Product SiteDocumentation Site

Red Hat Enterprise Linux 6

Release Notes

Red Hat Enterprise Linux 6.6 విడుదల నోట్స్

Edition 6

Red Hat వినియోగదారి కాంటెంట్ సేవలు


Legal Notice

Copyright © 2014 Red Hat, Inc.
The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.
Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.
Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.
Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.
Java® is a registered trademark of Oracle and/or its affiliates.
XFS® is a trademark of Silicon Graphics International Corp. or its subsidiaries in the United States and/or other countries.
All other trademarks are the property of their respective owners.


1801 Varsity Drive
 RaleighNC 27606-2072 USA
 Phone: +1 919 754 3700
 Phone: 888 733 4281
 Fax: +1 919 754 3701

Abstract
Red Hat Enterprise Linux 6.6 నందు ఇంప్లిమెంట్ చేసిన మెరుగుదలలు మరియు హై-లెవల్ కవరేజ్‌ను విడుదల నోట్స్ అందించును. Red Hat Enterprise Linux కు చెందిన 6.6 నవీకరణకు అన్ని మార్పులపై విశదీకృత పత్రకీకరణ కొరకు, సాంకేతిక నోట్స్ చూడండి.

ముందుమాట
1. కెర్నల్
2. నెట్వర్కింగ్
3. రక్షణ
4. వర్చ్యులైజేషన్
5. నిల్వ
6. హార్డువేర్ చేతనపరచుట
7. పరిశ్రమ ప్రమాణాలు మరియు ధృవీకరణం
8. ధృవీకరణ మరియు ఇంటరాపరబిలిటీ
9. డెస్క్‌టాప్ మరియు గ్రాఫిక్స్
10. పనితనం మరియు స్కేలబిలిటీ
11. సాధారణ నవీకరణలు
A. కాంపోనెంట్ వర్షన్లు
B. పునర్విమర్శిత(రివిజన్) చరిత్ర

ముందుమాట

Red Hat Enterprise Linux చిన్న విడుదల అనునది స్వతంత్ర విస్తరింపులు, రక్షణ మరియు బగ్ పరిష్కారం ఎర్రాటా. యొక్క సమాహారం. ఈ చిన్న విడుదలనందు Red Hat Enterprise Linux 6 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు దాని తోటి అనువర్తనాలకు చేసిన ముఖ్య మార్పులు గురించి Red Hat Enterprise Linux 6.6 విడుదల నోట్స్ పత్రకీకరణ చేసెను. ఈ చిన్న విడుదల నందు చేసిన మార్పులు, (అనగా, బగ్ పరిష్కారాలు, జతచేసిన విస్తరింపులు, మరియు తెలిసిన విషయాలు) పై విశదీకృత నోట్స్ ఇక్కడ అందుబాటులో వున్నాయి. Technical Notes. సాంకేతిక నోట్స్ పత్రము నందు ప్రస్తుతం అందుబాటులో వున్న సాకేంతిక ముందస్తువీక్షణలను అవి అందించే ప్యాకేజీలతో సహా జాబితా చేయును.

ముఖ్యమైన

ఆన్‌లైన్ Red Hat Enterprise Linux 6.6 విడుదల నోట్స్, ఆన్‌లైన్ నందు ఇక్కడ వున్నవి, ఖచ్చితమైనవిగా, సరికొత్త వర్షన్‌గా పరిగణించాలి. విడదలకు సంబందించి ప్రశ్నలువున్న వినియోగదారులు వారి Red Hat Enterprise Linux వర్షన్‌కు చెందిన ఆన్‌లైన్ విడుదల మరియు సాంకేతిక నోట్స్ సంప్రదించమని సూచించడమైంది.
వ్యవస్థ యొక్క ఇతర వర్షన్లతో పోల్చినప్పుడు Red Hat Enterprise Linux 6 యొక్క సామర్ధ్యాలు మరియు పరిమితులు అనునవి https://access.redhat.com/site/articles/rhel-limits వద్దని సమాచార నిధి వ్యాసంనందు ఆందుబాటులో ఉన్నాయి.
Red Hat Enterprise Linux లైఫ్ సైకిల్ గురించిన సమాచారం మీకు కావలెనా, https://access.redhat.com/support/policy/updates/errata/ చూడండి.

Chapter 1. కెర్నల్

మెరుగైన SCSI యూనిట్ ఎటెన్షన్ సంభాలన

Red Hat Enterprise Linux 6.6 నందలి కెర్నల్ అనునది, udev ఈవెంట్ మెకానిజం ద్వారా SCSI పరికరాలనుండి స్వీకరించబడిన ప్రత్యేక SCSI యూనిట్ ఎటెన్షన్ కండీషన్స్‌కు స్పందించుడానికి వాడుకరి స్పేస్‌ను చేతనించుటకు, మెరుగుపరచబడింది.
  • 3F 03 ఎంక్వైరీ డాటా మార్చబడెను
  • 2A 09 కెపాసిటీ డాటా మార్చబడెను
  • 38 07 థిన్ ప్రొవిజనింగ్ సాఫ్ట్ త్రెష్‌హోల్డ్ చేరుకొనెను
  • 2A 01 మోడ్ పారామితులు మార్చబడెను
  • 3F 0E నివేదించిన LUNS డాటా మార్చబడెను
తోడ్పాటునీయబడు యూనిట్ ఎటెన్షన్ కండీషన్స్ కొరకు అప్రమేయ udev నియమాలు libstoragemgmt ప్యాకేజీ చే అందించబడును. udev నియమాలు /lib/udev/rules.d/90-scsi-ua.rules ఫైల్ నందు ఉంటాయి.
అప్రమేయ నియమాలు నివేదించిన LUNS డేటా మార్చబడెను యూనిట్ ఎటెన్షన్ సంభాలించును. కెర్నల్ జనియింపచేయగల ఇతర ఘటనలను పేర్కొనుటకు అదనపు ఉదాహరణ నియమాలు ఈయబడెను. SCSI లక్ష్యంపైన లేని లాజికల్ యూనిట్ నంబర్స్ (LUNs) ను అప్రమేయ నియమాలు స్వయంచాలకంగా తీసివేయవని గమనించండి.
ఎంచేతంటే SCSI యూనిట్ ఎటెన్షన్ కండీషన్స్ అనునవి SCSI ఆదేశంకు ప్రతిస్పందనగా మాత్రమే నివేదించబడును, క్రియాశీలకంగా SCSI పరికరంకు ఏ ఆదేశాలు పంపకపోతే ఏ నియమాలు నివేదించబడవు.
అప్రమేయ ప్రవర్తన అనునది udev నియమాలను సవరించుటద్వారా లేదా తీసివేయుటద్వారా కస్టమైజ్ చేయవచ్చు. libstoragemgmt RPM ప్యాకేజీ సంస్థాపించకపోతే, అప్రమేయ నియమాలు ఉండవు. ఆ ఘటనలకు ఎటువంటి udev నియమాలు లేకపోతే, ఎటువంటి చర్య తీసుకోబడదు, అయితే ఘటనలు కెర్నల్ చేత పుట్టించబడతాయి.

Open vSwitch కెర్నల్ మాడ్యూల్

Red Hat లైయర్డ్ ఉత్పత్తుల కొరకు Open vSwitch కెర్నల్ మాడ్యూల్‌ను Red Hat Enterprise Linux 6.6 చేర్చినది. సహ యూజర్-స్పేస్ ఉపలభ్యాలు కలిగివున్న ఉత్పత్తులతోనే Open vSwitch తోడ్పాటునిచ్చును, Open vSwitch ఫంక్షన్ కాదు మరియు ఉపయోగించుటకు చేతనం చేయలేము. మరింత సమాచారం కొరకు, కింది సమాచార నిధి వ్యాసం చూండండి: https://access.redhat.com/knowledge/articles/270223.

Chapter 2. నెట్వర్కింగ్

HPN పొడిగింతకు మార్పులు

Red Hat Enterprise Linux 6.6 తో మొదలుపెట్టి ఇక, హై పర్ఫార్మెన్స్ నెట్వర్కింగ్ (HPN) పొడిగింత ప్రత్యేక ఉత్పత్తి వలె అందుబాటులో ఉండదు. బదులుగా, HPN పొడిగింత నందు కనుగొన్న ఫంక్షనాలిటీ అనునది ప్రధాన ఉత్పత్తికి జోడించబడును మరియు Red Hat Enterprise Linux ప్రధాన ఛానల్ నందు భాగముగా అందించబడును.
HPN ఫంక్షనాలిటీను ప్రధాన Red Hat Enterprise Linux 6 ఉత్పత్తినకు కలపడానికి అదనంగా, కన్వర్జ్‌డ్ ఈథర్నెట్ (RoCE) ఇంప్లిమెంటేషన్ పైని RDMA నవీకరించబడెను. RoCE అనునది నోడ్-నుండి-నోడ్ సంప్రదింపు కొరకు గ్లోబల్ ఐడెంటిఫైర్ లేదా GID-ఆధార అడ్రెసింగ్ ఉపయోగించును. గతంలో GIDల ఎన్కోడింగ్, ఈథర్నెట్ ఇంటర్ఫేస్ MAC చిరునామా VLAN ID (ఒకవేళ వాడితే) తో సహా ఉపయోగించి చేయబడేది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, RoCE ప్రొటోకాల్‌ను నడిపే కంప్యూట్ ఎంటిటీకు అది VLAN-టాగ్‌డ్ అని తెలియదు. కనుక కంప్యూట్ ఎంటిటీ కొన్నిసార్లు సరికాని GID సృష్టించగలదు లేదా తలంచగలదు, అది అనుసంధాన సమస్యకు దారితీయగలదు. ఈ నవీకృత RoCE ఇంప్లిమెంటేషన్ ఈ సమస్యను RoCE GIDలు ఎన్కోడ్ చేయబడుతున్న విధానాన్ని మార్చడంద్వారా పరిష్కరించును, మరియు బదులుగా ఈథర్నెట్ ఇంటర్ఫేస్ యొక్క ఐపి చిరునామాలపై ఆధారపడకుండా చేయును. వైర్ ప్రొటోకాల్ ఫార్మాట్ నందలి ఈ మార్పువలన అనుసంధానం స్థిరంగావుండునట్లు చూసుకొనుటకు RoCE ప్రొటోకాల్ ఉపయోగించే అన్ని వ్యవస్థలు Red Hat Enterprise Linux 6.6 కు నవీకరించబడాలి.
అదనపు సమాచారం కొరకు దయచేసి ఈ Red Hat సమాచార నిధి వ్యాసం చూడండి: https://access.redhat.com/site/articles/971333.

Chapter 3. రక్షణ

SCAP రక్షమ మార్గదర్శని

scap-security-guide ప్యాకేజీ Red Hat Enterprise Linux 6.6 నందు చేర్చబడెను, అది రక్షణ మార్గదర్శనాన్ని, ప్రాథమికసూత్రాలను, మరియు సెక్యూరిటీ కాంటెంట్ ఆటోమేషన్ ప్రొటోకాల్ (SCAP) ఉపయోగించే సంబందిత క్రమబద్ధీకరణ యాంత్రికతను అందించును. నిర్దేశించిన రక్షణ విధానపు అవసరాలనుబట్టి సిస్టమ్ సెక్యూరిటీ కంపైలెన్స్ జరుపుటకు తప్పనిసరైన డేటాను SCAP రక్షణ మార్గదర్శని కలిగివుంటుంది; వ్రాతపూర్వక వివరణ మరియు స్వయంచాలక పరీక్ష (probe) రెండూ చేర్చబడెను. పరీక్షను స్వయంచాలనం చేయడంద్వారా, రోజువారీ సిస్టమ్ కంపైలెన్స్ నిర్ధారించుటకు SCAP రక్షణ మార్గదర్శని అనువైన మరియు నమ్మకమైన మార్గాన్ని అందించును.

Chapter 4. వర్చ్యులైజేషన్

కొత్త ప్యాకేజీలు: hyperv-daemons

కొత్త hyperv-daemons ప్యాకేజీలు Red Hat Enterprise Linux 6.6 కు జతచేయబడెను. కొత్త ప్యాకేజీలు Hyper-V KVP డీమన్‌ను, గతంలో hypervkvpd ప్యాకేజీచే అందించబడేది, Hyper-V VSS డీమన్‌ను, గతంలో hypervvssd ప్యాకేజీచే అందించబడేది, మరియు hv_fcopy డీమన్‌ను, గతంలో hypervfcopyd ప్యాకేజీచే అందించబడేది, కలిగివున్నాయి. లైనక్స్ అతిథులు Microsoft Windows అతిధేయిపై Hyper-V తో నడుచుచున్నప్పుడు hyperv-daemons చేత అందించబడిన డీమన్లు సూట్ అవసరమగును.

Chapter 5. నిల్వ

device-mapper కు మెరుగులు

Red Hat Enterprise Linux 6.6 నందు device-mapper కు చాలా చెప్పుకోదగ్గ మెరుగుదలలు చేయబడినవి:
  • dm-cache device-mapper లక్ష్యం, ఇది నిదానమైన నిల్వ పరికరాల కొరకు వేగవంతమైన నిల్వ పరికరాలు క్యాషీ వలె వ్యవహరించుటకు అనుమతించును, ఇది సాంకేతిక ముందస్తుదర్శనం వలె చేర్చబడినది.
  • device-mapper-multipath ALUA ప్రియారిటీ చెకర్ అనునది, లోడ్ బాలెన్సింగ్ కొరకు ఉపయోగించగల ఎవైనా ఇతర పాత్‌లు ఉంటే గనుక, అభీష్ట పాత్ పరికరంను దాని స్వంత పాత్ సమూహంనందు ఉంచబోదు.
  • fast_io_fail_tmo పారామితి, multipath.conf ఫైలు నందలిది, ఇప్పుడు ఫైబర్ ఛానల్ పరికరాలపైనే కాక అదనంగా iSCSI పరికరాలపై కూడా పనిచేయును.
  • పెద్ద సంఖ్యలో మల్టీపాత్ పరికరాలు కలిగిన అమరికలనందు, device-maper మల్టీపాత్‌ sysfs ఫైళ్ళను సంభాలించింగలిగే మెరుగైన మార్గంలో, ఇప్పుడు మెరుగైన పనితనం సాధించవచ్చు.
  • కొత్త పారామితి force_sync, multipath.conf నందు పరిచయం చేయబడినది. ఈ పారామితి ఎసింక్రొనస్ పాత్ పరిశీలనలను అచేతనించును, దీని వలన పెద్ద సంఖ్యలో మల్టీపాత్ పరికరాలుగల అమర్పులపై CPU అనుసంధానాల సంఖ్యను పరిమితం చేయుటకు అవకాశముంటుంది.

dm-era సాంకేతిక ముందస్తుదర్శనం

device-mapper-persistent-data ప్యాకేజీ, సాంకేతిక ముందస్తుదర్శనం వలె విడుదలైన కొత్త dm-era డివైజ్ మాపర్ ఫంక్షనాలిటి ఉపయోగించుటలో సహాయపడగల సాధనాలు అందించును. వాడుకరి-తెలిపిన (ఎరా గా పిలువబడే) నియమితకాలంలో పరికరంపైన ఏ బ్లాక్స్ వ్రాయబడినవో dm-era ఫంక్షనాలిటీ గుర్తించును. మార్చిన బ్లాక్స్ జాడ తెలుసుకొనుటకు లేదా మార్పులను తిరిగిపొందిన తరువాత క్యాషీ పొందికను తిరిగివుంచుటకు ఈ ఫంక్షనాలిటీ బ్యాకప్ సాఫ్ట్‌వేర్‌ను అనుమతించును.

Chapter 6. హార్డువేర్ చేతనపరచుట

Intel Wildcat Point-LP PCH కు తోడ్పాటు

Broadwell-U PCH SATA, HD Audio, TCO Watchdog, మరియు I2C (SMBus) పరికర ఐడిలు డ్రైవర్ల కొరకు జతచేయబడెను, ఇది Red Hat Enterprise Linux 6.6 నందు తరువాతి తరం మొబైల్ ప్లాట్‌ఫాం కొరకు తోడ్పాటునిచ్చును.

VIA VX900 మీడియా సిస్టమ్ ప్రోసెసర్ కు తోడ్పాటు

VIA VX900 మీడియా సిస్టమ్ ప్రోసెసర్ Red Hat Enterprise Linux 6.6 నందు తోడ్పాటునిచ్చును.

Chapter 7. పరిశ్రమ ప్రమాణాలు మరియు ధృవీకరణం

ఫిప్స్ 140 పునఃక్రమబద్ధీకరణలు

ఫెడరల్ ఇన్ఫర్మేషన్ ప్రోసెసింగ్ స్టాన్డర్డ్స్ ప్రచురణలు (FIPS) 140 అనునది U.S. ప్రభుత్వపు భద్రతా ప్రమాణం అది భద్రతా వ్యవస్థ నందు సున్నితత్వాని కాపాడుతూ, అయితే క్లాసిఫైడ్ కాని సమాచారంను, వుపయోగించే క్రిప్టోగ్రఫిక్ మాడ్యూల్ చేత సంతృప్తి చెందాలి. ప్రమాణం అనునది నాల్గు వృద్దిచెందుతున్న, భద్రతా నాణ్యత స్థాయిలను అందించును: స్థాయి 1, స్థాయి 2, స్థాయి 3, స్థాయి 4. ఈ స్థాయిలు క్రిప్టోగ్రఫిక్ మాడ్యూళ్ళు నియమించే విస్తృత స్థాయి పొటెన్షియల్ అనువర్తనాలు మరియు ఎన్విరాన్మెంట్లను కవర్ చేయును. భద్రతా అవసరాలు అనునవి క్రిప్టోగ్రఫిక్ మాడ్యూల్ యొక్క అభివృద్ది మరియు భద్రతా రూపొందింపుకు సంబందించిన ప్రాంతాలను కవర్ చేయును. ఈ ప్రాంతాలు వీటిని కలిగివుండును, క్రిప్టోగ్రఫిక్ మాడ్యూల్ స్పెసిఫికేషన్, క్రిప్టోగ్రఫిక్ మాడ్యూల్ పోర్ట్స్ మరియు ఇంటర్ఫేసెస్; రోల్స్, సర్వీసెస్, మరియు ఆథెంటికేషన్; ఫైనైట్ స్టేట్ మోడల్; ఫిజికల్ సెక్యూరిటీ; ఆపరేషనల్ ఎన్విరాన్మెంట్; క్రిప్టోగ్రఫిక్ కీ నిర్వహణ; ఎలక్ట్రోమాగ్నటిక్ ఇంటర్ఫేస్/ఎనక్ట్రోమాగ్నటిక్ కంపాటబిలిటీ (EMI/EMC); సెల్ఫ్-టెస్ట్స్; డిజైన్ ఎస్యూరెన్స్; మరియు ఇతర దాడుల మెటిగేషన్.
కింది లక్ష్యాలు పూర్తిగా క్రమబద్ధీకరించబడెను:
  • NSS FIPS-140 స్థాయి 1
  • సూట్ B ఎలిప్టిక్ కర్వ్ క్రిప్టోగ్రఫీ (ECC)
కింది లక్ష్యాలు పునఃక్రమబద్ధీకరించబడెను:
  • OpenSSH (క్లైంట్ మరియు సర్వర్)
  • Openswan
  • dm-crypt
  • OpenSSL
  • సూట్ B ఎలిప్టిక్ కర్వ్ క్రిప్టోగ్రఫీ (ECC)
  • కెర్నల్ క్రిప్టో API
  • AES-GCM, AES-CTS, మరియు AES-CTR సైఫర్స్

Chapter 8. ధృవీకరణ మరియు ఇంటరాపరబిలిటీ

ఏక్టివ్ డైరెక్టరీతో ఉత్తమ ఇంటరాపరబిలిటీ

ఏక్టివ్ డైరెక్టరీతో Red Hat Enterprise Linux క్లైంట్ల ఉత్తమ ఇంటరాపరబిలిటీను చేతనించుటకు సిస్టమ్ సెక్యూరిటీ సర్వీసెస్ డీమన్ (SSSD) ఫంక్షనాలిటీ జతచేయబడెను, అది ఐండెంటిటీ నిర్వహణను లైనక్స్ మరియు విండోస్ నందు సులభతరం చేయును. వాడుకరులను మరియు సమూహాలను రిజాల్వ్ చేయడం మరియు సింగిల్ ఫారెస్ట్ నందలి నమ్మకమైన డొమైన్ల నుండి వాడుకరులను, DNS నవీకరణలను, సైట్ డిస్కవరీను ధృవీకరించుట, మరియు వాడుకరి మరియు సమూహ లుకప్స్ కొరకు NetBIOS పేరు ఉపయోగించుట అనునవి గుర్తించదగిన విస్తరింపులు.

IPA కొరకు అపాచీ మాడ్యూళ్ళు

ఒక అపాచీ మాడ్యూళ్ళ సమితి Red Hat Enterprise Linux 6.6 కు సాంకేతిక ముందస్తుదర్శనంలా జతచేయబడెను. సరళమైన ధృవీకరణకన్నా మించి ఐడెంటిటీ నిర్వహణతో గట్టి ఇంటరాక్షన్ పొందుటకు అపాచీ మాడ్యూళ్ళు బాహ్య అనువర్తనాలచే ఉపయోగించబడవచ్చు. ఇంకా సమాచారం కొరకు, http://www.freeipa.org/page/Web_App_Authentication. వద్ద టార్గెట్ అమర్పుపై గల వివరణను చూడండి.

Chapter 9. డెస్క్‌టాప్ మరియు గ్రాఫిక్స్

కొత్త ప్యాకేజీ: gdk-pixbuf2

gdk-pixbuf2 ప్యాకేజీ, గతంలో gtk2 ప్యాకేజీనందు భాగమైనది, Red Hat Enterprise Linux 6.6 కు జతచేయబడెను. gdk-pixbuf2 ప్యాకేజీ అనునది ఇమేజ్-లోడింగ్ లైబ్రరీను కలిగివుంది దానిని కొత్త ఇమేజ్ ఫార్మాట్ల కొరకు లోడుచేయదగిన మాడ్యూళ్ళతో విస్తరింపచేయవచ్చు. ఆ లైబ్రరీ GTK+ లేదా క్లట్టర్ వంటి టూల్‌కిట్స్ చేత ఉపయోగించబడును. gdk-pixbuf2 మరియు gtk2 నందు చేర్చబడిన లైబ్రరీలను డౌన్‌గ్రేడ్ చేయడం విఫలమగునని గమనించండి.

Chapter 10. పనితనం మరియు స్కేలబిలిటీ

పర్ఫార్మెన్స్ కో-పైలట్ (PCP)

వ్యవస్థ-స్థాయి పనితనం పర్యవేక్షణ మరియు నిర్వహణ తోడ్పాటు కొరకు పర్ఫార్మెన్స్ కో-పైలట్ (PCP) ఒక ఫ్రేమ్‌వర్క్ మరియు సేవలను అందించును. దీని లైట్-వెయిట్, డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ అనునది దీనిని సంక్లిష్ట వ్యవస్థల కేంద్రీకృత విశ్లేషణ కొరకు బాగా-సూటగునట్లు చేయును.
పనితనం మెట్రిక్స్ Python, Perl, C++ మరియు C ఇంటర్ఫేసెస్ ఉపయోగించి జతచేయబడును. విశ్లేషణ సాధనాలు క్లైంట్ APIలు (Python, C++, C) నేరుగా ఉపయోగించవచ్చు, రిచ్ వెబ్ అనువర్తనాలు JSON ఇంటర్ఫేస్ ఉపయోగించి అందుబాటులోని పనితనం దత్తాంశం పొందవచ్చు.
మరింత సమాచారం కొరకు, pcp మరియు pcp-libs-devel ప్యాకేజీల నందు man పేజీలు చూడండి. pcp-doc ప్యాకేజీ పత్రీకరణను /usr/share/doc/pcp-doc/* సంచయంనందు సంస్థాపించును, అప్‌స్ట్రీమ్ ప్రోజెక్ట్ నుండి ఈ రెండు ఉచిత మరియు స్వేచ్ఛా పుస్తకాలను కూడా కలిగివుండును:

Chapter 11. సాధారణ నవీకరణలు

కొత్త ప్యాకేజీలు: java-1.8.0-openjdk

కొత్త java-1.8.0-openjdk ప్యాకేజీలు, ఇవి OpenJDK 8 జావా రన్‌టైమ్ ఎన్విరాన్మెంట్ మరియు OpenJDK 8 జావా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ కలిగివుంటాయి, అవి ఇప్పుడు Red Hat Enterprise Linux 6.6 నందు సాంకేతిక ముందస్తుదర్శనం వలె అందుబాటులో ఉన్నాయి.

కాంపోనెంట్ వర్షన్లు

ఈ ఎపెండెక్స్ నందు Red Hat Enterprise Linux 6.6 విడుదల నందలి మూలకాల మరియు వాటి వర్షన్ల జాబితా ఉంటుంది.
కాంపోనెంట్
వర్షన్
కెర్నల్
2.6.32-494
QLogic qla2xxx డ్రైవర్
8.07.00.08.06.6-k
QLogic ql2xxx ఫర్మువేర్
ql23xx-firmware-3.03.27-3.1
ql2100-firmware-1.19.38-3.1
ql2200-firmware-2.02.08-3.1
ql2400-firmware-7.03.00-1
ql2500-firmware-7.03.00-1
Emulex lpfc డ్రైవర్
10.2.8020.1
iSCSI ఇనిషియేటర్ యుటిల్స్
iscsi-initiator-utils-6.2.0.873-11
DM-Multipath
device-mapper-multipath-libs-0.4.9-80
LVM
lvm2-2.02.108-1
Table A.1. కాంపోనెంట్ వర్షన్లు

పునర్విమర్శిత(రివిజన్) చరిత్ర

Revision History
Revision 6-2Mon Sep 15 2014Milan Navrátil
Red Hat Enterprise Linux 6.6 విడుదల నోట్స్ విడుదల