిల్‌మెంట్ ప్లాట్‌ఫాంను ప్రవేశపెడుతోంది అది వొక సంస్థ కొరకు సాప్టువేర్ యెన్‌టైటిల్‌మెంట్స్ మరియు అత్యంత ప్రభావవంతమైన కాంటెంట్ డెలివరీ సిస్టమ్‌ను అందించును. స్థానిక సిస్టమ్సునందు, వాటి మరియు వాటికి కేటాయించిన సబ్‌స్క్రిప్షన్లను నిర్వహించుటకు, కొత్త Red Hat సబ్‌స్క్రిప్షన్ మెనేజర్ GUI మరియు కమాండ్-లైన్ సాధనాలు అందిస్తోంది. సబ్‌స్క్రిప్షన్లను సంభాలించుటకు మంచి విధానం వుండుట, మా వినియోగదారులుకు వారి సాఫ్టువేర్ కంపైలెన్స్ నిర్వహించుటలో దోహద పడును మరియు Red Hat వుత్పత్తులను సంస్థాపించుట మరియు నవీకరించుట సులభతరం అగును.
Red Hat Enterprise Linux 6 కొత్త స్వయంచాలక బగ్ నివేదీకరణ సాధనం (ABRT) ప్రవేశపెడుతోంది. స్థానిక సిస్టమ్‌పై సాఫ్టువేర్ క్రాషెస్ వివరాలను ABRT లాగ్ చేయును, మరియు Red Hat తోడ్పాటునకు సమస్యలను నివేదించుటకు (గ్రాఫికల్ మరియు కమాండ్ లైన్ అధారిత) అంతరవర్తిలను అందించును. Red Hat Enterprise Linux 6.1 నందు, ABRT వర్షన్ 1.1.16 నకు నవీకరించబడెను. ఈ నవీకరణ యితర బగ్ పరిష్కారాలు మరియు విస్తరింపులతో పాటు విస్తరిత గ్రాఫికల్ వాడుకరి అంతరవర్తి (GUI) అందిస్తోంది.
openCryptoki
openCryptoki అనునది PKCS#11 API యొక్క వర్షన్ 2.11 ను కలిగివుంది, IBM క్రిప్టోకార్డ్స్ కొరకు అభివృద్ది పరచబడెను. openCryptoki అనునది Red Hat Enterprise Linux 6.1 నందు మెరుగుపరచబడెను, చాలా బగ్ పరిష్కారాలను మరియు విస్తరింపులను అందించుచున్నది, మంచి పనితనం కూడా అందించుచున్నది.
OpenLDAP
OpenLDAP అనునది లైట్‌వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రొటోకాల్ (LDAP) అనువర్తనాల మరియు అభివృద్ది సాధానల వోపెన్ సోర్స్ సూట్. Red Hat Enterprise Linux 6.1 నందలి OpenLDAP అనునది 2.4.23 వర్షన్‌కు నవీకరించబడెను. ఈ నవీకృత OpenLDAP వర్షన్ అనునది నెట్వర్క్ సెక్యూరిటి సర్వీసెస్ (NSS) క్రిప్టోగ్రఫీ లైబ్రరీలను వుపయోగిస్తోంది, OpenSSL పునఃస్థాపిస్తోంది.
TigerVNC
TigerVNC అనునది వర్చ్యువల్ నెట్వర్క్ కంప్యూటింగ్ (VNC) కొరకు క్లైంట్ మరియు సర్వర్ సాఫ్టువేర్‌ను అందించును. VNC అనునది దూరస్థ డిస్ప్లే సిస్టమ్, అది వాడుకరిని నెట్వర్కు అనుసంధానం నందు కంప్యూటింగ్ డెస్కుటాప్ యెన్విరాన్మెంటును దర్శించుటకు అనుమతించును. TigerVNC వర్షన్ 1.1.0 కు నవీకరించబడెను, చాలా బగ్ పరిష్కారాలను మరియు విస్తరిత యెన్క్రిప్షన్ తోడ్పాటును అందించును.
tuned
tuned అనునది సిస్టమ్ ట్యూనింగ్ డెమోన్ అది సిస్టమ్ మూలకాలను పర్యవేక్షించును మరియు సిస్టమ్ అమర్పులను గతికంగా ట్యూన్ చేయును. ktune(సిస్టమ్ ట్యూనింగ్ కొరకు స్టాటిక్ మెకానిజం) వుపయోగించుట, tuned అనునది పరికరాలను ట్యూన్ చేయగలదు మరియు పర్యవేక్షించగలదు (ఉ.దా. హార్డ్ డిస్కు డ్రైవ్స్ మరియు ఈథర్నెట్ పరికరాలు). Red Hat Enterprise Linux 6.1 నందు, tuned ట్యూనింగ్ ప్రొఫైల్స్ అనునవి యిప్పుడు s390x ఆకృతులకు తోడ్పాటును కలిగివున్నాయి.
A. పునర్విమర్శిత(రివిజన్) చరిత్ర
Revision History
Revision 1-0
Tue Mar 22 2011
రియాన్లెర్చ్
Red Hat Enterprise Linux 6.1 విడుదల నోడ్స్ ప్రధమ రూపాంతంరం