Product SiteDocumentation Site

Red Hat Enterprise Linux 7

Release Notes

Red Hat Enterprise Linux 7.0 కొరకు విడుదల నోట్స్

సంచిక 0

Red Hat ఇంజినీరింగ్ కాంటెంట్ సర్వీసెస్

చట్టబద్ద నోటీసు

Copyright © 2014 Red Hat, Inc.
The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.
Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.
Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.
Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.
Java® is a registered trademark of Oracle and/or its affiliates.
XFS® is a trademark of Silicon Graphics International Corp. or its subsidiaries in the United States and/or other countries.
MySQL® is a registered trademark of MySQL AB in the United States, the European Union and other countries.
All other trademarks are the property of their respective owners.


1801 Varsity Drive
RaleighNC 27606-2072 USA
Phone: +1 919 754 3700
Phone: 888 733 4281
Fax: +1 919 754 3701

సంక్షిప్తము

విడుదల నోట్స్ Red Hat Enterprise Linux 7.0 విడుదల నందు ఇంప్లిమెంట్ చేసిన ముఖ్యమైన విశిష్టతలను మరియు విస్తరింపులను పత్రీకరణ చేయును. Red Hat Enterprise Linux 6 మరియు 7 మధ్యని ముఖ్యమైన మార్పుల గురించిన సమాచారం కొరకు, మైగ్రేషన్ ప్రణాళిక మార్గదర్శిని చూడండి. తెలిసిన సమస్యలు సాంకేతిక నోట్స్ నందు జాబితా చేసి ఉన్నాయి.
ఆన్‌లైన్ Red Hat Enterprise Linux 7.0 విడుదల నోట్స్, ఆన్‌లైన్ నందు ఇక్కడ ఉన్నాయి, వాటిని ఖచ్చితమైనవిగా, తాజా వర్షన్‌గా పరిగణించాలి. విడుదల గురించి ప్రశ్నలు గల వినియోగదారులు వారి Red Hat Enterprise Linux వర్షన్ కు చెందిన ఆన్‌లైన్ విడుదల నోట్సును మరియు సాంకేతిక నోట్సును చూడవలసిందిగా సూచించడమైంది.
కృతజ్ఞతలు
Red Hat Enterprise Linux 7 ను పరీక్షించుటలో వారి శ్రేష్ఠమైన సహకారానికిగానూ స్టెర్లింగ్ అలెగ్జాండర్ మరియు మైకేల్ ఎవరెట్టీ లను Red Hat గ్లోబల్ సపోర్ట్ సర్వీసెస్ కీర్తిస్తోంది.
1. పరిచయం
2. ఆకృతులు
3. సామర్థ్యాలు మరియు పరిమితులు
4. ప్యాకేజీ మరియు తోడ్పాటు మార్పులు
5. సంస్థాపన మరియు బూటింగ్
6. నిల్వ
7. ఫైల్ సిస్టమ్స్
8. కెర్నల్
9. వర్చ్యులైజేషన్
10. వ్యవస్థ మరియు సేవలు
11. క్లస్టరింగ్
12. కంపైలర్ మరియు సాధనములు
13. నెట్వర్కింగ్
14. వనరు(రిసోర్స్) నిర్వహణ
15. ధృవీకరణ మరియు యింటరాపరబిలిటి
16. రక్షణ
17. సబ్‌స్క్రిప్షన్ నిర్వహణ
18. డెస్కుటాప్
19. వెబ్ సర్వర్లు మరియు సేవలు
20. పత్రీకరణ
21. ఇంటర్నేష్నలైజేషన్
22. మద్దతు మరియు నిర్వహణ
A. పునఃపరిశీలన చరిత్ర

అధ్యాయము 1. పరిచయం

Red Hat Enterprise Linux 7.0. Red Hat Enterprise Linux 7.0 అందుబాటులో ఉందని తెలుపుటకు Red Hat సంతోషిస్తోంది ఇది Red Hat రాబోవు తరపు ఆపరేటింగ్ సిస్టమ్ల సమగ్రమైన సూట్, సంక్లిష్టమైన ఎంటర్‌ప్రైజ్ కంప్యూటింగ్ కొరకు రూపొందించబడింది మరియు అగ్రస్థాయి ఎంటర్‌ప్రైజ్ సాఫ్టువేర్ మరియు హార్డువేర్ వెండార్లచే ధృవీకరించబడింది.

అధ్యాయము 2. ఆకృతులు

Red Hat Enterprise Linux 7.0 అనునది కింది ఆకృతులపై ఒకే కిట్‌గా అందుబాటులో ఉంది [1]:
  • 64-బిట్ AMD
  • 64-బిట్ Intel
  • IBM POWER7 మరియు POWER8
  • IBM System z [2]
ఈ విడుదల నందు, Red Hat అనునది సేవిక, వ్యవస్థలు, మరియు మొత్తం Red Hat ఓపెన్ సోర్స్ అనుభూతిపై మెరుగుదలలు తెస్తోంది.


[1] Red Hat Enterprise Linux 7.0 సంస్థాపన అనునది 64-బిట్ హార్డువేర్ పైన మాత్రమే తోడ్పాటునిచ్చునని గమనించండి.
Red Hat Enterprise Linux 7.0 అనేది 32-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ నడుపగలదు, Red Hat Enterprise Linux వర్షన్లతో సహా, ఒక వర్చువల్ మిషన్ వలె.
[2] Red Hat Enterprise Linux 7.0 అనేది IBM zEnterprise 196 హార్డువేర్ లేదా తరువాతి దానికి తోడ్పాటునిచ్చునని గమనించండి.

అధ్యాయము 3. సామర్థ్యాలు మరియు పరిమితులు

కింది పట్టిక Red Hat Enterprise Linux 7 సామర్ధ్యాలను మరియు పరిమితులను గత వర్షన్లు 5 మరియు 6 లతో పోల్చి జాబితా చేయును.

పట్టిక 3.1. Red Hat Enterprise Linux వర్షన్లు 5, 6 మరియు 7 పరిమితులు

Red Hat Enterprise Linux 5 Red Hat Enterprise Linux 6 Red Hat Enterprise Linux 7
గరిష్ట లాజికల్ CPUలు    
x86_64 160/255 160/4096 160/5120
POWER 128/128 128 ఎవాల్యూషన్ తక్కువ
System z 101 (zEC12) 101 (zEC12) ఎవాల్యూషన్ తక్కువ
గరిష్ట మెమొరీ    
x86_64 1 TB 3 TB తోడ్పాటునిచ్చును/64 TB 3 TB తోడ్పాటునిచ్చును/64 TB
POWER 512 GB కనీసం/1 TB సిఫార్సుచేయబడినది 2 TB 2 TB
System z 3 TB (z196) 3 TB (z196) 3 TB (z196)
కావలసిన కనీసాలు    
x86_64 512 MB కనీసం/1 GB లాజికల్ CPU కు సిఫార్సు చేయడమైంది 1 GB కనీసం/1 GB లాజికల్ CPU కు సిఫార్స్ చేయడమైంది 1 GB కనీసం/1 GB లాజికల్ CPU కు సిఫార్స్ చేయడమైంది
POWER 1 GB/2 GB సిఫార్సు చేయడమైంది 2 GB/2 GB Red Hat Enterprise Linux సంస్థాపనకు 2 GB/2 GB Red Hat Enterprise Linux సంస్థాపనకు
System z 512 MB 512 MB 1 GB[a]
ఫైల్ సిస్టమ్స్ మరియు నిల్వ పరిమితులు    
గరిష్ట ఫైలు పరిమాణం: XFS 16 TB 16 TB 16 TB
గరిష్ట ఫైలు పరిమాణం: ext4 16 TB 16 TB 50 TB
గరిష్ట ఫైలు పరిమాణం: Btrfs N/A ఎవాల్యూషన్ తక్కువ ఎవాల్యూషన్ తక్కువ
గరిష్ట ఫైలు సిస్టమ్ పరిమాణం: XFS 100 TB[b] 100 TB 500 TB
గరిష్ట ఫైలు సిస్టమ్ పరిమాణం: ext4 16 TB 16 TB 50 TB
గరిష్ట ఫైలు సిస్టమ్ పరిమాణం: Btrfs N/A ఎవాల్యూషన్ తక్కువ 50 TB
గరిష్ట బూట్ LUN పరిమాణం 2 TB 16 TB[c] 50 TB
ఒక్కో-ప్రోసెస్‌కు చిరునామా పరిమాణం గరిష్టంగా: x86_64 2 TB 128 TB 128 TB
     
[a] IBM System z పై సంస్థాపనకు 1 GB ఎక్కువ సిఫార్సు చేయడమైంది.
[b] Red Hat Enterprise Linux వర్షన్ 5.5 లేదా తరువాతది XFS గరిష్ట ఫైలు సిస్టమ్ పరిమాణంను 100 TB వరకు తోడ్పాటునిచ్చును.
[c] 2 TB కన్నా పెచ్చు బూట్ LUN తోడ్పాటుకు UEFI మరియు GPT తోడ్పాటు అవసరమని గుర్తించండి.

అధ్యాయము 4. ప్యాకేజీ మరియు తోడ్పాటు మార్పులు

ఆపివేసిన మరియు తీసివేసిన ప్యాకేజీల మరియు డ్రైవర్ల పట్టికలు ఖచ్చితంగా Red Hat Enterprise Linux 7.0 విడుదలకు సంబందించినవి మరియు Red Hat ఇష్టానుసారం Red Hat Enterprise Linux 7.0 కొరకు మార్చవచ్చును కూడా.

4.1. ఆపివేసిన ప్యాకేజీలు

కింది ఫంక్షన్లు మరియు సామర్థ్యాలు Red Hat Enterprise Linux 7.0 నందు ఆపివేయుటకు ప్రణాళిక చేయబడెను, మరియు ఉత్పత్తి యొక్క భవిష్య వర్షన్ల నందుకూడా తొలగించవచ్చు. తగినచోట, ప్రత్యామ్నాయ సామర్థ్యాలు కింద సూచించబడినవి.

పట్టిక 4.1. ఆపివేసిన ప్యాకేజీలు

ఫంక్షనాలిటీ/ప్యాకేజీ ప్రత్యామ్నాయ మైగ్రేషన్ నోట్లు
ext2, ext3 ఫైల్ వ్యవస్థ తోడ్పాటు ext4 ext4 కోడ్ అనునది ext2 మరియు ext3 ఫైల్ వ్యవస్థల కొరకు ఉపయోగించవచ్చు
sblim-sfcb tog-pegasus
పాత RHN హోస్టెడ్ రిజిస్ట్రేషన్ subscription-manager మరియు సబ్‌స్క్రిప్షన్ ఎసెట్ మేనేజర్
acpid systemd
evolution-mapi evolution-ews దయచేసి Microsoft Exchange Server 2003 మిషన్ల నుండి మైగ్రేట్ అవ్వండి
gtkhtml3 webkitgtk3
sendmail postfix
edac-utils మరియు mcelog rasdaemon
libcgroup systemd cgutils అనేది Red Hat Enterprise Linux 7.0 నందు కొనసాగును అయితే systemd అనేది తరువాతి విడుదలలనందు మైగ్రేట్ అగుటకు వినియోగదారులను చేతనం చేయుటకు సామర్థ్యాలను పెంపొందిస్తోంది
krb5-appl openssh అత్యంత క్రియాశీలంగా నిర్వహించిన ప్రమాణాలు మరియు క్రియాశీల అభివృద్ది మరియు కోడ్ బేస్ ఉపయోగించి ఇంప్లిమెంట్ చేసిన సాధనాలకు సమానమైన ఫంక్షనాలిటీను OpenSSH కలిగివుంది.
lvm1 lvm2
lvm2mirror మరియు cmirror lvm2 raid1 lvm2 raid1 క్లస్టర్సును తోడ్పాటునివ్వదు. cmirror ను పునఃస్థాపించుటకు ఎటువంటి ప్రణాళిక లేదు.

4.2. తీసివేసిన ప్యాకేజీలు

Red Hat Enterprise Linux 6 తో పోలిస్తే Red Hat Enterprise Linux 7 నందు తొలగించిన ప్యాకేజీల జాబితాను ఈ విభాగం కలిగివుంది.

పట్టిక 4.2. తీసివేసిన ప్యాకేజీలు

ఫంక్షనాలిటీ/ప్యాకేజీ ప్రత్యామ్నాయ మైగ్రేషన్ నోట్లు
gcj OpenJDK Java అనువర్తనముల నేటివ్ కోడ్‌కు gcj తో కంపైల్ చేయవద్దు.
సంస్థాపనా ఆకృతుల వలె 32-బిట్ ఆకృతులు 64-బిట్ ఆకృతులు అనువర్తనాలు ఇంకా సారూప్యతా లైబ్రరీలతో నడుస్తాయి. మీ అనువర్తనాలను 64-bit Red Hat Enterprise Linux 6 పై పరీక్షించుము. ఒకవేళ 32-bit బూట్ తోడ్పాటు అవసరమైతే, Red Hat Enterprise Linux 6 ఉపయోగించుట కొనసాగించుము.
IBM POWER6 తోడ్పాటు ఏదీకాదు Red Hat Enterprise Linux 5 లేదా 6 ఉపయోగించుట కొనసాగించు.
Matahari CIM-ఆధారిత నిర్వహణ Red Hat Enterprise Linux 6.4 నుండి Matahari తొలగించబడెను. ఉపయోగించదు.
ecryptfs మనుగడలో ఉన్న LUKS ఉపయోగించు లేదా dm-crypt block-based ఎన్క్రిప్షన్ ఉపయోగించు మైగ్రేషన్ అందుబాటులో లేదు; వాడుకరులు ఎన్క్రిప్టెడ్ దత్తాంశం తిరిగి సృష్టించాలి.
TurboGears2 వెబ్ అనువర్తన స్టాక్ ఏదీకాదు
OpenMotif వర్షన్ 2.2 Motif 2.3 Red Hat Enterprise Linux 6 నందు ఉన్న ప్రస్తుత Motif వర్షన్‌కు వ్యతిరేఖంగా అనువర్తనాలు తిరిగినిర్మించు.
webalizer వెబ్ విశ్లేషక సాధనం ఏదీకాదు
compiz విండో నిర్వాహకి gnome-shell
ఎక్లిప్స్ డెవలప్పర్ టూల్‌సెట్ ఏదీకాదు ఎక్లిప్స్ ఇప్పుడు Red Hat డెవలప్పర్ టూల్‌సెట్ ఆఫరింగ్ నందు ఉంది.
Qpid మరియు QMF ఏదీకాదు Qpid మరియు QMF లు MRG నందు ఉన్నాయి.
amtu ఏదీకాదు కామన్ క్రైటీరియా సర్టిఫికేషన్లకు ఈ సాధనం అక్కరలేదు.
system-config-services systemadm
pidgin ఫ్రంట్ ఎండ్స్ empathy
perl-suidperl ఇంటర్‌ప్రీటర్ ఏదీకాదు ఈ ఫంక్షనాలిటీ అప్‌స్ట్రీమ్ perl నందు అందుబాటులోలేదు.
pam_passwdqc, pam_cracklib pam_pwquality
HAL లైబ్రరీ మరియు డీమన్ udev
కన్సోల్‌కిట్ లైబ్రరీ మరియు డీమన్ systemd http://www.freedesktop.org/wiki/Software/systemd/writing-display-managers
డివైజ్‌కిట్-పవర్ upower
system-config-lvm gnome-disk-utility మరియు system-storage-manager gnome-disk-utility Red Hat Enterprise Linux 6 నందు కూడా ఉంది. సులువైన పనుల కొరకు system-storage-manager ఉపయోగించాలి, ఫైన్ ట్యూనింగ్ మరియు మరింత సంక్లిష్టమైన ఆపరేషన్లు LVM కు చెందిన వాటి కొరకు lvm2 ఉపయోగించవచ్చు.
system-config-network nm-connection-editor, nmcli nm-connection-editor Red Hat Enterprise Linux 6 నందు కూడా వుంది.
taskjuggler ఏదీకాదు
thunderbird evolution
vconfig iproute అన్ని vconfig విశిష్టతలు iproute ప్యాకేజీ ip సాధనం నుండి అందించబడెను. మరిన్ని వివరాల కొరకు ip-link(8) మాన్యువల్ పేజీ చూడండి.
ఎసార్టెడ్ ఓల్డర్ గ్రాఫిక్స్ డ్రైవర్ vesa డ్రైవర్ పైన నవీన హార్డువేర్
xorg-x11-twm ఏదీకాదు
xorg-x11-xdm gdm
system-config-firewall firewall-config మరియు firewall-cmd system-config-firewall అనేది iptables తో పాటుగా స్టాటిక్-ఓన్లీ ఎన్విరాన్మెంట్ల కొరకు ప్రత్యామ్నాయ ఫైర్‌వాల్ పరిష్కారం నందు భాగంగా ఇప్పటికీ అందుబాటులోనే ఉంది.
mod_perl mod_fcgid mod_perl అనేది HTTP 2.4 తో సారూప్యం
busybox ఏదీకాదు
prelink ఏదీకాదు prelink Red Hat Enterprise Linux 7.0 నందు అందించబడుతోందని గమనించండి, అయితే అప్రమేయంగా అచేతనంగా ఉంటుంది.
KVM మరియు వర్చ్యులైజేషన్ ప్యాకేజీలు (కంప్యూట్‌నేడ్ వేరియంట్ నందు) KVM మరియు వర్చ్యులైజేషన్ వేరియంట్ సర్వర్ వేరియంట్ వంటిది
module-init-tools kmod
kernel-firmware-* linux-firmware
flight-recorder ఏదీకాదు
wireless-tools కమాండ్ లైన్ నుండి ప్రాథమిక వైర్‌లెస్ పరికరం మానిప్యులేషన్ చేయుటకు, iw బైనరీను iw ప్యాకేజీ నుండి ఉపయోగించు.
libtopology hwloc
digikam ఏదీకాదు సంక్లిష్టమైన పరాధీనతల వలన, digiKam ఫొటో మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ Red Hat Enterprise Linux 7.0 సాఫ్టువేర్ ఛానళ్ళ నందు అందుబాటులోలేదు.
NetworkManager-openswan NetworkManager-libreswan
KDE ప్రదర్శన నిర్వాహకి, KDM GNOME ప్రదర్శన నిర్వాహకి, GDM Red Hat Enterprise Linux 7.0 నందు గ్నోమ్ ప్రదర్శన నిర్వాహకి అప్రమేయ ప్రదర్శన నిర్వాహకి. KDE (కె డెక్సుటాప్ ఎన్విరాన్మెంట్) అందుబాటులోవుంది మరియు తోడ్పాటునీయబడుతోందని గమనించండి.
virt-tar virt-tar-in మరియు virt-tar-out కమాండ్ లైన్ సింటాక్స్ మారిందని గమనించండి. మరింత సమాచారం కొరకు దయచేసి మాన్యువల్ పేజీలను సంప్రదించండి.
virt-list-filesytems virt-filesystems కమాండ్ లైన్ సింటాక్స్ మారిందని గమనించండి. మరింత సమాచారం కొరకు దయచేసి మాన్యువల్ పేజీలను సంప్రదించండి.
virt-list-partitions virt-filesystems కమాండ్ లైన్ సింటాక్స్ మారిందని గమనించండి. మరింత సమాచారం కొరకు దయచేసి మాన్యువల్ పేజీలను సంప్రదించండి.

4.3. ఆపివేసిన డ్రైవర్లు మరియు మాడ్యూళ్ళు

కింది డ్రైవర్లు మరియు మాడ్యూళ్ళు Red Hat Enterprise Linux 7.0 నందు ఆపివేయబడెను మరియు Red Hat Enterprise Linux యొక్క భవిష్య విడుదలల నందు తొలగించవచ్చు.
గ్రాఫిక్స్ డ్రైవర్లు
xorg-x11-drv-ast
xorg-x11-drv-cirrus
xorg-x11-drv-mach64
xorg-x11-drv-mga
xorg-x11-drv-openchrome
పైని అన్ని గ్రాఫిక్స్ డ్రైవర్లు కెర్నల్ మోడ్ సెట్టింగ్స్ (KMS) డ్రైవర్లు కలిగివున్నాయని వాటిని పునఃస్థాపిస్తున్నాయని గమనించండి.
ఇన్పుట్ పరికరాలు
xorg-x11-drv-void
నిల్వ పరికరాలు
3w-9xxx
arcmsr
aic79xx
Emulex lpfc820

4.4. ఆపివేసిన కెర్నల్ డ్రైవర్లు, మాడ్యూళ్ళు మరియు విశిష్టతలు

Red Hat Enterprise Linux 6 తో పోలిస్తే Red Hat Enterprise Linux 7.0 నందు తీసివేసిన డ్రైవర్లు మరియు మాడ్యూళ్ళను ఈ విభాగం జాబితా చేయును.
నిల్వ పరికరాలు
megaraid_mm
cciss[3]
aic94xx
aic7xxx
i2o
ips
megaraid_mbox
mptlan
mptfc
sym53c8xx
ecryptfs
3w-xxxx
నెట్వర్కింగ్ డ్రైవర్లు
3c59x
3c574_cs
3c589_c
3c589_cs
8390
acenic
amd8111e
at76c50x-usb
ath5k
axnet_cs
b43
b43legacy
can-dev
cassini
cdc-phonet
cxgb
de4x5
de2104x
dl2k
dmfe
e100
ems_pci
ems_usb
fealnx
fmvi18x_cs
fmvj18x_cs
forcedeth
ipw2100
ipw2200
ixgb
kvaser_pci
libertas
libertas_tf
libertas_tf_usb
mac80211_hwsim
natsemi
ne2k-pci
niu
nmckan_cs
nmclan_cs
ns83820
p54pci
p54usb
pcnet32
pcnet_32
pcnet_cs
pppol2tp
r6040
rt61pci
rt73usb
rt2400pci
rt2500pci
rt2500usb
rtl8180
rtl8187
s2io
sc92031
sis190
sis900
sja1000
sja1000_platform
smc91c92_cs
starfire
sundance
sungem
sungem_phy
sunhme
tehuti
tlan
tulip
typhoon
uli526x
vcan
via-rhine
via-velocity
vxge
winbond-840
xirc2ps_cs
xircom_cb
zd1211rw
గ్రాఫిక్స్ డ్రైవర్లు
xorg-x11-drv-acecad
xorg-x11-drv-aiptek
xorg-x11-drv-elographics
xorg-x11-drv-fpit
xorg-x11-drv-hyperpen
xorg-x11-drv-mutouch
xorg-x11-drv-penmount
ఇన్పుట్ పరికరాలు
xorg-x11-drv-acecad
xorg-x11-drv-aiptek
xorg-x11-drv-elographics
xorg-x11-drv-fpit
xorg-x11-drv-hyperpen
xorg-x11-drv-mutouch
xorg-x11-drv-penmount


[3] కింది నియంత్రికలు ఇకపై తోడ్పాటునీయవు:
  • Smart Array 5300
  • Smart Array 5i
  • Smart Array 532
  • Smart Array 5312
  • Smart Array 641
  • Smart Array 642
  • Smart Array 6400
  • Smart Array 6400 EM
  • Smart Array 6i
  • Smart Array P600
  • Smart Array P800
  • Smart Array P400
  • Smart Array P400i
  • Smart Array E200i
  • Smart Array E200
  • Smart Array E500
  • Smart Array P700M

అధ్యాయము 5. సంస్థాపన మరియు బూటింగ్

5.1. సంస్థాపకి

Red Hat Enterprise Linux సంస్థాపకి, అనకొండ, Red Hat Enterprise Linux 7 సంస్థాపనా ప్రోసెస్‌ను మెరుగుపరచుటకు తిరిగి రూపొందించబడంది మరియు విస్తరించబడింది.

ఇంటర్ఫేస్

  • అనకొండ కొత్త పాఠపు రీతి విశిష్టత కలిగివుంది అది IBM S/390 పైన, టైప్‌వ్రైటర్ టెర్మినల్స్ పైన పనిచేయును, మరియు వ్రైట్-ఓన్లీ గా కూడా ఉపయోగించవచ్చు.
  • అనకొండ ఇప్పుడు కొత్తగా-తిరిగిరూపొందించిన గ్రాఫికల్ వాడుకరి ఇంటర్ఫేస్ అందించును అది నవీన మరియు సులభంగా తెలిసే హబ్-అండ్-స్పోక్ ఇంటరాక్షన్ మోడల్ నియోగించును.
  • అనకొండ సంస్థాపకి మెరుగైన l10n(స్థానికీకరణ) తోడ్పాటును అందించును.
  • ప్రాథమిక అమర్పు ఫస్టుబూట్ చే అందించబడును.

నిల్వ

  • నేరుగా-ఫార్మాట్ చేసిన విభజించని పరికరాలకు తోడ్పాటునీయబడును.
  • తాత్కాలిక ఫైల్ నిల్వ సదుపాయం, tmpfs, ఇప్పుడు సంస్థాపన నందు ఆకృతీకరించవచ్చు.
  • LVM థిన్ ప్రొవిజనింగ్ అనునది ఇప్పుడు తోడ్పాటునీయబడును.
  • Btrfs ఫైల్ సిస్టమ్ ఇప్పుడు సాంకేతిక ముందస్తు దర్శనం వలె తోడ్పాటునీయబడును.

నెట్వర్కింగ్

నెట్వర్కింగ్ విశిష్టతలు టీమింగ్, బాండింగ్ మరియు NTP (నెట్వర్కు టైమ్ ప్రొటోకాల్) ఆకృతీకరణ కొరకు తోడ్పాటు చేర్చును. మరిన్ని వివరాల కొరకు, అధ్యాయము 13, నెట్వర్కింగ్ చూడండి.

అభివృద్దికారి టూలింగ్

  • అనకొండ ఇప్పుడు మెరుగైన makeupdates స్క్రిప్టు ఉపయోగించును.

ఇతర విశిష్టతలు

  • జియోలొకేషన్ ఇప్పుడు తోడ్పాటునీయబడును: GeoIP నుండి భాష మరియు సమయక్షేత్రం ముందుగానే ఎంచబడును.
  • తెరపట్టు ఇప్పుడు సార్వత్రికంగా తోడ్పాటునిస్తుంది.
  • అనకొండ ఇప్పుడు పొడిగింతలకు తోడ్పాటునిచ్చును.
  • loader బైనరీ dracut మాడ్యూళ్ళ చేత భర్తీ చేయబడెను.
  • realmd DBus సేవ అనునది kickstart నకు చేర్చబడెను.
Red Hat Enterprise Linux 7.0 సంస్థాపనా మార్గదర్శిని సంస్థాపకిపై మరియు సంస్థాపనా కార్యక్రమముపై వివరణాత్మక పత్రీకరణను అందించును.

5.2. బూటు లోడరు

GRUB 2

Red Hat Enterprise Linux 7.0 కొత్త బూట్ లోడర్ ఆందించును, GRUB 2, Red Hat Enterprise Linux 6 ఉపయోగించిన బూట్ లోడర్, GRUB కంటే, బాగా ధృడమైంది, అనువైంది మరియు శక్తివంతమైంది. GRUB 2 చాలా విశిష్టతలను మరియు మెరుగుదలలను అందిస్తోంది, వాటిలో చెప్పుకోదగ్గవి:
  • 64-bit Intel మరియు AMD ఆకృతులకు అదనంగా, GRUB 2 ఇప్పుడు విస్తృత స్థాయిలో ప్లాట్‌ఫాంలకు తోడ్పాటునిచ్చును, PowerPC తో కలుపుకొని.
  • GRUB 2 అదనపు ఫర్మువేర్ రకాలకు తోడ్పాటునిచ్చును, BIOS, EFI మరియు OpenFirmware తో కలుపుకొని.
  • మాస్టర్ బూట్ రికార్డ్ (MBR) విభజన పట్టికలకు తోడ్పాటుకు అదనంగా, GRUB 2 GUID విభజన పట్టికలు (GPT) కు తోడ్పాటునిచ్చును.
  • లైనక్స్ ఫైల్ సిస్టమ్సుకు అదనంగా, GRUB 2 లైనక్సు-కాని ఫైల్ సిస్టమ్సుకు కూడా తోడ్పాటునిచ్చును అవి Apple Hierarchical File System Plus (HFS+) మరియు Microsoft's NTFS ఫైల్ సిస్టమ్.

అధ్యాయము 6. నిల్వ

LIO కెర్నల్ టార్గెట్ ఉపవ్యవస్థ

Red Hat Enterprise Linux 7.0 LIO కెర్నల్ టార్గెట్ ఉపవ్యవస్థ ఉపయోగించును, ఇది బ్లాక్ నిల్వ కొరకు ప్రామాణిక ఓపెన్ సోర్స్ SCSI టార్గెట్, కింది అన్ని నిల్వ ఫాబ్రిక్స్ కొరకు: FCoE, iSCSI, iSER (మెలనాక్స్ ఇన్ఫిబాండ్), మరియు SRP (మెలనాక్స్ ఇన్ఫిబాండ్).
Red Hat Enterprise Linux 6 tgtd ను, SCSI టార్గెట్ డీమన్ ను, iSCSI టార్గెట్ తోడ్పాటు కొరకు ఉపయోగిస్తోంది, మరియు LIO ను, కెర్నల్ టార్గెట్ ను మాత్రమే, Ethernet (FCoE) టార్గెట్ల నందు ఫైబర్-ఛానల్ కొరకు fcoe-target-utils ప్యాకేజీ ద్వారా ఉపయోగిస్తుంది.
targetcli షెల్ అనునది సాధారణ నిర్వహణ ప్లాట్‌ఫాంను LIO Linux SCSI లక్ష్యం కొరకు అందిస్తుంది.

వేగమైన బ్లాక్ పరికరాలు నిదానమైన బ్లాక్ పరికరాలను క్యాషీ చేస్తాయి

వేగమైన బ్లాక్ పరికరాలు నిదానమైన బ్లాక్ పరికరాల కొరకు క్యాషీగా వ్యవహరించగల సామర్ధ్యం Red Hat Enterprise Linux 7.0 నందు సాంకేతిక ముందస్తు దర్శనం వలె తేబడింది. ఈ విశిష్టత PCIe SSD పరికరం డైరెక్ట్-ఎటాచ్‌డ్ స్టోరేజ్ (DAS) కు లేదా స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ (SAN) నిల్వకు క్యాషీ గా వ్యవహించుటకు అనుమతించును, అది ఫైల్ సిస్టమ్ పనితనం మెరుగుపరచును.

LVM క్యాషి

Red Hat Enterprise Linux 7.0 LVM క్యాషీను సాంకేతిక ముందస్తు దర్శనం వలె తెచ్చింది. ఈ విశిష్టతతో వాడుకరులు నిదానమైన పెద్ద పరికరాలకు క్యాషీగా వ్యవహరించే చిన్న వేగమైన పరికరంతో లాజికల్ వాల్యూమ్ సృష్టించవచ్చు. క్యాషీ లాజికల్ వాల్యూమ్స్ సృష్టించుటపై మరింత సమాచారం కొరకు lvm(8) మాన్యువల్ పేజీ చూడండి.
క్యాషీ లాజికల్ వాల్యూమ్స్ పైన కింది ఆదేశాలు ప్రస్తుతం అనుమతించబడవని గమనించండి:
  • pvmove: క్యాషీ లాజికల్ వాల్యూమ్ దాటవేయును,
  • lvresize, lvreduce, lvextend: క్యాషీ లాజికల్ వాల్యూమ్లు ప్రస్తుతం పునఃపరిమాణం చేయబడలేవు,
  • vgsplit: క్యాషీ లాజికల్ వాల్యూమ్లు కలిగివున్నప్పుడు వాల్యూమ్ సమూహంను విభజించుట అనుమతించబడదు.

libStorageMgmt API తో స్టోరేజ్ ఎరే నిర్వహణ

Red Hat Enterprise Linux 7.0 స్టోరేజ్ ఎరే నిర్వహణను సాంకేతిక ముందస్తు దర్శనం వలె తెచ్చింది. libStorageMgmt అనునది స్టోరేజ్ ఎరే ఇండిపెండెంట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API). అది స్థిరమైన మరియు ఏకరీతి API అందించును అది అభివృద్దికారులు వివిద నిల్వ ఎరేలను ప్రోగ్రామేటిక్ గా నిర్వహించుటకు మరియు హార్డువేర్-ఎగ్జలరేటెడ్ విశిష్టతల లాభించుటకు అనుమతించును. వ్యవస్థ నిర్వహణాదికారులు దీనిని సాధనంగా కూడా ఉపయోగించి మానవీయంగా నిల్వను నిర్వహించవచ్చు మరియు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ (CLI) తో నిల్వ నిర్వహణ కర్తవ్యాలను స్వయంచాలనం చేయవచ్చు.

LSI Synchro కొరకు తోడ్పాటు

Red Hat Enterprise Linux 7.0 megaraid_sas డ్రైవర్ నందు కోడ్ చేర్చి LSI Syncro CS హై-ఎవైలబిలటీ డైరెక్ట్-ఎటాచ్డ్ స్టోరేజ్ (HA-DAS) ఎడాప్టర్స్ చేతనంచేయును. megaraid_sas గతంలో చేతనమైన ఎడాప్టర్లకు పూర్తిగా తోడ్పాటునిచ్చును, Syncro CS కొరకు ఈ డ్రైవర్ యొక్క వినియోగం సాంకేతిక ముందస్తు దర్శనం వలె అందుబాటులోవుంది. ఈ ఎడాప్టర్ కు తోడ్పాటు నేరుగా LSI, మీ సిస్టమ్ ఇంటిగ్రేటర్, లేదా సిస్టమ్ వెండార్ చే అందించబడును. Red Hat Enterprise Linux 7.0 పైన Syncro CS నియోగించే వాడుకరులు వారి స్పందనను Red Hat మరియు LSI కు తెలుపమని సిఫార్సు చేయడమైంది. LSI Syncro CS పరిష్కారాలపై మరింత సమాచారం కొరకు , దయచేసి http://www.lsi.com/products/shared-das/pages/default.aspx చూడండి.

LVM అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్

Red Hat Enterprise Linux 7.0 కొత్త LVM అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API) ను సాంకేతిక ముందస్తు దర్శనం వలె అందిస్తోంది. ఈ API ఫలానా LVM విషయాలను క్వరీ చేయుటకు మరియు నియంత్రించుటకు ఉపయోగించబడును.

DIF/DIX తోడ్పాటు

SCSI ప్రమాణికం నందు DIF/DIX కొత్త చేర్పు మరియు Red Hat Enterprise Linux 7.0 నందు సాంకేతిక ముందస్తు దర్శనం. DIF/DIX అనునది సాధారణంగా ఉపయోగించే 512-byte డిస్కు బ్లాక్‌ పరిమాణంను 512 నుండి 520 బైట్లకు పెంచినది, డాటా ఇంటిగ్రిటీ ఫీల్డ్ (DIF) జతచేస్తూ. DIF అనునది డాటా బ్లాక్ చెక్‌సమ్ విలువను నిల్వవుంచును అది హోస్టు బస్ ఎడాప్టర్ (HBA) చేత వ్రాయడం అవసరమైనప్పుడు లెక్కించబడును. అప్పుడు నిల్వ పరికరం చెక్‌సమ్ స్వీకరించెనని ఖాయపరచును, డాటా మరియు చెక్‌సమ్ రెంటినీ నిల్వవుంచును. చదవండం అవసరమైనప్పుడు, చెక్‌సమ్ అనేది నిల్వపరికరం చేత, మరియు స్వీకరించుతున్న HBA చేత పరీక్షించవచ్చు.
మరింత సమాచారం కొరకు, DIF/DIX చేతనమైన బ్లాక్ పరికరాలు అను విభాగాన్ని నిల్వ నిర్వహణా మార్గదర్శని నందు చూడండి.

సమాంతర NFS తోడ్పాటు

సమాంతర NFS (pNFS) అనునది NFS v4.1 ప్రమాణం నందు భాగము అది క్లైంట్లను నిల్వ పరికరాలను నేరుగా మరియు సమాంతరంగా యాక్సెస్ చేయుటకు అనుమతించును. చాలా వుమ్మడి పనిభారముల కొరకు pNFS ఆకృతి అనునది స్కేలబిలిటీను మరియు NFS సేవికల పనితనంను మెరుగుపరచగలదు. Red Hat Enterprise Linux 6.4 నందు, pNFS పూర్తిగా తోడ్పాటునీయబడును
pNFS అనునది 3 విభిన్న నిల్వ ప్రొటోకాల్స్ లేదా నమూనాలను నిర్వచించును; ఫైళ్ళు, ఆబ్జక్టులు మరియు బ్లాక్స్. Red Hat Enterprise Linux 7.0 క్లైంట్ ఫైళ్ళ నమూనాను పూర్తిగా, మరియు బ్లాక్ మరియు ఆబ్జక్టు నమూనాలను సాంకేతిక ముందస్తు దర్శనం వలె తోడ్పాటునిచ్చును.
pNFS పైన మరింత సమాచారం కొరకు, http://www.pnfs.com/ చూడండి.

అధ్యాయము 7. ఫైల్ సిస్టమ్స్

XFS ఫైల్ సిస్టమ్ తోడ్పాటు

Red Hat Enterprise Linux 7.0 అనకొండ-ఆధారిత సంస్థాపన కొరకు అప్రమేయ ఫైల్ సిస్టమ్ ఇప్పుడు XFS, ఇది Red Hat Enterprise Linux 6 చే అప్రమేయంగా ఉపయోగించిన ఫోర్త్ ఎక్సుటెండెట్ ఫైల్‌సిస్టమ్ (ext4) ను భర్తీచేసింది. ext4 మరియు Btrfs (B-Tree) ఫైల్ సిస్టమ్లు XFS కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
XFS అనునది బాగా వెసులుబాటు కలిది, బాగా-పనితనంగల ఫైల్ సిస్టమ్ ఇది వాస్తవంగా Silicon Graphics, Inc. వద్ద రూపొందించబడెను. 16 హెక్సాబెట్ల (దాదాపుగా 16 మిలియన్ టెరాబైట్లు) వరకు ఫైల్ సిస్టమ్సు, 8 హెక్సాబైట్ల (8 మిలియన్ టెరాబైట్ల) ఫైళ్ళు మరియు పదుల కొద్దీ మిలియన్ల ప్రవేశాలు కలిగిన డైరెక్టరీ ఆకృతులను తోడ్పాటునిచ్చుటకు ఇది సృష్టించబడెను. XFS మెటాడాటా జర్నలింగ్ తోడ్పాటు కలిగివుంది, అది క్రాష్ నుండి త్వరితంగా కోలుకొనే సదుపాయం కల్పిస్తుంది. XFS ఫైల్ సిస్టమ్లు మౌంటై క్రియాశీలంగా ఉన్నప్పుడే డీఫ్రాగ్మెంట్ చేయవచ్చు మరియు విస్తరింపవచ్చు.
ext4 మరియు XFS నందలి ఉమ్మడి కర్తవ్యాల కొరకు ఉపయోగించిన ఆదేశాల మధ్యని మార్పుల గురించిన సమాచారం కొరకు, సంస్థాపనా మార్గదర్శిని నందలి రిఫరెన్స్ పట్టిక చూడండి.

IBM System z కొరకు libhugetlbfs తోడ్పాటు

libhugetlbfs ఇప్పుడు IBM System z ఆకృతిపై తోడ్పాటునిచ్చును. లైబ్రరీ అనునది C మరియు C++ ప్రోగ్రాముల నందలి పేజీల పారదర్శక ఎక్సుప్లాయిటేషన్ చేతనం చేయును. అనువర్తనాలు మరియు మిడిల్‌వేర్ ప్రోగ్రాములు పనితనం లాభాలు లేదా పెద్ద పేజీల నుండి మార్పులు లేదా రీకంపైలేషన్లు లేకుండానే లాభించవచ్చు.

అధ్యాయము 8. కెర్నల్

Red Hat Enterprise Linux 7.0 kernel వర్షన్ 3.10 అందించును, అది చాలా కొత్త విశిష్టతలను అందించును, వాటిలో బాగా గుర్తించదగినవి కింద ఈయబడెను.

పెద్ద క్రాష్‌కెర్నల్ పరిమాణాలకు తోడ్పాటు

Red Hat Enterprise Linux 7.0 అనేది పెద్ద మెమొరీతో (3TB దాకా) ఉన్న వ్యవస్థలపై కెడంప్ క్రాష్ డంపింగ్ మెకానిజంకు తోడ్పాటునిచ్చును.

1 CPU కన్నా ఎక్కువతో క్రాష్‌కెర్నల్

ఒక CPU కన్నా ఎక్కువతో క్రాష్‌కెర్నల్ బూటింగ్ Red Hat Enterprise Linux 7.0 చేతనం చేయును. ఈ ఫంక్షన్ అనేది సాంకేతిక ముందస్తుదర్శనం వలె తోడ్పాటునిచ్చును.

స్వాప్ మెమొరీ కంప్రెషన్

Red Hat Enterprise Linux 7.0 కొత్త విశిష్టత ఇస్తోంది, స్వాప్ మొమరీ కుదింపు. స్వాప్ కుదింపు అనునది zswap ద్వారా జరుపబడును, ఫ్రంట్‌స్వాప్ కొరకు థిన్ బ్యాకెండ్. స్వాప్ మెమొరీ కుదింపు సాంకేతికత వినియోగం అనేది చెప్పుకోదగ్గ I/O తగ్గింపును మరియు పనితనం మెరుగును అందించును.

NUMA-ఎవేర్ ప్రణాళికీకరణ మరియు మెమొరీ కేటాయింపు

Red Hat Enterprise Linux 7.0 నందు, కెర్నల్ స్వయంచాలకంగా ప్రోసెస్ మరియు మెమొరీను ఒకే వ్యవస్థ నందలి NUMA నోడ్ల మధ్య రీలోకేట్ చేయును, అలా నాన్-యూనిఫాం మెమొరీ ఏక్సెస్‌ (NUMA) తో వ్యవస్థలపైన పనితనం మెరుగుపరచును.

APIC వర్చ్యులైజేషన్

వర్చ్యువల్ మిషన్ మానిటర్ (VMM) ఇంటరప్ట్ సంభాలన మెరుగుపరచుటకు కొత్త ప్రోసెసర్ల హార్డువేర్ సామర్ధ్యాలను ఉపయోగించుకుంటూ అడ్వాన్సుడ్ ప్రోగ్రామబుల్ ఇంటరప్ట్ కంట్రోలర్ (APIC) రిజిస్టర్ల వర్చ్యులైజేషన్‌కు తోడ్పాటునీయబడును.

vmcp బుల్టిన్ కెర్నల్

Red Hat Enterprise Linux 7.0 నందు, vmcp కెర్నల్ మాడ్యూల్ కెర్నల్ నందు నిర్మించబడెను. ఇది vmcp పరికరం ఎల్లప్పుడూ ఉండునట్లు చూడును, మరియు వాడుకరులు ముందుగా vmcp కెర్నల్ మాడ్యూల్ లోడు చేయకుండా IBM z/VM హైపర్విజర్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఆదేశాలు పంపవచ్చు.

హార్డువేర్ దోషం నివేదించు మెకానిజం

ప్రస్తుతం, లైనక్సు నందు ఉన్న హార్డువేర్ దోషం నివేదించు మెకానిజంలు సమస్యాత్మకమైనవి, చాలా వరకు వివిద సాధనాలు (mcelog మరియు EDAC) దోషాలను వివిద మూలాల నుండి వివిద పద్దతులు అదే విధంగా వివిద సాధనాలు ( mcelog, edac-utils, మరియు syslog వంటివి) ఉపయోగించి సేకరించి దోష ఘటనలను నివేదించును.
హార్డువేర్ దోషం నివేదించుటలో దోషాలు ఈ రెండు భాగాలుగా విభజించవచ్చు:
  • వివిద దోష దత్తాంశం సేకరించు మెకానిజంలు వివిద దత్తాంశాలు మరియు కొన్నిసార్లు నకిలీలు సేకరించును,
  • మరియు వివిద సాధనాలు ఈ దత్తాంశమును వివిద స్థానాలలో వివిద టైమ్ స్టాంపులతో నివేదించును, అది ఘటనల మద్య సంబందం కనుగొనుట కష్టతరం చేయును.
కొత్త హార్డువేర్ ఘటనా నివేదన మెకానిజం యొక్క లక్ష్యం, లేదా HERM, Red Hat Enterprise Linux 7.0 నందు దోష దత్తాంశ సేకరణను వివిద మూలాల నుండి ఏకంచేయును, మరియు దోష ఘటనలను వాడుకరి స్పేస్‌కు వరుస టైమ్‌లైన్ నందు మరియు ఒకే స్థానం నందు నివేదించును. Red Hat Enterprise Linux 7.0 నందు HERM కొత్త వాడుకరి స్పేస్ డీమన్, rasdaemon పరిచయం చేస్తోంది, అది కెర్నల్ ట్రేసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి వచ్చు అన్ని రిలైబిలిటీ, ఎవైలబిలిటీ, మరియు సర్వీసబిలిటీ (RAS) దోష ఘటనలను పట్టి మరియు సంభాలించి, వాటిని లాగ్ చేయును. Red Hat Enterprise Linux 7.0 నందలి HERM దోషాలను నివేదించుటకు సాధనాలు కూడా అందించును మరియు బర్స్ట్ మరియు స్పార్స్ దోషాల వంటి వివిద రకాల దోషాలు కూడా గుర్తించగలదు.

పూర్తి డైన్‌టిక్ తోడ్పాటు

nohz_full బూట్ పారామితి అనునది వాస్తవ టిక్‌లెస్ కెర్నల్ విశిష్టతను టిక్ ఆపగల్గినప్పుడు అదనపు కేస్‌కు విస్తరింపచేయును, per-cpu nr_running=1 అమరిక ఉపయోగించినప్పుడు. అనగా, CPU రన్ క్యూ పైన ఒకటే నడువగలిగిన టాస్క్ ఉంది.

కెర్నల్ మాడ్యూళ్ళు బ్లాక్‌లిస్ట్ చేయుట

Red Hat Enterprise Linux 7.0 తో అందించబడుతున్న modprobe సౌలభ్యం వాడుకరులను సంస్థాపనా సమయంలో కెర్నల్ మాడ్యుళ్ళు బ్లాక్‌లిస్ట్ చేయుటకు అనుమతించును. మాడ్యూల్ యొక్క స్వయంచాలకలోడింగ్ సార్వత్రికంగా అచేతనం చేయుటకు, కింది ఆదేశమును నడుపుము:
modprobe.blacklist=module

గతిక కెర్నల్ ప్యాచింగ్

Red Hat Enterprise Linux 7.0 kpatch ను పరిచయం చేస్తోంది, ఒక గతిక కెర్నల్ ప్యాచింగ్ నిర్వాహకి, సాంకేతిక ముందస్తుదర్శనం వలె. వాడుకరులు బైనరీ కెర్నల్ ప్యాచీలను నిర్వహించుటకు kpatch అనుమతించును అవి పునఃప్రారంభించవలసిన అవసరం లేకుండా గతికంగా కెర్నల్ ప్యాచ్ చేయుటకు ఉపయోగించవచ్చు.

Emulex ocrdma డ్రైవర్

Emulex ocrdma డ్రైవర్ Red Hat Enterprise Linux 7.0 నందు సాంకేతిక ముందస్తుదర్శనంగా చేర్చబడింది. ఈ డ్రైవర్ ఫలానా Emulex ఎడాప్టర్స్ నందు రిమోట్ డైరెక్ట్ మెమొరీ ఎక్సెస్ (RDMA) సామర్ధ్యాలను అందించును.

dm-era లక్ష్యం

Red Hat Enterprise Linux 7.0 dm-era డివైజ్-మాపర్ లక్ష్యాన్ని సాంకేతిక ముందస్తుదర్శనంలా పరిచయం చేస్తోంది. వాడుకరి-నిర్వచిత సమయ పరిధి "era" నందు ఏ బ్లాక్స్ వ్రాయబడెనో dm-era ట్రాక్ ఉంచును. ప్రతి ఎరా టార్గెట్ ఇన్‌స్టాన్స్ అనేది ప్రస్తుత ఎరాను మోనోటికల్‌గా పెంచిన 32-bit కౌంటర్ వలె నిర్వహించును. చివరి బ్యాకప్ నుండి ఏ బ్లాక్స్ మారెనో తెలుసుకొనుటకు లక్ష్యం అనేది బ్యాకప్ సాఫ్టువేర్‌ను అనుమతించును. వెండార్ స్నాప్‌షాట్‌కు వెళ్ళిన తరువాత క్యాషీ కొహెరెన్స్ తిరిగివుంచుటకు క్యాషీ కాంటెట్ల పాక్షిక ఇన్‌వాలిడేషన్‌ను ఇది అనుమతించును. dm-era లక్ష్యం ప్రాథమికంగా dm-cache లక్ష్యంతో జతకట్ట వలసివుంది.

అధ్యాయము 9. వర్చ్యులైజేషన్

9.1. కెర్నల్-ఆధారిత వర్చ్యులైజేషన్

virtio-blk-data-plane ఉపయోగించి మెరుగైన బ్లాక్ I/O పనితనం

Red Hat Enterprise Linux 7.0 నందు, virtio-blk-data-plane I/O వర్చ్యులైజేషన్ ఫంక్షనాలిటీ సాంకేతిక ముందస్తుదర్శనం. ఈ ఫంక్షనాలిటీ I/O పనితనం ఆప్టిమైజ్ చేసిన డెడికేటెడ్ త్రెడ్ నందు డిస్కు I/O జరుపుటకు QEMU విస్తరింపును.

PCI బ్రిడ్జ్

QEMU గతంలో 32 PCI స్లాట్ల వరకు మాత్రమే తోడ్పాటునిచ్చెను. Red Hat Enterprise Linux 7.0 PCI బ్రిడ్జ్ అందించును, అది వాడుకరులను 32 PCI పరికరాల కన్నా ఎక్కువ ఆకృతీకరించుటకు అనుమతించును. బ్రిడ్జు వెనుక పరికరాలను హాట్ ప్లగ్ చేయుటకు తోడ్పాటులేదు.

QEMU సాండ్‌బాక్సింగ్

Red Hat Enterprise Linux 7.0 అనునది విస్తరిత KVM వర్చ్యులైజేషన్ సెక్యూరిటీను కెర్నల్ సిస్టమ్ కాల్ ఫిల్టరింగ్ ఉపయోగించుట ద్వారా అందించును, అది అతిధేయ మరియు అతిథి వ్యవస్థల మధ్యన వేరుబాటు మెరుగుపరచును.

QEMU వర్చ్యువల్ CPU హాట్ యాడ్ తోడ్పాటు

Red Hat Enterprise Linux 7.0 నందలి QEMU వర్చ్యువల్ CPU (vCPU) హాట్ యాడ్ తోడ్పాటు అందించును. పనిభారం డిమాండ్ పూడ్చడానికి లేదా పనిభారంతో సంబందించివున్న సర్వీస్ లెవర్ ఎగ్రిమెండ్ (SLA) నిర్వహించుటకు వర్చ్యువల్ CPUలు (vCPUలు) అనునవి నడుస్తున్న వర్చ్యువల్ మిషన్‌కు జతచేయవచ్చు. vCPU హాట్ ప్లగ్ అనునది pc-i440fx-rhel7.0.0 మిషన్ రకం వాడుతున్న వర్చ్యువల్ మిషన్ల పైన మాత్రమే తోడ్పాటునిచ్చునని గమనించండి, Red Hat Enterprise Linux 7.0 పైన అప్రమేయ మిషన్.

మల్టిపుల్ క్యూ NICలు

బహుళ క్యూ virtio_net మంచి స్కేలబిలిటీ అందించును; ప్రతి వర్చ్యువల్ CPU ప్రత్యేక బదలీ లేదా స్వీకరణ క్యూ కలిగివుండవచ్చు మరియు ఇతర వర్చ్యువల్ CPUలను ప్రభావితం చేయకుండా ప్రత్యేక ఇంటరప్ట్స్ ఉపయోగించగలదు.

మల్టిపుల్ క్యూ virtio_scsi

బహుళ క్యూ virtio_scsi మంచి స్కేలబిలిటీ అందించును; ప్రతి వర్చ్యువల్ CPU ప్రత్యేక క్యూను మరియు ఇతర వర్చ్యువల్ CPUలను ప్రభావితం చేయకుండా ఉపయోగించగలగే ఇంటరప్టులు కలిగి ఉండవచ్చు.

లైవ్ మైగ్రేషన్ కొరకు పేజ్ డెల్టా కంప్రెషన్

అతిథి మెమొరీ పేజీలను కుదించుట ద్వారా మరియు బదిలీ అయిన మైగ్రేషన్ దత్తాంశం పరిమాణం తగ్గించుట ద్వారా KVM లైవ్ మైగ్రేషన్ విశిష్టత మెరుగుపరచబడింది. ఈ విశిష్టత మైగ్రేషన్‌ను వేగవంతంగా మార్చుటకు అనుమతించును.

KVM నందు HyperV ఎన్‌లైట్‌మెంట్

KVM చాలా Microsoft Hyper-V ఫంక్షన్లతో నవీకరించబడెను; ఉదాహరణకు, మెమొరీ మేనేజ్‌మెంట్ యూనిట్ (MMU) మరియు వర్చ్యువల్ ఇంటరప్ట్ కంట్రోలర్ కొరకు తోడ్పాటు. అతిథి మరియు అతిధేయ మధ్య Microsoft ఒక పారా-వర్చ్యులైజ్డ్ API అందించును, మరియు ఈ ఫంక్షనాలిటీ భాగాలను అతిధేయిపై ఇంప్లిమెంట్ చేసి, మరియు Microsoft స్పెసిఫికేషన్లు బట్టి ఎక్సుపోజ్ చేసి, Microsoft Windows వాటి పనితనం మెరుగుపరచగలదు.

హై బాండ్‌విడ్త్ I/O కొరకు EOI ఏగ్జెలరేషన్

Red Hat Enterprise Linux 7.0 అడ్వాన్సుడ్ ప్రోగ్రామబుల్ ఇంటరప్ట్ కంట్రోలర్ (APIC) కు Intel మరియు AMD విస్తరింపులు (EOI) ప్రోసెసింగ్ ఏగ్జెలరేట్ చేయుటకు ఉపయోగించును. పాత చిప్‌సెట్స్ కొరకు, Red Hat Enterprise Linux 7.0 పారా-వర్చ్యులైజ్డ్ ఐచ్చికాలను EOI ఏగ్జెలరేషన్ కొరకు అందించును.

USB 3.0 అనునది KVM అతిథులకు తోడ్పాటునిచ్చును

Red Hat Enterprise Linux 7.0 మెరుగైన USB తోడ్పాటును USB 3.0 హోస్టుఎడాప్టర్ (xHCI) ఎమ్యులేషన్‌ను సాంకేతిక ముందస్తుదర్శనంలా జతచేస్తూ అందిస్తోంది.

Windows 8 మరియు Windows Server 2012 అతిథి తోడ్పాటు

KVM వర్చ్యువల్ మిషన్ల నందు Microsoft Windows 8 మరియు Windows Server 2012 అతిథులు నడుచుటకు Red Hat Enterprise Linux 7.0 తోడ్పాటునిచ్చును.

QEMU అతిథుల కొరకు I/O త్రొటిలింగ్

ఈ విశిష్టత I/O త్రొటిలింగ్ అందిస్తోంది, లేదా పరిమితం చేస్తోంది, QEMU అతిథుల బ్లాక్ పరికరాల కొరకు. I/O త్రొటిలింగ్ అనునది I/O మెమొరీ అభ్యర్ధనల ప్రోసెసింగ్ నిదానింపచేస్తుంది. ఇది వ్యవస్థను నిదానింపచేస్తుంది అయితే క్రాషెస్ నుండి నిరోధిస్తుంది. దత్తాంశ ప్లాన్లను త్రోటెల్ చేయుట సాధ్యం కాదని గమనించండి.

బెలూనింగ్ మరియు పారదర్శక హ్యూజ్ పేజీల మేళవింపు

బెలూనింగ్ మరియు పారదర్శక హ్యూజ్ పేజీలు Red Hat Enterprise Linux 7.0 నందు భేషుగ్గా మెళవించబడినాయి. బెలూన్ పేజీలు కదుపవచ్చు మరియు కుదింపవచ్చు అలా అవి హ్యూజ్ పేజీలు అవగలవు.

అతిధేయి నుండి సిస్టమ్ ఎంట్రోపీ లాగుట

కొత్త పరికరం, virtio-rng, అతిథుల కొరకు ఆకృతీకరింపవచ్చు, అది అతిధేయి నుండి అతిథులకు ఎంట్రోపీను అందుబాటులోకి తెచ్చును. అప్రమేయంగా, ఈ సమాచారం అతిధేయి /dev/random ఫైలు నుండి ఈయబడును, అయితే అతిధేయిల నందు అందుబాటులోని హార్డువేర్ రాండమ్ నంబర్ జనరేటర్స్ (RNGలు) కూడా మూలంగా ఉపయోగించవచ్చు.

బ్రిడ్జ్ జీరో కాపీ ట్రాన్సుమిట్

పెద్ద సందేశాలను ప్రోసెస్ చేయుటకు CPU మెరుగుపరచుటకు బ్రిడ్జ్ జీరో-కాపీ ట్రాన్సుమిట్ అనేది పనితనం విశిష్టత. బ్రిడ్జ్ జీరో-కాపీ ట్రాన్సుమిట్ విశిష్టిత అనునది బ్రిడ్జ్ ను ఉపయోగించునప్పుడు అతిథి నుండి బహిర్గత ట్రాఫిక్‌కు పనితనం మెరుగుపరచును.

లైవ్ మైగ్రేషన్ తోడ్పాటు

Red Hat Enterprise Linux 6.5 అతిధేయి నుండి Red Hat Enterprise Linux 7.0 అతిధేయికు అతిథి లైవ్ మైగ్రేషన్ తోడ్పాటు ఉంది.

qemu-kvm నందు డిస్‌కార్డ్ తోడ్పాటు

డిస్‌కార్డ్ తోడ్పాటు, fstrim or mount -o discard ఆదేశం ఉపయోగించి, discard='unmap' ను <driver> మూలకంకు డొమైన్ XML నిర్వచనం నందు జతచేసిన తరువాత అతిథిపై పనిచేయును. ఉదాహరణకు:
<disk type='file' device='disk'>
	<driver name='qemu' type='raw' discard='unmap'/>
  <source file='/var/lib/libvirt/images/vm1.img'>
  ...
</disk>

NVIDIA GPU పరికరం అప్పగింత

Red Hat Enterprise Linux 7.0 అనునది NVIDIA ప్రొఫెషనల్ సీరీస్ గ్రాఫిక్స్ పరికరాలు (GRID మరియు Quadro) ను ద్వితీయ గ్రాఫిక్స్ పరికరం వలె ఎమ్యులేటెడ్ VGA కు అప్పగించుటకు తోడ్పాటునిచ్చును.

పారా-వర్చ్యులైజ్డ్ టికెట్‌లాక్స్

Red Hat Enterprise Linux 7.0 అనునది పారా-వర్చ్యులైజ్డ్ టికెట్‌లాక్స్ (pvticketlocks) కు తోడ్పాటునిచ్చును అది ఓవర్‌సబ్‌స్క్రైబ్డ్ CPU లతో ఉన్న Red Hat Enterprise Linux 7.0 అతిధేయిల పై నడుస్తున్న Red Hat Enterprise Linux 7.0 అతిథి వర్చ్యువల్ మిషన్ల పనితనం మెరుగుపరచును.

అప్పగించిన PCIe పరికరాలపై దోష సంభాలన

అతిథికి అప్పగించునప్పుడు ఎడ్వాన్సుడ్ ఎర్రర్ రిపోర్టింగ్ (AER) తో ఉన్న PCIe పరికరంకు దోషం ఎదురైతే, దానికి గురైన అతిథిని ఇతర అతిథులు లేదా అతిధేయిను ప్రభావితం చేయకుండా మూసివేయబడును. ఆ పరికరంకు చెందిన అతిధేయి డ్రైవర్ దోషం నుండి తేరుకున్న తరువాత అతిథులు ప్రారంబించబడును.

Q35 చిప్‌సెట్, PCI ఎక్సుప్రెస్ బస్ మరియు AHCI బస్ ఎమ్యులేషన్

Q35 మిషన్ రకం, KVM అతిథి వర్చ్యువల్ మిషన్ల నందు PCI ఎక్సుప్రెస్ బస్ తోడ్పాటుకు అవసరమైంది, Red Hat Enterprise Linux 7.0 నందు సాంకేతిక ముందస్తుదర్శనం వలె అందుబాటులో ఉంది Red Hat Enterprise Linux 7.0. AHCI బస్ అనునది Q35 మిషన్ రకంతో మాత్రమే తోడ్పాటునిచ్చును మరియు సాంకేతిక ముందస్తుదర్శనం వలె Red Hat Enterprise Linux 7.0 నందు అందుబాటులో ఉంది.

VFIO-ఆధారిత PCI పరికరం అప్పగింత

వర్చ్యువల్ ఫంక్షన్ I/O (VFIO) వాడుకరి-స్పేస్ డ్రైవర్ ఇంటర్ఫేస్ అనునది KVM అతిథి వర్చ్యువల్ మిషన్లు మెరుగైన PCI పరికర అప్పగింత పరిష్కారంతో అందించబడును. VFIO అనునది డివైస్ ఐసోలేషన్ యొక్క కెర్నల్-స్థాయి ఎన్ఫోర్సుమెంట్ అందించును, పరికర ఏక్సెస్ రక్షణ మెరుగుపరచును మరియు రక్షణ బూట్ వంటి విశిష్టతలతో సారూప్యంగా ఉండును. VFIO అనునది Red Hat Enterprise Linux 6 నందు ఉపయోగించిన KVM డివైజ్ ఎస్సైన్‌మెంట్ మెకానిజంను పునఃస్థాపించును.

Intel VT-d లార్జ్ పేజీలు

Red Hat Enterprise Linux 7.0 పైన KVM అతిథి వర్చ్యువల్ మిషన్‌తో వర్చ్యువల్ ఫంక్షన్ I/O (VFIO) డివైజ్ ఎస్సైన్మెంట్ ఉపయోగిస్తున్నప్పుడు, ఇన్పుట్/అవుట్పుట్ మెమొరీ మేనేజ్‌మెంట్ యూనిట్ (IOMMU) చేత 2MB పేజీలు ఉపయోగించబడెను, అది ట్రాన్స్‌లేషన్ లుక్ఎసైడ్ బఫర్ (TLB) ఓవర్‌హెడ్ ను I/O ఆపరేషన్ల కొరకు తగ్గించును. 1GB పేజీ తోడ్పాటు Red Hat Enterprise Linux 7.0 కొరకు ప్లాన్ చేయబడింది. VT-d లార్జ్ పేజీలు అను విశిష్టత కొత్త ప్రత్యేక ఇటీవలి Intel-ఆధారిత ప్లాట్‌ఫాంలపై మాత్రమే తోడ్పాటునిచ్చును.

KVM క్లాక్ టైమ్ పర్ఫార్మెన్స్ పొందును

Red Hat Enterprise Linux 7.0 నందు vsyscall మెకానిజం విస్తరించబడెను KVM అతిథుల వాడుకరి స్పేస్ నుండి వేగవంతమైన క్లాక్ రీడ్స్ తోడ్పాటునిచ్చుటకు. Red Hat Enterprise Linux 7.0 అతిధేయిపై Red Hat Enterprise Linux 7.0 నడుపుతున్న ఒక అతిధి వర్చ్యువల్ మిషన్ అనునది తరచుగా సమయాన్ని చదువు అనువర్తనాల కొరకు మెరుగైన పనితనం చూడును.

QCOW2 వర్షన్ 3 ఇమేజ్ ఫార్మాట్

Red Hat Enterprise Linux 7.0 తోడ్పాటును QCOW2 వర్షన 3 ఇమేజ్ ఫార్మాట్‌కు జతచేయును.

మెరుగైన లైవ్ మైగ్రేషన్ గణాంకాలు

పనితనం విశ్లేషించుటకు మరియు ట్యూన్ చేయుటకు లైవ్ మైగ్రేషన్‌ గురించిన సమాచారం ఇప్పుడు అందుబాటులోవుంది. అనుకొన్న డౌన్‌టైమ్, డౌన్‌టైమ్ లేదా డర్డీ పేజెస్ రేట్ గురించిన సమాచారం మెరుగుపరచిన గణాంకాలు కలిగివుండును.

లైవ్ మైగ్రేషన్ త్రెడ్స్

త్రెడింగ్‌కు తోడ్పాటునిచ్చుటకు KVM లైవ్ మైగ్రేషన్ విశేషణం మెరుగుపరచబడెను.

కారెక్టర్ పరికరాలు మరియు సీరియల్ పోర్టుల హాట్ ప్లగింగ్

కొత్త సీరియల్ పోర్టులను కొత్త కారెక్టర్ పరికరాలతో హాట్ ప్లగ్ చేయుట ఇప్పుడు Red Hat Enterprise Linux 7.0 నందు తోడ్పాటునిచ్చును.

AMD Opteron G5 ఎమ్యులేషన్

KVM ఇప్పుడు AMD Opteron G5 ప్రోసెసర్లను ఎమ్యులేట్ చేయగలదు.

కొత్త Intel సూచనల కొరకు KVM అతిథులపై తోడ్పాటు

KVM అతిథులు అనునవి Intel 22mm ప్రోసెసర్ల చే తోడ్పాటునిచ్చు కొత్త సూచనలను ఉపయోగించగలవు. అవి ఇవి:
  • ఫ్లాటింగ్-పాయింట్ ప్యూజ్డ్ మల్టిప్లై-ఏడ్,
  • 256-bit ఇంటీజర్ వెక్టార్స్,
  • బిగ్-ఎన్‌డియన్ మూవ్ ఇన్‌స్ట్రక్షన్ (MOVBE) తోడ్పాటు,
  • లేదా HLE/HLE+.

VPC మరియు VHDX ఫైల్ ఫార్మాట్లు

KVM అనునది Red Hat Enterprise Linux 7.0 నందు Microsoft వర్చ్యువల్ PC (VPC) మరియు Microsoft Hyper-V వర్చ్యువల్ హార్డు డిస్కు (VHDX) ఫైల్ ఫార్మాట్లకు తోడ్పాటునిచ్చును.

libguestfs నందు కొత్త విశిష్టతలు

libguestfs అనేది సాధనాల సమితి వర్చ్యువల్ మిషన్ డిస్కు చిత్రాలను ఎక్సెస్ చేయుటకు మరియు సవరించుటకు. Red Hat Enterprise Linux 7.0 నందు ఉన్న libguestfs చాలా మెరుగుదలలను కలిగివుంది, వాటిని బాగా గుర్తించదగినవి:
  • SELinux, లేదా sVirt రక్షణ ఉపయోగించే సురక్షిత వర్చ్యులైజేషన్, దోషపూరిత మరియు చెడ్డ డిస్కు చిత్రాలకు వ్యతిరేఖంగా రక్షణను ఇచ్చును.
  • రిమోట్ డిస్కులు పరీక్షించవచ్చు మరియు సవరించవచ్చు, ప్రాథమికంగా నెట్వర్కు బ్లాక్ డివైజ్ (NBD) నందు.
  • కొన్ని అనువర్తనాల నందు డిస్కు అనేది మంచి పనితనం కొరకు హాట్ ప్లగ్ చేయవచ్చు.

WHQL-ధృవీకృత virtio-win డ్రైవర్లు

Red Hat Enterprise Linux 7.0 అనునది విండోస్ హార్డువేర్ క్వాలిటీ లాబ్స్ (WHQL) ధృవీకృత virtio-win డ్రైవర్లు సరికొత్త Microsoft Windows అతిథుల కొరకు కలిగివుంది, పేర్లు Microsoft Window 8, 8.1, 2012 మరియు 2012 R2.

9.2. Xen

Red Hat Enterprise Linux 7.0 Xen HVM అతిథి

వాడుకరులు ఇప్పుడు Red Hat Enterprise Linux 7.0 ను ప్రాచుర్యం పొందిన Xen ఎన్విరాన్మెంట్ నందు అతిథివలె వాడవచ్చు.

9.3. Hyper-V

Red Hat Enterprise Linux 7.0 అనేది జనరేషన్ 2 వర్చ్యువల్ మిషన్ వలె హోస్టైనది

Red Hat Enterprise Linux 7.0 అనేది Microsoft Hyper-V Server 2012 R22 అతిధేయి నందు జనరేషన్ 2 వర్చ్యువల్ మిషన్ వలె ఉపయోగించవచ్చు. గత జనరేషన్ నందు తోడ్పాటునిచ్చు ఫంక్షన్లకు అదనంగా, జనరేషన్ 2 అనేది వర్చ్యువల్ మిషన్ పైన కొత్త ఫంక్షన్లు అందించును; ఉదాహరణకు రక్షిత బూట్, SCSI వర్చ్యువల్ హార్డు డిస్కు నుండి బూట్ లేదా UEFI ఫర్మువేర్ తోడ్పాటు.

అధ్యాయము 10. వ్యవస్థ మరియు సేవలు

systemd

systemd అనునది లైనక్స్ కొరకు వ్యవస్థ మరియు సేవ నిర్వాహకి, మరియు Red Hat Enterprise Linux గత విడుదలల నందు ఉపయోగించిన SysV భర్తీ చేయును. systemd అనేది SysV మరియు లైనక్స్ ప్రామాణిక బేస్ init స్క్రిప్ట్సుతో సారూప్యమైంది.
systemd, ఇతరములతో కలిగి, కింది సామర్ధ్యాలు కూడా అందించును:
  • ఎగ్రెసివ్ పార్లలైజేషన్ సామర్ధ్యాలు.
  • సాకెట్ వినియోగం మరియు ప్రారంభం సేవిల కొరకు D-Bus క్రియాశీలత.
  • కొరిక-పై డీమన్లు ప్రారంబించుట.
  • నియంత్రణ సమూహాల నిర్వహణ.
  • వ్యవస్థ స్థితి స్నాప్‌షాట్లు సృష్టించుట మరియు వ్యవస్థ స్థితి తిరిగివుంచుట.
systemd మరియు ఆకృతీకరణ గురించి వివరణాత్మక సమాచారం కొరకు, వ్యవస్థ నిర్వహణాధికారి మార్గదర్శిని చూడండి.

అధ్యాయము 11. క్లస్టరింగ్

క్లస్టర్లు అనగా బహుళ కంప్యూటర్లు (నోడ్లు) అవి కలిసికట్టుగా పనిచేసి క్లిష్టమైన ఉత్పాదక సేవలకు రిలైబిలిటీ, స్కేలబిలిటీ, మరియు ఎవైలబిలిటీ పెంచును. హై ఎవైలబిలిటీను Red Hat Enterprise Linux 7.0 ఉపయోగించి వివిధ ఆకృతీకరణలనందు నియోగించడం ద్వారా పనితనం, హై-ఎవైలబిలిటీ, లోడ్ బాలెన్సింగ్, మరియు ఫైల్ భాగస్వామ్యం వంటి అవసరాలకు తగినట్లు చేయవచ్చు.
Red Hat Enterprise Linux 7.0 లోడ్ బాలెన్సర్ ఇప్పుడు బేస్ Red Hat Enterprise Linux నందు భాగం.
Red Hat Enterprise Linux 7.0 కొరకు Red Hat హై ఎవైలబిలిటీ పొడిగింత ఆకృతీకరణ మరియు నిర్వహణకు సంబందించిన సమాచారం అందించు పత్రముల జాబితా కోసం విభాగము 20.5, “క్లస్టరింగ్ మరియు అదిక అందుబాటు” చూడండి.

11.1. పీస్‌మేకర్ క్లస్టర్ మేనేజర్

క్లస్టర్ వనరులను నిర్వహించుటకు మరియు నోడ్ వైఫల్యాల నుండి కోలుకావడానికి Red Hat Enterprise Linux 7.0 rgmanager ను Pacemaker తో భర్తీ చేసింది.
Pacemaker యొక్క కొన్ని లాభాలు:
  • వనరు ఆకృతీకరణ స్వయంచాలన సింక్రొనైజేషన్ మరియు వర్షనింగ్.
  • వాడుకరి ఎన్విరాన్మెంట్‌కు మరింత దగ్గరిగా సరిపోలు అనుకూలమైన వనరు మరియు ఫెన్సింగ్ రకం.
  • వనరు-స్థాయి వైఫల్యాల నుండి ఫెన్సింగ్ ఉపయోగించవచ్చు.
  • టైమ్-ఆధారిత ఆకృతీకరణ ఐచ్చికాలు.
  • బహుళ నొడ్లపైన ఒకే వనరును నడుపే సామర్ధ్యం. ఉదాహరణకు, వెబ్ సర్వర్ లేదా క్లస్టర్ ఫైల్ సిస్టమ్.
  • బహుళ నోడ్లపై రెంటిలో ఒక విధానంలో ఒకే వనరును నడిపే సామర్ధ్యం. ఉదాహరణకు, సింక్ సోర్స్ మరియు టార్గెట్.
  • పీస్‌మేకర్‌కు డిస్ట్రిబ్యూటెడ్ లాక్ మేనేజర్ అవసరంలేదు.
  • క్వారమ్ పోయినప్పుడు లేదా బహుళ విభజనలు కూడినప్పుడు ఆకృతీకరించదగ ప్రవర్తన.

11.2. Piranha అనేది keepalived మరియు HAProxy చే భర్తీచేయబడెను.

Red Hat Enterprise Linux 7.0 Piranha లోడ్ బాలెన్సర్ ను keepalived మరియు HAProxy తో భర్తీ చేసెను.
keepalived ప్యాకేజీ అనునది లోడ్-బాలెన్సింగ్ మరియు హై-ఎవైలబిలిటీ కొరకు సుళువైన మరియు ధృడమైన వసతులను అందించును. లోడ్-బాలెన్సింగ్ ఫ్రేమ్‌వర్క్ అనునది బాగా-తెలిసిన మరియు విస్తృతంగా ఉపయోగించు లైనక్స్ వర్చ్యువల్ సర్వర్ కెర్నల్ మాడ్యూల్ అందించు లేయర్4 నెట్వర్కు లోడ్-బాలెన్సింగ్. keepalived డీమన్ అనేది లోడ్-బాలెన్సుడ్ సర్వర్ పూల్స్ స్థితి అనుసరించి హెల్త్ చెకర్స్ సమితిని వృద్ధి చేయును. keepalived డీమన్ అనేది వర్చ్యువల్ రౌటర్ రిడండెన్సీ ప్రొటోకాల్ (VRRP) ఇంప్లిమెంట్ చేయును, హై ఎవైలబిలిటీ సాధించుటకు రౌటర్ లేదా డైరక్టర్ ఫెయిల్‌వోవర్ అనుమతించుచూ.
HAProxy అనేది నమ్మికైన, అధిక-పనితనపు నెట్వర్కు లోడ్ బాలెన్సర్ ను TCP మరియు HTTP-ఆధారిత అనువర్తనముల కొరకు అందించును. వెబ్ సైట్లు అధిక భారాలతో నెట్టుకొస్తున్పప్పుడు స్థిరమైన లేదా లేయర్7 ప్రోసెసింగ్ అవసరమైనప్పుడు ప్రత్యేకించి ఇది సరిపోతుంది.

11.3. అదిక అందుబాటు నిర్వహణ

పీస్‌మేకర్ ఆకృతీకరణ వ్యవస్థ, లేదా pcs, అనేది ccs, ricci మరియు luci ను ఏకీకృత క్లస్టర్ ఆకృతీకరణ మరియు నిర్వహణ సాధనంలా భర్తీచేయును. pcs యొక్క కొన్ని లాబాలు:
  • కమాండ్-లైన్ సాధనం.
  • క్లస్టర్‌ను సుళువుగా బూట్‌స్ట్రాప్ చేయగల సామర్ధ్యం, అనగా, ప్రాథమిక క్లస్టర్ సిద్దపరచి నడుపుట.
  • క్లస్టర్ ఐచ్చికాలను ఆకృతీకరించగల సామర్ధ్యం.
  • వనరులు మరియు వాటి సంబందాలను ఒక దానితో ఒకటి జతచేయగల, తీసివేయగల, లేదా సవరించగల సామర్ధ్యం.

11.4. కొత్త రిసోర్స్ ఏజెంట్స్

Red Hat Enterprise Linux 7.0 చాలా రిసోర్స్ ఏజెంట్లు అందించును. రిసోర్స్ ఏజెంట్ అనగా క్లస్టర్ రిసోర్స్ కొరకు ప్రామాణికమైన ఇంటర్ఫేస్. రిసోర్స్ ఏజెంట్ ప్రామాణి కార్యక్రమాల సమితిని రిసోర్సుకు లేదా అనువర్తనంకు తగిన స్టెప్పులకు అనువదించును, మరియు వాటి ఫలితాలు సఫలమో లేదా విఫలమో చెప్పును.

అధ్యాయము 12. కంపైలర్ మరియు సాధనములు

12.1. GCC టూల్‌చైన్

Red Hat Enterprise Linux 7.0 నందు, gcc టూల్‌చైన్ gcc-4.8.x విడుదల క్రమాలపై ఆధారపడును, మరియు Red Hat Enterprise Linux 6 సమానమైన వాటికి సారూప్యమైన చాలా విస్తరింపులను మరియు బగ్‌పరిష్కారాలను కలిగివుంటుంది. అదేవిదంగా, Red Hat Enterprise Linux 7 అనునది binutils-2.23.52.x కలిగివుండును.
ఈ వర్షన్లు Red Hat డెవలపర్ టూల్‌సెట్ 2.0 నందలి సమానమైన సాధనాలకు చెందును; Red Hat Enterprise Linux 6 మరియు Red Hat Enterprise Linux 7 gcc మరియు binutils వర్షన్లు విశదీకృతంగా పోల్చుట ఇక్కడ చూడవచ్చు:
Red Hat Enterprise Linux 7.0 టూల్‌చైన్ నందు గుర్తించదగ విశిష్టతలు:
  • C++11 తో సారూప్యమైన (పూర్తి C++11 లాంగ్వేజ్ తోడ్పాటుతో సహా) అనువర్తనాలు నిర్మించుటకు ప్రయోగాత్మక తోడ్పాటు మరియు C11 విశేషణాల కొరకు కొంత ప్రయోగాత్మక తోడ్పాటు.
  • సమాంతార అనువర్తనాల ప్రోగ్రామింగ్ కొరకు మెరుగైన తోడ్పాటు, OpenMP v3.1, C++11 రకాలు మరియు అటామిక్ మెమొరీ ఎక్సెస్ కొరకు GCC బుల్ట్-ఇన్స్ తో సహా. టాన్సాక్షనల్ మెమొరీ (Intel RTM/HLE intrinsics, బుల్ట్-ఇన్స్, మరియు కోడ్ జనరేషన్ తో సహా) కొరకు ప్రయోగాత్మక తోడ్పాటు.
  • కొత్త లోకల్ రిజిస్టర్ ఎలొకేటర్ (LRA), కోడ్ పనితనం మెరుగుపరచును.
  • DWARF4 ఇప్పుడు అప్రమేయ డీబగ్ ఫార్మాట్ వలె ఉపయోగించబడెను.
  • వైవిధ్యమైన కొత్త ఆకృతి-ప్రత్యేక ఐచ్చికాలు.
  • AMD ఫ్యామిలీ 15h మరియు 16h ప్రోసెసర్ల కొరకు తోడ్పాటు.
  • లింక్-టైమ్ ఆప్టిమైజేషన్ తోడ్పాటు.
  • విస్తరిత హెచ్చరికలు మరియు విశ్లేషణలు.
  • వైవిధ్యమైన కొత్త Fortran విశిష్టతలు.

12.2. GLIBC

Red Hat Enterprise Linux 7.0 నందు, glibc లైబ్రరీలు (libc, libm, libpthread, NSS plug-ins, మరియు ఇతరాలు) glibc 2.17 విడుదలపై ఆధారపడును, అది Red Hat Enterprise Linux 6 కు సమానమైన వాటికి సారూప్య విస్తరింపులు మరియు బగ్ పరిష్కారాలు అందించును.
Red Hat Enterprise Linux 7.0 glibc లైబ్రరీల గుర్తించదగిన విశిష్టితలు:
  • ప్రయోగాత్మక ISO C11 తోడ్పాటు.
  • కొత్త లైనక్స్ ఇంటర్ఫేసులు: prlimit, prlimit64, fanotify_init, fanotify_mark, clock_adjtime, name_to_handle_at, open_by_handle_at, syncfs, setns, sendmmsg, process_vm_readv, process_vm_writev.
  • AMD64 మరియు Intel 64 ఆకృతుల కొరకు కొత్త ఆప్టిమైజ్డ్ స్ట్రింగ్ ఫంక్షన్లు స్ట్రీమింగ్ SIMD ఎక్సుటెన్షన్స్ (SSE), సప్లిమెంటల్ స్ట్రీమింగ్ SIMD ఎక్సుటెన్షన్స్ 3 (SSSE3), స్ట్రీమింగ్ SIMD ఎక్సుటెన్షన్స్ 4.2 (SSE4.2), మరియు అడ్వాన్సడ్ వెక్టార్ ఎక్సుటెన్షన్స్ (AVX) ఉపయోగిస్తున్నాయి.
  • IBM PowerPC మరియు IBM POWER7 కొరకు కొత్త ఆప్టిమైజ్డ్ స్ట్రింగ్ ఫంక్షన్స్.
  • IBM System z10 మరియు IBM zEnterprise 196 కొరకు ప్రత్యేక ఆప్టిమైజ్డ్ రొటీన్సుతో IBM S/390 మరియు IBM System z కొరకు కొత్త ఆప్టిమైజ్డ్ స్ట్రింగ్ ఫంక్షన్లు.
  • కొత్త స్థానికాలు: os_RU, bem_ZA, en_ZA, ff_SN, sw_KE, sw_TZ, lb_LU, wae_CH, yue_HK, lij_IT, mhr_RU, bho_IN, unm_US, es_CU, ta_LK, ayc_PE, doi_IN, ia_FR, mni_IN, nhn_MX, niu_NU, niu_NZ, sat_IN, szl_PL, mag_IN.
  • కొత్త ఎన్కోడింగ్లు: CP770, CP771, CP772, CP773, CP774.
  • కొత్త ఇంటర్ఫేసులు: scandirat, scandirat64.
  • FD_SET, FD_CLR, FD_ISSET, poll, మరియు ppoll ఫైల్ డిస్క్రిప్టార్స్ యొక్క వర్షన్లు పరీక్షించే ఫంక్షనాలిటీ జతచేయబడెను.
  • netgroup డాటాబేస్ యొక్క క్యాషింగ్ ఇప్పుడు nscd డీమన్ నందు తోడ్పాటునిస్తోంది.
  • కొత్త ఫంక్షన్ secure_getenv() అనునది ఎన్విరాన్మెంట్‌కు రక్షిత ఏక్సెస్ అనుమతించును, SUID మరియు SGID ప్రోసెస్ నందు నడుస్తుంటే NULL తిప్పియిచ్చును. ఈ ఫంక్షన్ అంతర్గత ఫంక్షన్‌ __secure_getenv() ను భర్తీచేయును.
  • సాల్ట్ బైట్స్ వాటి విలువులకు సంబందించిన స్పెసిఫికేషన్లు అతిక్రమించి పంపబడితే crypt() ఫంక్షన్ విఫలమౌతుంది. లైనక్సు పైన, crypt() ఫంక్షన్ /proc/sys/crypto/fips_enabled ఫైలును సంప్రదించి FIPS రీతి చేతనమైందో లేదో నిర్ధారించును, Message-Digest algorithm 5 (MD5) ఉపయోగించే ఎన్క్రిప్టెడ్ స్ట్రింగ్స్ పై విఫలమగును లేదా రీతి చేతనమైనప్పుడు Data Encryption Standard (DES) ఆల్గార్దెమ్ ఉపయోగించునప్పుడు.
  • clock_* సూట్ ఫంక్షన్లు (<time.h> నందు డిక్లైర్ చేసినవి) ఇప్పుడు మెయిన్ C లైబ్రరీ నందే అందుబాటులో ఉంటాయి. ఈ ఫంక్షన్లను ఉపయోగించుటకు గతంలో -lrt ఐచ్చికంతో లింకు చేయడం తప్పనిసరి. ఈ మార్పువలన clock_gettime() (-lrt తో లింకు చేయని) వంటి ఫంక్షన్ ఉపయోగించే సింగిల్-త్రెడెడ్ ప్రోగ్రామ్ రన్‌టైమ్ వద్ద pthreads లైబ్రరీను ఇంప్లిసిట్‌గా లోడ్ చేయదు తద్వారా C++ రన్‌టైమ్ లైబ్రరీ వంటి ఇతర కోడ్ నందు ఉన్న మల్టీ-త్రెడె సంబందిత వోవర్‌హెడ్సుతో ఇబ్బంది ఉండదు.
  • కొత్త హెడర్ <sys/auxv.h> మరియు ఫంక్షన్ getauxval() లైనక్స్ కెర్నల్ నుండి పంపిన AT_* కీ-వాల్యూ పెయిర్లకు సుళువైన ఏక్సెస్ అనుమతించును. హెడర్ AT_HWCAP కీ కు సంబందించిన HWCAP_* బిట్స్ నిర్వచించును.
  • లో-లెవల్ ప్లాట్‌ఫాం-స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ కొరకు సంస్థాపిత హెడర్ కొత్త క్లాస్ యొక్క పత్రీకరణ చేయబడెను. సమయ ఆధారిత నమోదు చిరునామాను అందించుటకు PowerPC ఒక ఫంక్షన్‌తో మొదటి ఇన్‌స్టాన్స్ జతచేసెను.

12.3. GDB

Red Hat Enterprise Linux 7.0 నందు, GDB డీబగ్గర్ అనునది gdb-7.6.1 విడుదలపై ఆధారపడును, మరియు Red Hat Enterprise Linux 6 సమానమైన వాటికి సారూప్య విస్తరింపులు మరియు బగ్‌పరిష్కారాలు అందించును.
ఈ వర్షన్ Red Hat Developer Toolset v2.0 నందలి GDB కు చెందును; Red Hat Enterprise Linux 6 మరియు Red Hat Enterprise Linux 7.0 GDB వర్షన్ల వివరణాత్మక పోలిక ఇక్కడ చూడవచ్చు:
Red Hat Enterprise Linux 7.0 నందు ఉన్న GDB యొక్క గుర్తించదగ కొత్త విశిష్టతలు:
  • కొత్త .gdb_index విభాగము మరియు కొత్త gdb-add-index షెల్ ఆదేశము ఉపయోగించి చిహ్నాల వేగవంతమైన లోడింగ్. ఈ విశిష్టత Red Hat Enterprise Linux 6.1 మరియు తరువాతి వాటినందు ఇప్పటికే ఉందని గమనించండి.
  • gdbserver ఇప్పుడు ప్రమాణిక ఇన్పుట్/అవుట్పుట్ (STDIO) అనుసంధానాలకు తోడ్పాటునిచ్చును, ఉదాహరణకు: (gdb) target remote | ssh myhost gdbserver - hello
  • -location పారామితితో watch యొక్క ఊహించిన ప్రవర్తన.
  • కొత్త ఆదేశము చే వర్చ్యువల్ మెథడ్ పట్టికలు ప్రదర్శించవచ్చు, info vtbl.
  • కొత్త ఆదేశాలు info auto-load, set auto-load మరియు show auto-load చేత స్వయంచాలకంగా ఫైళ్ళను లోడుచేయుట నియంత్రించుట.
  • set filename-display absolute ఆదేశము ఉపయోగించి సోర్స్ ఫైల్ పేర్లకు ఆబ్సల్యూట్ పాత్ ప్రదర్శించుట.
  • కొత్త ఆదేశము చేత హార్డువేర్ తోడ్పాటుతో కంట్రోల్ ఫ్లో రికార్డింగ్, record btrace.
Red Hat Enterprise Linux 7.0 నందు అందించిన GDB నందు గుర్తించదగిన బగ్ పరిష్కారాలు:
  • కోర్ ఫైళ్ళ పైన పనిచేయుటకు info proc ఆదేశము నవీకరించబడెను.
  • అన్ని ఇన్ఫీరియర్స్ నందు పోలిక ఉన్న అన్ని స్థానాలపైన బ్రేక్‌పాయింట్లు అమర్చబడెను.
  • బ్రేక్‌పాయింట్ స్థానము నందు భాగమైన ఫైల్ పేరు ఇప్పుడు సోర్స్ ఫైలు పేరు యొక్క ట్రెయిలింగ్ కాంపోనెంట్లతో సరిపోలును.
  • బ్రేక్‌పాయింట్లు ఇప్పుడు ఇన్‌లైన్ ఫంక్షన్ల పైన ఉంచవచ్చు.
  • టెంప్లేట్ యొక్క పారామితులు ఇప్పుడు టెంప్లేట్ ఇన్‌స్టాన్షియేట్ అయినప్పుడు పరిధినందు ఉంచబడును.
అదనంగా, Red Hat Enterprise Linux 7.0 కొత్త ప్యాకేజీ అందించును, gdb-doc, అది GDB మాన్యువల్‌ను PDF, HTML, మరియు info ఫార్మాట్లనందు కలిగి ఉంటుంది. Red Hat Enterprise Linux యొక్క గత వర్షన్ల నందు GDB మాన్యువల్ ముఖ్య RPM ప్యాకేజీ నందు భాగము.

12.4. పనితనం సాధనాలు

Red Hat Enterprise Linux 7.0 అనునది పనితనం సాధనాలకు ఇటీవలి వర్షన్ల నవీకరణలను కలిగివుంది, అవి oprofile, papi మరియు elfutils, పనితనం, పోర్టబిలిటీ, మరియు ఫంక్షనాలిటీ మెరుగుదలలు తెచ్చును.
చాలావరకు, Red Hat Enterprise Linux 7.0 ప్రీమియర్స్:
  • పనితనం కో-పైలట్ కు తోడ్పాటు.
  • SystemTap తోడ్పాటు (DynInst-based) ఇన్‌స్ట్రుమెంటేషన్ కొరకు అది మొత్తంగా అన్‌ప్రివిలైజ్డ్ యూజర్ స్పేస్ నందు నడుచును, అదే విధంగా జావా అనువర్తనాల సమర్థవంతమైన (Byteman-based) పిన్‌పాయింట్ ప్రోబింగ్.
  • హార్డువేర్ ట్రాన్సాక్షనల్ మెమొరీ కొరకు Valgrind తోడ్పాటు మరియు మోడలింగ్ వెక్టార్ సూచనల నందు మెరుగుదలలు.

12.4.1. పనితనం కో-పైలట్

Red Hat Enterprise Linux 7.0 అనునది పర్ఫార్మెన్స్ కో-పైలట్ (PCP) కొరకు తోడ్పాటు ప్రారంభించెను, సాధనాల, సేవల, మరియు లైబ్రరీలు ఎక్విజిషన్ కొరకు, సిస్టమ్-లెవల్ పనితనం కొలతల ఆర్కైవింగ్ మరియు ఎనాలసిస్. ఇది లైట్-వెయిట్, దీని డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ సంక్లిష్ట వ్యవస్థల కేంద్రీయ విశ్లేషణకు బాగా సరిపోవునట్లు చేస్తుంది.
పనితనం మెట్రిక్స్ Python, Perl, C++ మరియు C ఇంటర్ఫేసెస్ ఉపయోగించి జతచేయబడును. విశ్లేషణ సాధనాలు క్లైంట్ APIలు (Python, C++, C) నేరుగా ఉపయోగించవచ్చు, రిచ్ వెబ్ అనువర్తనాలు JSON ఇంటర్ఫేస్ ఉపయోగించి అందుబాటులోని పనితనం దత్తాంశం పొందవచ్చు.
మరింత సమాచారం కొరకు, pcp మరియు pcp-libs-devel ప్యాకేజీల నందు man పేజీలు చూడండి. pcp-doc ప్యాకేజీ అప్‌స్ట్రీమ్ ప్రోజెక్ట్ నుండి రెండు ఉచిత మరియు గోప్యంకాని పుస్తకాలు చేర్చును:

12.4.2. సిస్టమ్‌టాప్

Red Hat Enterprise Linux 7.0 systemtap వర్షన్ 2.4 కలిగివుంది, అది చాలా కొత్త సామర్ధ్యాలను తెచ్చును. వీటినందు ఐచ్చిక ప్యూర్-యూజర్‌స్పేస్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్, రిచ్ మరియు మరింత ప్రభావవంతమైన జావా ప్రోబింగ్, వర్చువల్ మిషన్ ప్రోబింగ్, మెరుగైన దోష సందేశాలు, మరియు చాలా బగ్ పరిష్కారాలు మరియు కొత్త విశిష్టితలు. ప్రత్యేకించి, కిందవి:
  • dyninst బైనరీ-ఎడిటింగ్ లైబ్రరీ ఉపయోగించి, SystemTap ఇప్పుడు కొన్ని స్క్రిప్టులను ప్యూర్‌గా యూజర్-స్పేస్ లెవల్ వద్ద ఎగ్జిక్యూట్ చేయును; కెర్నల్ లేదా root అనుమతులు ఉపయోగించబడవు. ఈ రీతి, stap --dyninst ఉపయోగించి ఎంచబడును, వాడుకరి స్వంత ప్రోసెస్‌లను ప్రభావితం చేసే ప్రోబ్స్ లేదా ఆపరేషన్లను చేతనం చేయును. ఈ రీతి అనునది C++ ఆక్షేపణలను ఇచ్చే ప్రోగ్రాములతో సారూప్యం కాదు.
  • byteman సాధనం నందు జావా అనువర్తనాల లోనికి ప్రోబ్స్ చొప్పించే కొత్త మార్గం తోడ్పాటు చేయబడింది. కొత్త System Tap ప్రోబ్ రకాలు, java("com.app").class("class_name").method("name(signature)").*, అనువర్తనం నందు స్వతంత్ర మెథడ్ ప్రవేశం మరియు నిష్క్రమణ ప్రోభింగ్ చేతనం చేయును, సిస్టమ్-వైడ్ ట్రేసింగ్ లేకుండానే.
  • సేవిక పైన నడుస్తున్న లిబ్‌వర్ట్-నిర్వాహిత KVM ఇన్‌స్టాన్స్ పైన రిమోట్ ఎగ్జిక్యూషన్‌ను చేతనం చేయుటకు SystemTap డ్రైవర్ టూలింగ్‌కు కొత్త సౌలభ్యం జతచేయబడెను. రక్షిత virtio-serial లింకు నందు వర్చ్యువల్ మిషన్ గెస్టుకు స్వయంచాలక మరియు రక్షిత కంపైల్డ్ SystemTap స్క్రిప్ట్ బదిలీ చేతనం చేయును. కొత్త గెస్టు-సైడ్ డీమన్ స్క్రిప్టును లోడుచేసి వాటి అవుట్పుట్‌ను అతిధేయకు బదిలీచేయును. ఈ మార్గం వేగవంతమైంది మరియు SSH కన్నా మరింత సురక్షితమైంది మరియు అతిథి మరియు అతిధేయ మధ్యన ఐపి-స్థాయి నెట్వర్కింగ్ అనుసంధానం అక్కరలేదు. ఈ ఫంక్షన్ పరీక్షించుటకు, కింది ఆదేశము నడుపండి:
    stap --remote=libvirt://MyVirtualMachine
  • అదనంగా, SystemTap విశ్లేషణ సందేశాలకు చాలా మెరుగుదలలు చేయబడెను:
    • చాలా దోష సందేశాలు ఇప్పుడు సంబందిత మాన్యువల్ పేజీల క్రాస్-రిఫరెన్సులు కలిగివున్నాయి. ఈ పేజీలు దోషాలను వివరించి దిద్దుబాట్లను సూచించును.
    • స్క్రిప్టు ఇన్పుట్ నందు టైపోగ్రాఫిక్ దోషాలు ఉన్నట్లు అనుమానించితే, క్రమపరచిన సూచన జాబితా వాడుకరికి అందించబడెను. ఈ సూచన సదుపాయం చాలా సందర్భాలలో ఉపయోగించవచ్చు ఎలాగంటే వాడుకరి-తెలిపిన పేర్లు ఆమోదించగల పేర్లతో సరిపోలనప్పుడు, ప్రోబ్‌డ్ ఫంక్షన్ పేర్లు, మార్కర్లు, వేరియబుల్స్, ఫైళ్ళు, ఎలియాసిస్, మరియు ఇతరమైనవి.
    • డాయాగ్నొస్టిక్ డూప్లికేట్-ఎలిమినేషన్ మెరుగు పరచబడింది.
    • సందేశాలు సులభంగా అర్ధంచేసుకోవడానికి ANSI వర్ణక్రమం జతచేయబడెను.

12.4.3. Valgrind

Red Hat Enterprise Linux 7.0 అనునది Valgrind కలిగివుంది, అది ప్రొఫైల్ అనువర్తనాల కొరకు చాలా సాధనాలతో సమకూరే ఇన్‌స్ట్రుమెంటేషన్ ఫ్రేమ్‌వర్క్. ఈ వర్షన్ అనునది Valgrind 3.9.0 విడుదలపై ఆధారపడును మరియు Red Hat Enterprise Linux 6 and Red Hat Developer Toolset 2.0 కౌంటర్‌పార్ట్సుకు సారూప్యమైన చాలా మెరుగుదలలు కలిగివుంది, అవి Valgrind 3.8.1 అధారపడును.
Red Hat Enterprise Linux 7.0 నందు చేర్చిన Valgrind యొక్క గుర్తించదగ కొత్త విశిష్టతలు:
  • DFP సౌలభ్యం సంస్థాపించివున్న అతిధేయిలపై IBM System Z డెసిమల్ ఫ్లోటింగ్ పాయింట్ సూచనలకు తోడ్పాటు.
  • IBM POWER8 (Power ISA 2.07) సూచనలకు తోడ్పాటు.
  • Inter AVX2 సూచనలకు తోడ్పాటు. ఇది 64-bit ఆకృతులపై మాత్రమే అందుబాటులో ఉందని గమనిచండి.
  • Inter ట్రాన్సాక్షనల్ సింక్రొనైజేషన్ ఎక్సుటెన్షన్స్ కొరకు ప్రాథమిక తోడ్పాటు, రిస్ట్రిక్టెడ్ ట్రాన్సాక్షనల్ మెమొరీ (RTM) మరియు హార్డువేర్ లాక్ ఎలిసన్ (HLE) రెంటికీ.
  • IBM PowerPC పైన హార్డువేర్ ట్రాన్సాక్షనల్ మెమొరీ కొరకు ప్రాథమిక తోడ్పాటు.
  • ట్రాన్సాక్షన్ క్యాషీ యొక్క అప్రమేయ పరిమాణం 16 సెక్టార్లకు పెంచబడెను, పెద్ద అనువర్తనాలకు ఇన్‌స్ట్రుమెంటేషన్ కావాలి మరియు పెద్ద మొత్తంలో కోడ్‌కు నిల్వకావాలి అనేది పరిగణనలో ఉంచుకొని. అవే కారణల వలన, ట్రాక్ చేయగల మెమొరీ మాప్డ్ సెగ్మెంట్లు 6 గుణిజంతో పెంచబడెను. ట్రాన్సాక్షన్ క్యాషీ నందలి సెక్టార్ల గరిష్ట సంఖ్య కొత్త ఫ్లాగ్ --num-transtab-sectors చేత నియంత్రించబడును.
  • తాత్కాలికంగా మొత్తం ఆబ్జక్టు యొక్క మాపింగ్ సృష్టించి దాని నుండి చదువుట Valgrind ఇకపై చేయదు. బదులుగా, చదవడం అనేది చిన్న నిర్దిష్ట పరిమాణ బఫర్ ద్వారా జరుగును. Valgrind పెద్ద భాగస్వామ్యపు ఆబ్జక్టుల నుండి డీబగ్గింగ్ సమాచారం చదువునప్పుడు ఇది వర్చ్యువల్ మెమొరీ స్పైక్స్ తప్పించును.
  • ఉపయోగించిన సప్రెషన్ల జాబితా (-v ఐచ్చికం తెలిపినప్పుడు), ఉపయోగించిన ప్రతి సప్రెషన్‌కు, సప్రెషన్ నిర్వచించిన చోట ఫైలు పేరు మరియు వరుస సంఖ్య ఇప్పుడు చూపబడును.
  • just-in-time (JIT) కంపైలర్‌కు అది అనువదించలేని సూచన యెదురైతే డయాగ్నొస్టిక్ సందేశం ముద్రించాలా లేదా అనేది --sigill-diagnostics అనే కొత్త ఫ్లాగ్ ఉపయోగించి నియంత్రించవచ్చు. వాస్తవ ప్రవర్తన — SIGILL సంకేతం అనువర్తనంకు అందించుట — మారలేదు.
  • Memcheck సాధనం ఇప్పుడు కింది విశిష్టతలతో మెరుగైంది:
    • వెక్టరైజ్డ్ కోడ్ సంభాలించుటలో మెరుగుదలలు, అతి తక్కువ దోష నివేదికలు ఇస్తున్నాయి. ఈ మార్పుల ప్రయోజనాలు పొందుటకు --partial-loads-ok=yes ఫ్లాగ్ ఉపయోగించండి.
    • లీక్ చెకర్ పైన మంచి నియంత్రణ. ఏ లీక్ రకాలు (definite/indirect/possible/reachable) ప్రదర్శించాలో, వేటిని దోషాల కింద పరిగణించాలో, మరియు వేటిని ఇచ్చిన లీక్ సప్రెషన్‌తో సప్రెస్ చేయాలో తెలపడం ఇప్పుడు సాధ్యం. ఇది --show-leak-kinds=kind1,kind2,.., --errors-for-leak-kinds=kind1,kind2,.. ఐచ్చికాలు మరియు సప్రెషన్ ఎంట్రీల నందు match-leak-kinds: ఐచ్చిక వరుసతో చేయవచ్చు.
      జనియింపచేసిన లీక్ సప్రెషన్లు కొత్త వరుస కలిగివుంటాయి మరియు గత విడుదల కంటే మరింత ప్రత్యేకంగా ఉంటాయని గమనించండి. మునుపటి విడుదలల వంటి ప్రవర్తనను పొందుటకు, జనియింపచేసిన సప్రెషన్లు ఉపయోగించుటకు ముందుగా వాటినుండి match-leak-kinds: వరుస తీసివేయి.
    • మంచి అనుసందానాత్మకతలు ఉపయోగించి లీక్ చెకర్ నుండి సాధ్యమగు లీక్ నివేదికలు తగ్గించబడెను. అందుబాటులోని అనుసంధానాత్మకతలు చెల్లునటువంటి ఇంటీరియర్ పాయింట్లను std:stdstring కు గుర్తించుటను, డిస్ట్రక్టర్స్ కలిగివున్న new[] కేటాయింపు ఎరేల గుర్తింపును మరియు మల్టిపుల్ ఇన్హరిటెన్స్ ఉపయోగించు C++ ఆబ్జక్టు యొక్క అంతర్బాగం పాయింట్‌చేసే ఇంటీరియర్ పాయింటర్స్ గుర్తించుటను అందించును. --leak-check-heuristics=heur1,heur2,... ఐచ్చికం ఉపయోగించి వాటిని విడివిడిగా ఎంపికచేయవచ్చు.
    • heap-allocated బ్లాక్స్ కొరకు స్టాక్‌ట్రేస్ ఎక్విజిషన్ యొక్క ఉత్తమ నియంత్రణ. --keep-stacktraces ఐచ్చికం ఉపయోగించి, ప్రతి ఎలొకేషన్ మరియు డీఎలొకేషన్ కు స్టాక్ ట్రేస్ పొందాలో లేదా విడివిడిగా నియంత్రించుట సాధ్యం. దీనిని మంచి "use after free" దోషాలు సృష్టించుటకు లేదా తక్కువ సమాచారం నమోదు చేయుట ద్వారా Valgrind రిసోర్స్ ఖర్చును తగ్గించుటకు ఉపయోగించవచ్చు.
    • లీక్ సప్రెషన్ వాడకం యొక్క మంచి రిపోర్టింగ్. ఉపయోగించిన సప్రెషన్ల జాబితా (-v ఐచ్చికం తెలిపినప్పుడు చూపబడును), ప్రతి లీక్ సప్రెషన్లకు, చివరి లీక్ శోధననందు ఎన్ని బ్లాక్స్ మరియు బైట్లు సప్రెస్ చేయబడెనో, ఉప్పుడు చూపును.
  • కింది పర్యవేక్షణ ఆదేశాలతో Valgrind GDB సేవిక కలయిక మెరుగుపరచబడింది:
    • కొత్త పర్యవేక్షణ ఆదేశం, v.info open_fds, అది ఓపెన్ ఫైల్ వివరిణిలు మరియు అదనపు వివరాలు ఇచ్చును.
    • కొత్త పర్యవేక్షణ ఆదేశం, v.info execontext, అది Valgrind చేత నమోదైన స్టాక్ ట్రేసెస్ గురించిన సమాచారం చూపును.
    • కొత్త పర్యవేక్షణ ఆదేశం, v.do expensive_sanity_check_general, ఫలానా అంతర్గత స్థిరత్య పరీక్షలు నడుపుటకు.

12.5. ప్రోగ్రామింగ్ భాషలు

Ruby 2.0.0

Red Hat Enterprise Linux 7.0 ఇప్పుడు సరికొత్త Ruby వర్షన్, 2.0.0 అందించును. వర్షన్ 2.0.0 మరియు Red Hat Enterprise Linux 6 నందు చేర్చిన 1.8.7 వర్షన్ మద్యన గుర్తించదగిన మార్పులు కిందివి:
  • కొత్త ఇంటర్‌ప్రీటర్, YARV (yet another Ruby VM), అది లోడింగ్ సమయాన్ని బాగా తగ్గింస్తుంది, ప్రత్యేకించి పెద్ద ట్రీలు లేదా ఫైళ్ళు గల అనువర్తనాలకు.
  • కొత్త మరియు వేగవంతమైన "Lazy Sweep" గార్బేజ్ కలక్టర్.
  • Ruby ఇప్పుడు స్ట్రింగ్ ఎన్కోడింగ్‌కు తోడ్పాటునిచ్చును.
  • Ruby ఇప్పుడు గ్రీన్ త్రెడ్స్ బదులుగా నేటివ్ త్రేడ్స్ కు తోడ్పాటునిచ్చును.
Ruby 2.0.0 గురించి మరింత సమాచారం కొరకు, ప్రోజెక్టు యొక్క అప్‌స్ట్రీమ్ పేజీలను సంప్రదించండి: https://www.ruby-lang.org/en/.

Python 2.7.5

Red Hat Enterprise Linux 7.0 Python 2.7.5 కలిగివుంది, ఇది సరికొత్త Python 2.7 విడుదల క్రమం. ఈ వర్షన్ పనితనంలో చాలా మెరుగుదలలు కలిగివుంది మరియు Python 3 తో ఫార్వార్డ్ కంపాటబిలిటీ కలిగివుంది. Python 2.7.5 నందు గుర్తించదగ మార్పులు కిందివి:
  • క్రమమైన డిక్షనరీ రకం
  • వేగవంతమైన I/O మాడ్యూల్
  • సెట్ మరియు డిక్షనరీ కాంప్రెహెన్సెస్
  • sysconfig మాడ్యూల్
మార్పుల పూర్తి జాబితా కొరకు, http://docs.python.org/dev/whatsnew/2.7.html చూడండి.

Java 7 మరియు బహుళ JDKs

Red Hat Enterprise Linux OpenJDK7 ను అప్రమేయ Java Development Kit (JDK) గా మరియు Java 7 సేవికలు అప్రమేయ Java వర్షన్‌గా అందించును. అన్ని Java 7 ప్యాకేజీలు (java-1.7.0-openjdk, java-1.7.0-oracle, java-1.7.0-ibm) బహుళ వర్షన్లను సమాంతరంగా సంస్థాపించుటకు అనుమతించును, కెర్నల్‌కు తగినట్లుగా.
సమాంతరంగా సంస్థాపన చేయగలగడం వలన వాడుకరులు ఒకే JDK యొక్క వివిధ వర్షన్లను ఏకకాలంలో ప్రయత్నించగలుగుతారు, అవసరమైతే పనితనం మరియు డీబగ్ సమస్యలను ట్యూన్ చేయుటకు. మునుపటివలె ఖచ్చితమైన JDK ను ప్రత్యామ్నాయాల ద్వారా ఎంపికచేయవచ్చు.

అధ్యాయము 13. నెట్వర్కింగ్

నెట్వర్కు టీమింగ్

నెట్వర్కు టీమింగ్ అనేది లింక్ ఎగ్రిగేషన్‌ బాండింగ్‌కు బదులుగా తేబడింది. సుళువుగా నిర్వహించుటకు, డీబగ్ చేయుటకు మరియు విస్తరింపుటకు ఇది రూపొందించబడింది. వాడుకరి కొరకు ఇది పనితనం మరియు ఫ్లెక్సిబిలిటీ మెరుగుదలలు అందించును మరియు అన్ని కొత్త సంస్థాపనలను ఎవాల్యూట్ చేయును.

నెట్వర్కుమెనేజర్

సేవిక అనువర్తనాల నందు ఉపయోగించుటకు బాగా సరిపోవునట్లు చేయుటకు NetworkManager కు చాలా మెరుగుదలలు చేయబడెను. ప్రత్యేకించి, ఎడిటర్స్ లేదా నియుక్తి సాధనాల చేత చేయబడిన ఆకృతీకరణ ఫైలు మార్పులనుNetworkManager అప్రమేయంగా పర్యవేక్షించదు. బాహ్య మార్పులను nmcli connection reload ఆదేశము ద్వారా తెలుపునట్లు చేయుటకు నిర్వహణాధికారులను ఇది అనుమతించును. NetworkManager D-Bus API లేదా NetworkManager కమాండ్-లైన్ సాధనం, nmcli చేత చేయబడిన మార్పులు, తక్షణమే వర్తించబడును.
వాడుకరులు మరియు స్క్రిప్టులు NetworkManager తో ఇంటరాక్ట్ అగుటకు nmcli సాధనం తేబడింది.

chrony సూట్

శాశ్వతంగా నెట్వర్కుపైన ఉండుటకు, ఎప్పుడూ ఆన్‌లో ఉండుటకు, సేవిక వర్గం కిందకు రాని వ్యవస్థలపైన సిస్టమ్ క్లాక్ నవీకరించుటకు chrony సూట్ సౌలభ్యాలు అందుబాటులో ఉంటాయి. తరచుగా సస్పెండ్‌కు గురయ్యే లేదా తటాలున నెట్వర్కు అనుసంధానం తెగిపోయి మరలా తిరిగిఅనుసంధానం అయ్యే వ్యవస్థలకు chrony సూట్ పరిగణించవచ్చు. ఉదాహరణకు మొబైల్ మరియు వర్చ్యువల్ వ్యవస్థలు.

డైనమిక్ ఫైర్‌వాల్ డీమన్, firewalld సూట్

Red Hat Enterprise Linux 7.0 డైనమిక్ ఫైర్‌వాల్ డీమన్ అందించును, firewalld, నెట్వర్కు మరియు దాని అనుసంధింత అనుసంధానాలు ఇంటర్ఫేసులకు భరోసా కల్పించుటకు నెట్వర్కు "zones" తోడ్పాటుతో గతికంగా నిర్వహించబడు ఫైర్‌వాల్ అందించును. ఇది IPv4 మరియు IPv6 ఫైర్‌వాల్ అమరికలకు తోడ్పాటు కలిగివుంది. ఇది ఈథర్నెట్ బ్రిడ్జులకు తోడ్పాటునిచ్చును మరియు సెపరేషన్ రన్‌టైమ్ మరియు శాశ్వత ఆకృతీకరణ ఐచ్చికాలు కలిగివుంది. ఫైర్‌వాల్ నియమాలను నేరుగా జతచేయుటకు సేవలు లేదా అనువర్తనాల కొరకు ఇంటర్ఫేస్ కూడా కలిగివుంది.

DNSSEC

DNSSEC అనునది డొమైన్ నేమ్ సిస్టమ్ సెక్యూరిటీ ఎక్సుటెన్షన్స్ (DNSSEC) సమితి అది DNS నేమ్‌సర్వర్స్ నుండి వచ్చు స్పందనల సమగ్రతను పరీక్షించి ధృవీకరించుటకు DNS క్లైంట్‌ను చేతనం చేయును అలా వాటి మూలాన్ని కనుగొని మరియు త్రోవలో జోక్యానికి గురైనవేమో నిర్ధారించబడును.

OpenLMI

Red Hat Enterprise Linux 7.0 OpenLMI ప్రోజెక్టు అందించును, అది లైనక్స్ వ్యవస్థల నిర్వహణ కొరకు ఉమ్మడి అవస్థాపన అందించును. వాడుకరులు హార్డువేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, మరియు వ్యవస్థ సేవలను ఆకృతీకరించుటకు, నిర్వహించుటకు మరియు పర్యవేక్షించుటకు అనుమతించును. OpenLMI అనునది ఉత్పత్తి సేవికల ఆకృతీకరణ మరియు నిర్వహణ పనులు సులభతరం చేయుటకు ఉద్దేశించినది.
OpenLMI అనేది Red Hat Enterprise Linux యొక్క వివిధ వర్షన్లకు ఉమ్మడి నిర్వహణా ఇంటర్ఫేస్ అందించుటకు రూపొందించబడింది. ఇది ఇప్పటికే ఉన్న సాధనాలపై నిర్మించబడును, ఎబ్‌స్ట్రాక్షన్ లేయర్‌ను అందించును అది ఆధార వ్యవస్థ యొక్క సంక్లిష్టతను వ్యవస్థ నిర్వహణాధికారులకు కనబడకుండా చేయును.
OpenLMI నిర్వాహిత వ్యవస్థ పైన సంస్థాపించిన వ్యవస్థ నిర్వహణా ఏజెంట్ల సమితిని కలిగివుంటుంది, OpenLMI నియంత్రిక, అది ఎజెంట్లను నిర్వహించి వాటికి ఇంటర్ఫేస్ అందించును, మరియు OpenLMI నియంత్రిక ద్వారా వ్యవస్థ నిర్వాహిత ఏజెంట్లను పిలిచే క్లైంట్ అనువర్తనాలు లేదా స్క్రిప్టులు.
OpenLMI వాడుకరులను అనుమతించును:
  • బేర్-మెటల్ ఉత్పాదక సేవికలు అదే విధంగా వర్చ్యువల్ మిషన్ అతిథులు ఆకృతీకరించుటకు, నిర్వహించుటకు మరియు పర్యవేక్షించుటకు;
  • స్థానిక లేదా దూరస్థ వ్యవస్థలను ఆకృతీకరించుటకు, నిర్వహించుటకు మరియు పర్యవేక్షించుటకు;
  • నిల్వ మరియు నెట్వర్కులను ఆకృతీకరించుటకు, నిర్వహించుటకు మరియు పర్యవేక్షించుటకు;
  • C/C++, Python, Java, లేదా కమాండ్-లైన్ ఇంటర్ఫేస్ నుండి వ్యవస్థ నిర్వాహిత ఫంక్షన్లు కాల్ చేయుటకు.
OpenLMI సాఫ్టువేర్ ప్రొవైడర్ అనునది సాంకేతిక మందుస్తుదర్శనం వలె మాత్రమే తోడ్పాటునిచ్చునని గమనించండి. సాఫ్టువేర్ పూర్తిగా ఫంక్షనల్‌గా ఉంది, ఏమైనప్పటికీ, కొన్ని ఆపరేషన్లు ఎక్కువ వనరులు ఖర్చు చేయవచ్చు.
OpenLMI గురించి మరింత సమాచారం కొరకు, http://www.openlmi.org చూడండి.

qlcnic డ్రైవర్ నందు SR-IOV ఫంక్షనాలిటీ

సింగిల్ రూట్ I/O వర్చ్యులైజేషన్ (SR-IOV) తోడ్పాటు qlcnic డ్రైవర్ కొరకు సాంకేతిక ముందస్తుదర్శనం వలె జతచేయబడెను. ఈ ఫంక్షనాలిటీ కొరకు తోడ్పాటు నేరుగా QLogic నుండి అందించబడును, మరియు వినియోగదారులు QLogic మరియు Red Hat కు వారి స్పందనను తెలుపాలని కోరుచున్నాము. qlcnic డ్రైవర్ నందు ఇతర ఫంక్షనాలిటీ పూర్తిగా తోడ్పాటునిచ్చును.

FreeRADIUS 3.0.1

Red Hat Enterprise Linux 7.0 FreeRADIUS వర్షన్ 3.0.1 కలిగివుంది, అది చాలా కొత్త విశిష్టతలను అందించును వాటిలో బాగా గుర్తించదగినవి:
  • RadSec, TCP మరియు TLS నందు RADIUS డాటాగ్రామ్స్ బదిలీచేయుటకు ఒక ప్రొటోకాల్.
  • Yubikey తోడ్పాటు.
  • కనెక్షన్ పూలింగ్. radiusd సేవిక అనేది అనుసంధానాలను వైవిధ్యమైన బ్యాకెండ్లకు (SQL, LDAP, మరియు ఇతరములు) నిర్వహించును కనక్షన్ పూలింగ్ అనేది గ్రేటర్ త్రౌపుట్‌ను లోయర్ రిసోర్స్ వత్తిడిలతో అందించును.
  • సేవిక ఆకృతీకరణ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, unlang, యొక్క సిన్టాక్స్ విస్తరించబడెను.
  • సైట్-స్పెసిఫిక్ మరియు వెండార్-స్పెసిఫిక్ ఏట్రిబ్యూట్ల కొరకు మెరుగైన తోడ్పాటు.
  • వెర్బోస్ అవుట్పుట్ నందలి సమస్యలను ఉద్దీపనం చేయు మెరుగైన డీబగ్గింగ్.
  • SNMP ట్రాప్ జనియింపు.
  • మెరుగైన WIMAX తోడ్పాటు.
  • EAP-PWD తోడ్పాటు.

నమ్మికైన నెట్వర్కు అనుసంధానం

Red Hat Enterprise Linux 7.0 అనేది నమ్మికైన నెట్వర్కు అనుసంధానం అను ఫంక్షనాలిటీను సాంకేతిక ముందస్తుదర్శనం వలె తెచ్చింది. నమ్మికైన నెట్వర్కు అనుసంధానం అనునది ఇప్పటికే ఉన్న నెట్వర్కు ఏక్సెస్ కంట్రోల్ (NAC) పరిష్కారాలతో ఉపయోగించబడును, అవి TLS, 802.1x, లేదా ఎండ్ పాయింట్ పోస్టర్ ఎసెస్‌మెంట్ కలుపుటకు IPSec; అది, ఎండ్ పాయింట్ సిస్టమ్ సమాచారం సేకరించును (ఆపరేటింగ్ సిస్టమ్ ఆకృతీకరణ అమరికలు, సంస్థాపిత ప్యాకేజీలు, మరియు ఇతరములు, ఇంటిగ్రిటీ మెజర్‌మెంట్సుగా పిలువబడేవి, మొదలైనవి). ఎండ్ పాయింట్‌ను నెట్వర్కును ఏక్సెస్ చేయుటకు అనుమతించుటకు ముందుగా నమ్మికైన నెట్వర్కు అనుసంధానం ఈ మెజర్‌మెంట్లను నెట్వర్కు ఏకెస్స్ పాలసీలతో నిర్ధారించుకొనును.

అధ్యాయము 14. వనరు(రిసోర్స్) నిర్వహణ

నియంత్రణ సమూహాలు

Red Hat Enterprise Linux 7.0 నియంత్రణ సమూహాలు అందించును, ఇది వనరుల నిర్వహణను పేరుగల సమూహాల ట్రీ నందు ప్రోసెస్‌లను నిర్వహించే విధానం. ప్రోసెస్‌లను క్రమానుగతి శ్రేణి నందు సమూహంగా మరియు లేబుల్‌గా చేయుటకు మార్గాన్నిస్తాయి మరియు వనరుల పరిమితిని ఆ సమూహాలపై అమలుచేయుటకు మార్గాన్నిస్తాయి. Red Hat Enterprise Linux 7.0 నందు, నియంత్రణ సమూహాలు ప్రత్యేకించి systemd ద్వారా నిర్వహించుబడుచున్నవి. cgroups అనునవి systemd యూనిట్ ఫైళ్ళ నందు ఆకృతీకరించబడెను మరియు systemd యొక్క కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ (CLI) సాధనాలతో నిర్వహించవచ్చు.
నియంత్రణ సమూహాలు మరియు ఇతర వనరుల నిర్వహణ విశిష్టతలు వనరుల నిర్వహణ మార్గదర్శిని నందు విశదంగా చర్చించబడినవి.

అధ్యాయము 15. ధృవీకరణ మరియు యింటరాపరబిలిటి

కొత్త విశ్వశనీయత ఆచరణ

వాడుకరి రక్షణ గుర్తింపుకారి నుండి జనియింపచేసిన వాడుకరి ఐడి లేదా సమూహ ఐడి ఉపయోగించుటకు బదులుగా ఏక్టివ్ డైరెక్టరీ నందు నిర్వచించిన వాడుకరి ఐడి లేదా సమూహ ఐడి ఉపయోగించుట ఇప్పుడు Red Hat Enterprise Linux 5.9 క్లైంట్లు మరియు తరువాతి వాటినందు మరియు Red Hat Enterprise Linux 6.3 క్లైంట్ల నందు తోడ్పాటునిచ్చును. POSIX ఏట్రిబ్యూట్లు ఏక్టివ్ డైరెక్టరీ నందు నిర్వచించబడినట్లైతే ఈ విశ్వశనీయత ఆచరణ ఉపయోగించదగది.

నవీకరించిన slapi-nis చొప్పింత

Red Hat Enterprise Linux 7.0 నవీకరించిన డైరెక్టరీ సర్వర్ చొప్పింతను అందిస్తోంది, slapi-nis, అది ఏక్టవ్ డైరెక్టరీ వాడుకరులను లెగసీ సిస్టమ్స్ పైన ధృవీకరించబడుటకు అనుమతించును. ఈ ఫంక్షన్ సాంకేతిక ముందస్తు దర్శనం అని గమనించండి.

IPA కొరకు బ్యాకప్ మరియు రీస్టోర్ మెకానిజం

IPA సూట్‌కు బ్యాకప్ మరియు రీస్టోర్ మెకానిజం అనునది Red Hat Enterprise Linux 7.0 నందు సాంకేతిక ముందస్తు దర్శనం వలె అందించబడుతోంది.

సాంబా 4.1.0

Red Hat Enterprise Linux 7.0 samba ప్యాకేజీలను సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించెను, అది చాలా బగ్ పరిష్కారాలను మరియు విస్తరింపులను అందించును, బాగా గుర్తించదగినది సేవిక మరియు క్లైంట్ నందు SMB3 ప్రొటోకాల్ కు తోడ్పాటు.
అదనంగా, SMB3 ట్రాన్సుపోర్ట్ అనునది SMB3 తోడ్పాటునిచ్చే విండోస్ సేవికలతో ఎన్క్రిప్టెడ్ ట్రాన్సుపోర్ట్ అనుసంధానాలను చేతనం చేయును, అదే విధంగా సాంబా సేవికలతో కూడా. సాంబా 4.1.0 సేవిక-వైపు నకలు చర్యలకు కూడా తోడ్పాటునిచ్చును. సేవిక-వైపు నకలు తోడ్పాటును ఉపయోగించే క్లైంట్స్, సరికొత్త విండోస్ విడుదలలు వంటివి, ఫైల్ నకలు తీయడం వంటి చర్యలలో చెప్పుకోదగ్గ పనితనం మెరుగుదలను చూడవచ్చు.

హెచ్చరిక

నవీకరించిన samba ప్యాకేజీలు ఇప్పటికే నిలిపివేసిన ఆకృతీకరణ ఐచ్చికాలను తీసివేసెను. బాగా ముఖ్యమైనవి సేవిక పాత్రలు security = share మరియు security = server. వెబ్ ఆకృతీకరణ సాధనం SWAT కూడా పూర్తిగా తీసివేయబడెను. సాంబా 4.0 మరియు 4.1 విడుదల నోట్స్ నందు మరిన్ని వివరాలు కనుగొనవచ్చు.
చాలా tdb ఫైళ్ళు నవీకరించబడెనని గమనించండి. దీనర్దం మీరు smbd డీమన్ యొక్క కొత్త వర్షన్ ప్రారంభించగానే అన్ని tdb ఫైళ్ళు నవీకరించబడును. మీరు tdb ఫైళ్ళ బ్యాకప్‌ను కలిగివుంటే తప్పించి మీరు పాత సాంబా వర్షన్‌కు డౌన్‌గ్రేడ్ చేయలేరు
ఈ మార్పుల గురించి మరిన్ని వివరాల కొరకు, పైన తెలిపిన సాంబా 4.0 మరియు 4.1 విడుదల నోట్స్ చూడండి.

AD మరియు LDAP సూడో ప్రొవైడర్స్ ఉపయోగం

AD ప్రొవైడర్ అనునది ఒక బ్యాకెండ్ అది ఏక్టివ్ డైరెక్టరీ కు అనుసంధానమగుటకు ఉపయోగించబడును. Red Hat Enterprise Linux 7.0 నందు, LDAP ప్రొవైడర్‌తో కలిపి AD సూడో ప్రొవైడర్‌ను ఉపయోగించుట సాంకేతిక ముందస్తు దర్శనంలా తోడ్పాటునీయబడును. AD సూడో ప్రొవైడర్ చేతనం చేయుటకు, sssd.conf ఫైలు డొమైన్ విభాగము నందు sudo_provider=ad అమరికను జతచేయుము.

అధ్యాయము 16. రక్షణ

OpenSSH chroot షెల్ లాగిన్లు

సాధారణంగా, లైనక్స్ వాడుకరులకు SELinux నందు ఉన్న నిర్భందాలను సంక్రమింపచేయుటకు, ప్రతి లైనక్స్ వాడుకరి ఒక SELinux వాడుకరికి SELinux పాలసీ ఉపయోగించి మాప్ చేయబడతారు. లైనక్స్ వాడుకరులు SELinux unconfined_u వాడుకరికి మాప్ అయ్యే ఒక అప్రమేయ మాపింగ్ ఉంది.
Red Hat Enterprise Linux 7 నందు, వాడుకరులను chroot చేయుటకు ChrootDirectory ఐచ్చికమును అన్‌కన్ఫైన్డ్ వాడుకరులు ఏ మార్పు లేకుండా ఉపయోగించవచ్చు, staff_u, user_u, లేదా guest_u వలె, SELinux selinuxuser_use_ssh_chroot వేరియబుల్ అమర్చాలి. అధిక రక్షణ కొరకు ChrootDirectory ఐచ్చికం ఉపయోగించునప్పుడు నిర్వహణాధికారులు అన్ని chroot వాడుకరులకు guest_u వాడుకరి ఉపయోగించమని సూచించడమైంది.

మల్టిపుల్ రిక్వైర్డ్ ఆథెంటికేషన్స్

Red Hat Enterprise Linux 7.0 మల్టిపుల్ రిక్వైర్డ్ ఆథెంటికేషన్స్ ను SSH ప్రొటోకాల్ వర్షన్ 2 నందు AuthenticationMethods ఐచ్చికం ఉపయోగించి తోడ్పాటునిచ్చును. ఈ ఐచ్చికం ధృవీకరణ విధానపు పేర్ల జాబితాను కామాతో వేరుచేసి జాబితా చేయును. ఏదేని జాబితాలో సఫలవంతంగా పూర్తిచేసిన అన్ని విధానాలు ధృవీకరణను పూర్తిచేయుటకు అవసరం. ఇది దీనిని చేతనం చేస్తుంది, ఉదాహరణకు, వాడుకరి పబ్లిక్ కీ లేదా GSSAPI ఉపయోగించి సంకేతపదం ధృవీకరణకు ముందుగానే ధృవీకరించాలి.

GSS ప్రోక్సీ

GSS ప్రోక్సీ అనునది వ్యవస్థ సేవ అది ఇతర అనువర్తనముల తరపున GSS API కేర్బరోస్ కాంటెక్స్ట్ నెలకొల్పును. ఇది రక్షణ ప్రయోజనాలను తెచ్చును, ఉదాహరణకు, సిస్టమ్ కీటాబ్‌కు ఏక్సెస్ అనునది వివిధ ప్రోసెస్‌ల మధ్య పంచుకోబడినప్పుడు, ఆ ప్రోసెస్ దాడికి గురైతే అన్ని ఇతర ప్రోసెస్‌లు కేర్బరోస్ వంచనకు గురికావలసి వస్తుంది.

NSS నందు మార్పులు

nss ప్యాకేజీలు అప్‌స్ట్రీమ్ వర్షన్ 3.15.2 కు నవీకరించబడెను. మెసేజ్-డైజెస్ట్ అల్గార్దెమ్ 2 (MD2), MD4, మరియు MD5 సంతకాలు అనునవి ఆన్‌లైన్ సర్టిఫికేట్ స్టేటస్ ప్రొటోకాల్ (OCSP) లేదా సర్టిఫికేట్ రివోకేషన్ లిస్ట్స్ (CRLs) కొరకు ఆమోదించబడవు, సాధారణ సర్టిఫికేట్ సిగ్నేచర్స్ సంభాలించ గలుగుతాయి.
అడ్వాన్సుడ్ ఎన్క్రిప్షన్ స్టాన్డర్డ్ గలోయిస్ కౌంటర్ మోడ్ (AES-GCM) సైఫర్ సూట్ (RFC 5288 మరియు RFC 5289) అనునది TLS 1.2 నేగోషియేషన్ నందు ఉపయోగించుటకు జతచేయబడెను. ప్రత్యేకించి, కింది సైఫర్ సూట్లు ఇప్పుడు తోడ్పాటునిచ్చును:
  • TLS_ECDHE_ECDSA_WITH_AES_128_GCM_SHA256
  • TLS_ECDHE_RSA_WITH_AES_128_GCM_SHA256
  • TLS_DHE_RSA_WITH_AES_128_GCM_SHA256
  • TLS_RSA_WITH_AES_128_GCM_SHA256

SCAP వర్కుబెంచ్

SCAP వర్కుబెంచ్ GUI ఫ్రంట్ ఎండ్ అది SCAP కాంటెంట్ కొరకు స్కానింగ్ ఫంక్షనాలిటీను అందించును. SCAP వర్కుబెంచ్ అనునది సాంకేతిక ముందస్తు దర్శనం వలె Red Hat Enterprise Linux 7.0 నందు చేర్చబడింది.
అప్‌స్ట్రీమ్ ప్రోజెక్టు వెబ్ సైటు పైన మీరు వివరణాత్మక సమాచారం పొందవచ్చు:

OSCAP అనకొండ పొడిగింత

Red Hat Enterprise Linux 7.0 అనునది OSCAP అనకొండ పొడిగింతను సాంకేతిక ముందస్తు దర్శనం వలె పరిచయం చేస్తోంది. ఈ పొడిగింత OpenSCAP సౌలభ్యాలను సంస్థాపనా కార్యక్రమంతో కలుపుతోంది మరియు SCAP కాంటెంట్ చేత ఈయబడిన వ్యవస్థ అనుసరణ నియమాల సంస్థాపనను చేతనంచేయును.

అధ్యాయము 17. సబ్‌స్క్రిప్షన్ నిర్వహణ

Red Hat Enterprise Linux 7.0 Red Hat సబ్‌స్క్రిప్షన్ నిర్వహణ సేవలు ఉపయోగించి పొందవచ్చు. మీ Red Hat Enterprise Linux 7.0 ను Red Hat సబ్‌స్క్రిప్షన్ నిర్వహణతో ఎలా నమోదు చేయాలి అనేదానిపై సమాచార నిధి వ్యాసం సంక్షిప్త అవలోకనం మరియు సూచనలు అందించును.

ధృవీకరణపత్ర-ఆధారిత ఎన్టైటిల్మెంట్స్

Red Hat Enterprise Linux 7.0 కొత్త ధృవీకరణపత్ర-ఆధారిత ఎన్టైటిల్మెంట్లను subscription-manager సాధనంతో ఇచ్చును. Red Hat Enterprise Linux 5 మరియు 6 ఉపయోగించు వాడుకరులకు బదలాయింపు అందించుటకు శాటిలైట్ వాడుకరుల కొరకు లెగసీ ఎన్టైటిల్మెంట్స్ కూడా తోడ్పాటునిచ్చును. rhn_register లేదా rhnreg_ks సాధనాలు ఉపయోగించి Red Hat నెట్వర్కు క్లాసిక్‌కు నమోదగుట Red Hat Enterprise Linux 7.0 పై పనిచేయుదు. మీరు ఈ సాధనాలు Red Hat శాటిలైట్ లేదా ప్రోక్సీ వర్షన్లు 5.6 నమోదుకు మాత్రమే ఉపయోగించగలరు.

అధ్యాయము 18. డెస్కుటాప్

18.1. గ్నోమ్ 3

Red Hat Enterprise Linux 7.0 తరువాతి ముఖ్య గ్నోమ్ డెస్కుటాప్ వర్షన్ అందించును, గ్నోమ్ 3. గ్నోమ్ 3 యొక్క వాడుకరి అనుభూతి ఇప్పటికే గ్నోమ్ షెల్ ద్వారా నిర్వచించబడింది, ఏదైతే గ్నోమ్ 2 డెస్కుటాప్ షెల్ భర్తీ చేసెనో. విండో నిర్వహణ మినహా, గ్నోమ్ షెల్ తెరపైన పై పట్టీను అందించును, అది 'వ్యవస్థ స్థితి' ను పై కుడి మూలన చూపును, గడియారం చూపును, అలాగే హాట్ కార్నర్ కలిగివుంది అది కార్యకలాపాల అవలోకనం కు మారును, అది అనువర్తనాలు మరియు విండోలకు సుళువైన ఏక్సెస్ అందించును.
Red Hat Enterprise Linux 7.0 నందలి అప్రమేయ గ్నోమ్ షెల్ ఇంటర్ఫేస్ గ్నోమ్ క్లాసిక్ అది విండో జాబితాను తెర కిందివైపున అందించును మరియు సాంప్రదాయ అనువర్తనాలు మరియు స్థలములు మెనూలను అందించును.
గ్నోమ్ 3 గురించి మరింత సమాచారం కొరకు, గ్నోమ్ సహాయం చూడండి. దానిని ఏక్సెస్ చేయుటకు, Super (Windows) కీ వత్తి కార్యకలాపాల అవలోకనం కు వెళ్ళి, help టైపు చేసి, Enter వత్తుము.
గ్నోమ్ 3 డెస్కుటాప్ నియుక్తి, ఆకృతీకరణ మరియు నిర్వహణ గురించిన మరింత సమాచారం కొరకు, డెస్కుటాప్ మైగ్రేషన్ మరియు నిర్వహణ మార్గదర్శిని చూడండి.

GTK+ 3

గ్నోమ్ 3 GTK+ 3 లైబ్రరీ ఉపయోగించును దానిని GTK+ 2 కు సమాంతరంగా సంస్థాపించవచ్చు. GTK+ మరియు GTK+ 3 రెండూ Red Hat Enterprise Linux 7.0 నందు అందుబాటులో ఉన్నాయి. మనుగడలో ఉన్న GTK+ 2 అనువర్తనాలు గ్నోమ్ 3 నందు కూడా పనిచేయును.

గ్నోమ్ బాక్సెస్

Red Hat Enterprise Linux 7.0 తేలికైన గ్రాఫికల్ డెస్కుటాప్ వర్చ్యులైజేషన్ సాధనం అందిస్తోంది అది ఉపయోగించి వర్చ్యువల్ మిషన్లు మరియు దూరస్థ వ్యవస్థలు దర్శించవచ్చు మరియు ఏక్సెస్ చేయవచ్చు. గ్నోమ్ బాక్సెస్ వివిధ ఆపరేటింగ్ సిస్టమ్స్ మరియు అనువర్తనాలను డెస్కుటాప్ నుండి కనీసపు ఆకృతీకరణతో పరీక్షించుటకు మార్గాన్నిస్తోంది.

18.2. KDE

Red Hat Enterprise Linux 7.0 KDE ప్లాస్మా వర్కుస్పేస్ వర్షన్ 4.10 మరియు సరికొత్త వర్షన్ KDE ప్లాట్‌ఫాం మరియు అనువర్తనాలు అందించును, విడుదల గురించి మరింత సమాచారం కొరకు, http://www.kde.org/announcements/4.10/ చూడండి.

KScreen

బహుళ ప్రదర్శనల ఆకృతీకరణ KScreen తో మెరుగుపరచబడెను, KDE కొరకు కొత్త తెర నిర్వహణ సాఫ్టువేర్. మానిటర్ ఆకృతీకరణ మరియు అనుసంధానిత మానిటర్స్ ప్రొఫైళ్ళు దాచుటకు మరియు తిరిగితెచ్చుటకు KScreen కొత్త వాడుకరి ఇంటర్ఫేస్ అందించును. KScreen గురించి విశదమైన సమాచారం కొరకు, http://community.kde.org/Solid/Projects/ScreenManagement చూడండి.

అధ్యాయము 19. వెబ్ సర్వర్లు మరియు సేవలు

అపాచీ HTTP సర్వర్ 2.4

అపాచీ HTTP సేవిక (httpd) యొక్క వర్షన్ 2.4 Red Hat Enterprise Linux 7.0 నందు చేర్చబడెను, మరియు చాలా కొత్త విశిష్టతలను అందిస్తోంది:
  • "Event" ప్రోసెసింగ్ మాడ్యూల్ విస్తరిత వర్షన్, మెరుగైన ఎసింక్రొనస్ రిక్వెస్ట్ ప్రోసెస్ మరియు పనితనం;
  • mod_proxy మాడ్యూల్ నందు స్వాభావిక FastCGI తోడ్పాటు;
  • Lua లాంగ్వేజ్ ఉపయోగించి ఎంబెడెడ్ స్క్రిప్టింగ్ కొరకు తోడ్పాటు.
httpd 2.4 నందలి విశిష్టతలు మరియు మార్పులు గురించి మరింత సమాచారం http://httpd.apache.org/docs/2.4/new_features_2_4.html వద్ద కనుగొనవచ్చు. ఎడాప్టింగ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ మార్గదర్శిని కూడా అందుబాటులో వుంది:http://httpd.apache.org/docs/2.4/upgrading.html.

MariaDB 5.5

Red Hat Enterprise Linux 7.0 నందు MySQL యొక్క అప్రమేయ ఇంప్లిమెంటేషన్ MariaDB. MariaDB అనునది MySQL డాటాబేస్ ప్రోజెక్టుకు కమ్యూనిటీ-అభివృద్ది చేసిన ఫోర్క్, మరియు MySQL ను భర్తీచేయును. MariaDB MySQL తో API మరియు ABI సారూప్యత కలిగివుంటుంది మరియు చాలా కొత్త విశిష్టతలను జతచేయును; ఉదాహరణకు, బ్లాక్-చేయని క్లైంట్ API లైబ్రరీ, విస్తరిత పనితనంతో Aria మరియు XtraDB నిల్వ ఇంజన్లు, ఉత్తమ సర్వర్ స్థితి వేరిబుళ్ళు లేదా ఎన్హాన్సుడ్ రిప్లికేషన్.
MariaDB గురించిన వివరణాత్మక సమాచారం https://mariadb.com/kb/en/what-is-mariadb-55/ వద్ద దొరుకును.

PostgreSQL 9.2

PostgreSQL అడ్వాన్సుడ్ ఆబ్జక్ట్-రిలేషనల్ డాటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (DBMS). postgresql ప్యాకేజీలు, PostgreSQL సేవిక ప్యాకేజీలు, క్లైంట్ ప్రోగ్రామ్లు, మరియు PostgreSQL DBMS సేవిక ఏక్సెస్ చేయుటకు కావలసిన లైబ్రరీలు కలిగివుండును.
Red Hat Enterprise Linux 7.0 PostgreSQL వర్షన్ 9.2 అందించును. కొత్త విశిష్టతల జాబితా కొరకు, బగ్ పరిష్కారాల కొరకు మరియు Red Hat Enterprise Linux 6 నందు ప్యాకేజీ అయిన వర్షన్ 8.4 తో లేని సారూప్యతల కొరకు, అప్‌స్ట్రీమ్ విడుదల నోట్స్ చూడండి:
లేదా PostgreSQL వికీ పేజీలు:

అధ్యాయము 20. పత్రీకరణ

Red Hat Enterprise Linux 7.0 కొరకు పత్రీకరణ వివిధ ప్రత్యేక పత్రాల సమాహారం. ఈ పత్రాలలో ప్రతీది కింది సంగతులలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వాటికి చెందును:
  • విడుదల పత్రీకరణ
  • సంస్థాపన మరియు నియుక్తి(డిప్లోయ్‌మెంట్)
  • రక్షణ
  • సాధనములు మరియు పనితనము
  • క్లస్టరింగ్
  • వర్చ్యులైజేషన్

20.1. విడుదల పత్రీకరణ

విడుదల నోట్స్

విడుదల నోడ్స్ Red Hat Enterprise Linux 7.0 నందలి ముఖ్యమైన కొత్త విశేషణాలను పత్రీకరించును.

సాంకేతిక నోట్స్

Red Hat Enterprise Linux సాంకేతిక నోట్స్ ఈ విడుదల నందలి తెలిసిన సమస్యల గురించిన సమాచారం కలిగివుంది.

మైగ్రేషన్ ప్రణాళిక మార్గదర్శిని

Red Hat Enterprise Linux మైగ్రేషన్ ప్రణాళిక మార్గదర్శిని Red Hat Enterprise Linux 6 నుండి Red Hat Enterprise Linux 7 కు మైగ్రేషన్ పత్రీకరణ చేయును.

డెస్కుటాప్ మైగ్రేషన్ మరియు నిర్వహణ మార్గదర్శిని

Red Hat Enterprise Linux 7 పైన గ్నోమ్ 3 డెస్కుటాప్ మైగ్రేషన్ ప్రణాళిక, నియామకం, ఆకృతీకరణ, మరియు నిర్వహణను డెస్కుటాప్ మైగ్రేషన్ మరియు నిర్వహణ మార్గదర్శిని పత్రీకరణ చేయును.

20.2. సంస్థాపన మరియు నియుక్తి(డిప్లోయ్‌మెంట్)

సంస్థాపనా మార్గదర్శిని

సంస్థాపన మార్గదర్శిని Red Hat Enterprise Linux 7 సంస్థాపనకు సంబందించిన సమాచారం పత్రీకరణ చేయును. ఈ పుస్తకం ఆధునిక సంస్థాపన పద్దతులు కిక్‌స్టార్ట్ మరియు PXE సంస్థాపనలు, మరియు VNC నందు సంస్థాపనలు, అదేవిధంగా సంస్థాపన-తరువాత చేయవలసినవి వివరించును.

వ్యవస్థ నిర్వహణాధికారి మార్గదర్శిని

వ్యవస్థ నిర్వహణాధికారి మార్గదర్శని అనునది Red Hat Enterprise Linux 7 నియోగించుట, ఆకృతీకరించుట, మరియు నిర్వహించుట గురించి సమాచారం అందించును.

వ్యవస్థ నిర్వహణాధికారి రిఫరెన్స్ మార్గదర్శిని

వ్యవస్థ నిర్వహణాధికారి రిఫరెన్స్ మార్గదర్శిని Red Hat Enterprise Linux 7 నిర్వహణాధికారులకు రిఫరెన్సె మార్గదర్శిని.

నిల్వ నిర్వహణ మార్గదర్శిని

నిల్వ నిర్వహణ మార్గదర్శిని Red Hat Enterprise Linux 7 పైన నిల్వ పరికరాలను మరియు ఫైల్ వ్యవస్థలను ఎలా నిర్వహించాలో సూచనలు అందించును. Red Hat Enterprise Linux లేదా Fedora లైనక్స్ పంపిణీల పై మధ్యస్థ అనుభవం కలిగిన వ్యవస్థ నిర్వహణాధికారుల కొరకు ఇది ఉద్దేశించబడింది.

గ్లోబల్ ఫైల్ సిస్టమ్ 2

గ్లోబల్ ఫైల్ సిస్టమ్ 2 పుస్తకం Red Hat Enterprise Linux 7 నందు Red Hat GFS2 (గ్లోబల్ ఫైల్ సిస్టమ్ 2) ఆకృతీకరించుట మరియు నిర్వహించుట గురించి సమాచారం అందించును.

లాజికల్ వాల్యూమ్ మేనేజర్ నిర్వహణాధికారి

నిల్వ నిర్వహణ మార్గదర్శిని Red Hat Enterprise Linux 7 పైన నిల్వ పరికరాలను మరియు ఫైల్ వ్యవస్థలను ఎలా నిర్వహించాలో సూచనలు అందించును. Red Hat Enterprise Linux లేదా Fedora లైనక్స్ పంపిణీల పై మధ్యస్థ అనుభవం కలిగిన వ్యవస్థ నిర్వహణాధికారుల కొరకు ఇది ఉద్దేశించబడింది.

కెర్నల్ క్రాష్ డంప్ మార్గదర్శిని

కెర్నల్ క్రాష్ డంప్ మార్గదర్శిని Red Hat Enterprise Linux 7 నందు అందుబాటులోని కెడంప్ క్రాష్ రికవరీ సేవ ఎలా ఆకృతీకరించాలో, పరీక్షించాలో, మరియు ఉపయోగించాలో వివరించును.

20.3. రక్షణ

రక్షణ మార్గదర్శిని

రక్షణ మార్గదర్శిని అనేది వర్కుస్టేషన్లు మరియు సేవికలను లోకల్ మరియు రిమోట్ చొరబాట్లు, దాడులు మరియు హానికారక కార్యకలాపాల నుండి రక్షించడంలో వాడుకరులకు మరియు నిర్వహణాధికారులకు సహాయపడుటకు రూపొందించబడింది.

SELinux వాడుకరి మరియు నిర్వహణాధికారి మార్గదర్శిని

SELinux వాడుకరి మరియు నిర్వహణాధికారి మార్గదర్శిని అనునది రక్షణ-పెంచిన లైనక్స్ నిర్వహణను మరియు వాడుకను వివరించును. Red Hat Enterprise Linux 6 నందు స్టాండ్-ఎలోన్ పుస్తకం నందు పత్రీకరించిన, నిర్బందిత సేవల నిర్వహణ, ఇప్పుడు SELinux వాడుకరి మరియు నిర్వహణాధికారి మార్గదర్శని నందు చేర్చబడెను.

20.4. సాధనములు మరియు పనితనము

వనరు నిర్వహణా మార్గదర్శిని

Red Hat Enterprise Linux 7 పైన వ్యవస్థ వనరులను నిర్వహించుటకు సాధనాల మరియు సాంకేతికతల పత్రీకరణను వనరు నిర్వహణ మార్గదర్శిని ఇచ్చును.

పవర్ నిర్వహణా మార్గదర్శిని

పవర్ మేనేజ్‌మెంట్ మార్గదర్శిని అనేది Red Hat Enterprise Linux 7 నందు విద్యుత్ ఖర్చును ఎలా నిర్వహించాలో పత్రీకరణ చేయును.

పనితనం ట్యూనింగ్ మార్గదర్శిని

పనితనం ట్యూనింగ్ మార్గదర్శిని అనేది Red Hat Enterprise Linux 7 నందు సబ్‌సిస్టమ్ త్రౌపుట్ ఎలా ఆప్టిమైజ్ చేయాలో పత్రీకరణ చేయును.

అభివృద్దికారి మర్గదర్శిని

అభవృద్దికారి మార్గదర్శిని అనేది Red Hat Enterprise Linux 7 ను అనువర్తన అభివృద్ది కొరకు ఒక మంచి ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫాం చేయుటకు విభిన్న విశిష్టతలు మరియు సౌలభ్యాలు వివరించును.

ప్రారంభకులకు సిస్టమ్‌టాప్ మార్గదర్శిని

ప్రారంభకులకు సిస్టమ్‌టాప్ మార్గదర్శిని అనేది Red Hat Enterprise Linux యొక్క వివిధ ఉపవ్యవస్థలు పర్యవేక్షించుటకు సిస్టమ్‌టాప్ ఎలా ఉపయోగించాలో ప్రాథమిక సూచనలు ఇచ్చును.

సిస్టమ్‌టాప్ రిఫరెన్స్

సిస్టమ్‌టాప్ టాప్‌సెట్ రిఫరెన్స్ మార్గదర్శిని సిస్టమ్‌టాప్ స్క్రిప్టులకు వాడుకరులు ఆపాదించే టాప్‌సెట్ నిర్వచనాలను వివరించును.

20.5. క్లస్టరింగ్ మరియు అదిక అందుబాటు

పొడిగింత నిర్వహణ హై ఎవైలబిలిటి

హై ఎవైలబిలిటి పొడిగింత నిర్వహణ మార్గదర్శిని Red Hat Enterprise Linux 7 నందు హై ఎవైలబిలిటి పొడిగింతను ఎలా ఆకృతీకరించాలో మరియు నిర్వహించాలో సమాచారం అందించును.

హై ఎవైలబిలిటీ పొడిగింత అవలోకనం

హై ఎవైలబిలిటీ పొడిగింత అవలోకనం Red Hat Enterprise Linux 7 కొరకు హై ఎవైలబిలిటీ పొడిగింత అవలోకనం అందించును.

హై ఎవైలబిలిటీ పొడిగింత రిఫరెన్స్

హై ఎవైలబిలిటీ పొడిగింత రిఫరెన్స్ అనేది Red Hat Enterprise Linux 7 కొరకు హై ఎవైలబిలిటీ పొడిగింత రిఫరెన్స్ మార్గదర్శిని.

లోడ్ బాలెన్సర్ నిర్వహణ

లోడ్ బాలెన్సర్ నిర్వహణ అనేది Red Hat Enterprise Linux 7 నందు అధిక-పనితనం లోడ్ బాలెన్సింగ్ ఆకృతీకరించుటకు మరియు నిర్వహించుటకు మార్గదర్శిని.

DM మల్టీపాత్

డిఎమ్ మల్టీపాత్ పుస్తకం Red Hat Enterprise Linux 7 కొరకు డివైజ్-మాపర్ మల్టీపాత్ విశిష్టతను ఎలా ఆకృతీకరించాలో మరియు నిర్వహించాలో వాడుకరులకు మార్గదర్శనం చేయును.

20.6. వర్చ్యులైజేషన్

వర్చ్యులైజేషన్ ప్రారంభించుటకు మార్గదర్శిని

వర్చ్యులైజేషన్ ప్రారంభించుటకు మార్గదర్శిని అనేది Red Hat Enterprise Linux 7 పైన వర్చ్యులైజేషన్‌కు పరిచయం.

వర్చ్యులైజేషన్ నియుక్తి మరియు నిర్వహణ మార్గదర్శని

వర్చ్యులైజేషన్ నియుక్తి మరియు నిర్వహణ మార్గదర్శిని Red Hat Enterprise Linux 7 పైన వర్చ్యులైజేషన్ సంస్థాపనకు, ఆకృతీకరణకు, మరియు నిర్వహణకు సంబందించిన సమాచారం అందించును.

వర్చ్యులైజేషన్ రక్షణ మార్గదర్శిని

వర్చ్యులైజేషన్ రక్షణ మార్గదర్శని అనేది Red Hat చేత అందించబడిన వర్చ్యులైజేషన్ రక్షణ సాంకేతికతల అవలోకనం అందించును, మరియు వర్చ్యులైజేషన్ ఎన్విరాన్మెంట్ల నందు వర్చ్యులైజేషన్ అతిధేయిలు, అతిథులు, మరియు భాగస్వామ్య వ్యవస్థ మరియు వనరులు రక్షించుటకు సిఫార్సులు అందించును.

వర్చ్యులైజేషన్ ట్యూనింగ్ మరియు ఆప్టిమైజేషన్ మార్గదర్శిని

వర్చ్యులైజేషన్ ట్యూనింగ్ మరియు ఆప్టిమైజేషన్ మార్గదర్శిని అనేది KVM మరియు వర్చ్యులైజేషన్ పనితనం వివరించును. మీ అతిధేయ వ్యవస్థలు మరియు వర్చ్యులైజ్డ్ అతిథుల కొరకు KVM పనితనం విశిష్టతల మరియు ఐచ్చికాల పూర్తి ఉపయోగం పొందుటకు ఈ మార్గదర్శిని నందు చిట్కాలు మరియు సూచనలు కనుగొనవచ్చు.

లైనక్స్ కంటైనర్స్ మార్గదర్శిని

లైనక్స్ కంటైనర్స్ మార్గదర్శిని అనునది Red Hat Enterprise Linux 7.0 నందు లైనక్స్ కంటైనర్స్ ఆకృతీకరణ మరియు నిర్వహణ సమాచారం ఇచ్చును, మరియు లైనక్స్ కంటైనర్స్ కొరకు అనువర్తన ఉదాహరణల అవలోకనం అందించును.

అధ్యాయము 21. ఇంటర్నేష్నలైజేషన్

21.1. Red Hat Enterprise Linux 7.0 అంతర్జాతీయ భాషలు

Red Hat Enterprise Linux 7.0 బహుళ భాషల సంస్థాపనకు మరియు మీ అవసరానికి తగినట్లు భాషలను మార్చుటకు తోడ్పాటునిచ్చును.
కింది భాషలు Red Hat Enterprise Linux 7.0 నందు తోడ్పాటునిచ్చును:
  • తూర్పు ఆసియా భాషలు - జపనీస్, చైనీస్, కొరియన్, సింప్లిఫైడ్ చైనీస్, మరియు ట్రెడిషనల్ చైనీస్
  • ఐరోపా భాషలు - ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, పోర్చుగీస్ బ్రెజిలియన్, మరియు రష్యన్.
  • భారతీయ భాషలు - అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మళయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, మరియు తెలుగు.
కింది పట్టిక ప్రస్తుతం తోడ్పాటునిస్తున్న భాషలు, వాటి లోకేల్స్, సంస్థాపించిన అప్రమేయ ఫాంట్లు, మరియు కొన్ని భాషలకు కావలసిన ప్యాకేజీలను చూపును.
ఫాంట్ ఆకృతీకరణపై మరింత సమాచారం కొరకు, డెస్కుటాప్ మైగ్రేషన్ మరియు నిర్వహణ మార్గదర్శిని చూడండి.

పట్టిక 21.1. భాషా తోడ్పాటు మాత్రిక

ప్రాంతం భాష స్థానిక అప్రమేయ ఫాంట్ (ఫాంట్ ప్యాకేజీ) ఎగుబడి పద్దతులు
బ్రెజిల్ పోర్చుగీస్ pt_BR.UTF-8 డెజావు సాన్స్ (dejavu-sans-fonts)
ఫ్రాన్స్ ఫ్రెంచ్ fr_FR.UTF-8 డెజావు సాన్స్ (dejavu-sans-fonts)
జర్మనీ జర్మన్ de_DE.UTF-8 డెజావు సాన్స్ (dejavu-sans-fonts)
ఇటలీ ఇటలీ it_IT.UTF-8 డెజావు సాన్స్ (dejavu-sans-fonts)
రష్యా రష్యన్ ru_RU.UTF-8 డెజావు సాన్స్ (dejavu-sans-fonts)  
స్పెయిన్ స్పానిష్ es_ES.UTF-8 డెజావు సాన్స్ (dejavu-sans-fonts)
యుఎస్ఎ ఇంగ్లీష్ en_US.UTF-8 డెజావు సాన్స్ (dejavu-sans-fonts)
చైనా సింప్లిఫైడ్ చైనీస్ zh_CN.UTF-8 వెన్‌క్వానియి జెన్ హై షార్ప్ (wqy-zenhei-fonts) ibus-libpinyin, ibus-table-chinese
జపాన్ జపనీస్ ja_JP.UTF-8 విఎల్ పిగోతిక్ (vlgothic-p-fonts) ibus-kkc
కొరియా కొరియన్ ko_KR.UTF-8 నానమ్‌గోతిక్ (nhn-nanum-gothic-fonts) ibus-hangul
తైవాన్ ట్రెడిషనల్ చైనీస్ zh_TW.UTF-8 ఏఆర్ పిఎల్ ఉమింగ్ టిడబ్యు (cjkuni-uming-fonts) ibus-chewing, ibus-table-chinese
ఇండియా అస్సామీ as_IN.UTF-8 లోహిత్ అస్సామీ (lohit-assamese-fonts) ibus-m17n, m17n-db, m17n-contrib
బెంగాలి bn_IN.UTF-8 లోహిత్ బెంగాలి (lohit-bengali-fonts) ibus-m17n, m17n-db, m17n-contrib
గుజరాతీ gu_IN.UTF-8 లోహిత్ గుజరాతి (lohit-gujarati-fonts) ibus-m17n, m17n-db, m17n-contrib
హింది hi_IN.UTF-8 లోహిత్ హింది (lohit-devanagari-fonts) ibus-m17n, m17n-db, m17n-contrib
కన్నడ kn_IN.UTF-8 లోహిత్ కన్నడ (lohit-kannada-fonts) ibus-m17n, m17n-db, m17n-contrib
మలయాళం ml_IN.UTF-8 మీరా (smc-meera-fonts) ibus-m17n, m17n-db, m17n-contrib
మరాఠి mr_IN.UTF-8 లోహిత్ మరాఠి (lohit-marathi-fonts) ibus-m17n, m17n-db, m17n-contrib
ఒడియా or_IN.UTF-8 లోహిత్ ఒడియా (lohit-oriya-fonts) ibus-m17n, m17n-db, m17n-contrib
పంజాబి pa_IN.UTF-8 లోహిత్ పంజాబి (lohit-punjabi-fonts) ibus-m17n, m17n-db, m17n-contrib
తమిళ్ ta_IN.UTF-8 లోహిత్ తమిళ్ (lohit-tamil-fonts) ibus-m17n, m17n-db, m17n-contrib
తెలుగు te_IN.UTF-8 లోహిత్ తెలుగు (lohit-telugu-fonts) ibus-m17n, m17n-db, m17n-contrib

21.2. అంతర్జాతీయకరణ నందు సాధారణ మార్పులు

కొత్త yum-langpacks చొప్పింత

కొత్త YUM చొప్పింత, ప్రస్తుత భాషా లోకేల్‌కు వివిద ప్యాకేజీల కొరకు అనువాదపు ఉపప్యాకేజీలను సంస్థాపించుటకు yum-langpacks ఇప్పుడు వాడుకరులను అనుమతించును.

లోకేల్ మరియు కీబోర్డ్ లేఅవుట్ అమరికలను మార్చుతోంది

సిస్టమ్ లోకేల్ మరియు కీబోర్డ్ లేఅవుట్ అమరికలను క్వరీ చేయుటకు మరియు మార్చుటకు localectl అనేది కొత్త సౌలభ్యం; అమరికలు పాఠ కన్సోల్ నందు ఉపయోగించబడెను మరియు డెస్కుటాప్ ఎన్విరాన్మెంట్ల చే సంకరించబడెను.SSH నందు దూరస్థ వ్యవస్థలను నిర్వహించుటకు localectl అనునది అతిధేయపేరు ఆర్గుమెంట్‌ను కూడా ఆమోదించును.

21.3. ఎగుబడి పద్దతులు

IBus నందు మార్పులు

Red Hat Enterprise Linux 7.0 ఇంటిలిజెంట్ ఇన్పుట్ బస్ (IBus) వర్షన్ 1.5 కు తోడ్పాటును కలిగివుంది. IBus కు తోడ్పాటు ఇప్పుడు గ్నోమ్ నందు చేర్చబడింది.
  • ఎగుబడి పద్దతులు gnome-control-center region ఆదేశము ఉపయోగించి జతచేయవచ్చు, ఇన్పుట్ హాట్‌కీలను అమర్చుటకు gnome-control-center keyboard ఆదేశము ఉపయోగించవచ్చు.
  • గ్నోమ్-కాని సెషన్ల కొరకు, ibus XKB నమూనాలను మరియు ఎగుబడి పద్దతులు రెంటినీ ibus-setup సాధనం నందు ఆకృతీకరించగలదు మరియు వాటిని హాట్‌కీతో మార్చగలదు.
  • అప్రమేయ హాట్‌కీ Super+space, ఇది Red Hat Enterprise Linux 6 నందు ఉన్న Control+space in ibus కు మార్పు. Alt+Tab తో వచ్చే UI నే ఇది అందించును. బహుళ ఎగుబడి పద్దతులు Alt+Tab ఉపయోగించి మార్చవచ్చు.

IBus కొరకు ప్రిడిక్టివ్ ఎగుబడి పద్దతి

ibus-typing-booster అనేది ibus ప్లాట్‌ఫాంకు ప్రిడిక్టివ్ ఇన్పుట్ మెథడ్. పాక్షికపైన పదంతో ఇది పూర్తి పదాన్ని ముందుగా ఇస్తుంది. వాడుకరులు సూచనల జాబితా నుండి కావలసిన పదం ఎంపికచేసుకొని వారి టైపింగ్ వేగాన్ని అక్షర క్రమాన్ని మెరుగుపరచుకోవచ్చు. ibus-typing-booster హన్‌స్పెల్ పదకోశాలతో కూడా పనిచేయును మరియు హన్‌స్పెల్ పదకోశం ఉపయోగించే భాషకు సూచనలు ఇవ్వగలదు.
ibus-typing-booster ఐచ్చిక ప్యాకేజీ అని గుర్తించండి, కనుక input-methods సమూహం నందు భాగముగా అప్రమేయంగా సంస్థాపించబడదు.
ఎగుబడి పద్దతుల నందలి వివరణాత్మక మార్పుల కొరకు, డెస్కుటాప్ మైగ్రేషన్ మరియు నిర్వహణ మార్గదర్శని చూడుము.

21.4. ఫాంట్లు

fonts-tweak-tool

కొత్త సాధనం, fonts-tweak-tool అనేది వాడుకరులను ఒక్కో భాషకు వాడుకరి ఫాంట్ ఆకృతీకరణ ఉపయోగించి అప్రమేయ ఫాంట్లు ఆకృతీకరించుటకు అనుమతించును.

21.5. భాషా-ప్రత్యేక మార్పులు

అరబిక్

Paktype కొరకు కొత్త అరబిక్ ఫాంట్లు Red Hat Enterprise Linux 7.0 నందు అందుబాటులో ఉన్నాయి:paktype-ajrak, paktype-basic-naskh-farsi, paktype-basic-naskh-sindhi, paktype-basic-naskh-urdu, and paktype-basic-naskh-sa.

చైనీస్

  • సింప్లిఫైడ్ చైనీస్ కొరకు డబ్లూక్యువై జెన్‌హై ఫాంట్ ఇప్పుడు అప్రమేయ ఫాంట్.
  • సింప్లిఫైడ్ చైనీస్ కొరకు అప్రమేయ ఇంజన్ Red Hat Enterprise Linux 6 ఉపయోగించే ibus-pinyin నుండి ibus-libpinyin కు మార్చబడెను.

భారతీయ

  • కొత్త లోహిత్ దేవనాగరి ఫాంట్ హిందీ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మరాఠి, మరియు నేపాలి భాషల కొరకు గతంలో గల వేరువేరు లాహిత్ ఫాంట్లను భర్తీచేయును. ఈ భాషల కొరకు కావలసిన ఏవేనీ ప్రత్యేక గ్లిఫ్స్ భవిష్యత్తులో కావలసివస్తే లోహిత్ దేవనాగరి నందు ఓపెన్ టైప్ ఫాంట్ locl టాగ్సుతో సంభాలిస్తారు.
  • కొత్త ఫాంట్ ప్యాకేజీలు gubbi-fonts మరియు navilu-fonts కన్నడ భాష కొరకు జతచేయబడెను.

జపనీస్

  • IPA ఫాంట్లు ఇకపై అప్రమేయంగా సంస్థాపించబడవు
  • ibus-kkc, కానా కంజి కన్వర్సేషన్, అనేది కొత్త అప్రమేయ జపనీస్ ఎగుబడి పద్దతి ఇంజన్ అది కొత్త libkkc బ్యాకెండ్ ఉపయోగిస్తోంది. అది ibus-anthy, anthy, మరియు kasumi ను భర్తీచేస్తుంది.

కొరియన్

నానమ్ ఫాంట్ ఇప్పుడు అప్రమేయంగా ఉపయోగించబడును.

కొత్త లోకేల్స్

Red Hat Enterprise Linux 7.0 కొత్త లోకేల్సుకు తోడ్పాటునిస్తోంది, కొంకణీ (kok_IN) మరియు పుష్తో (ps_AF).

అధ్యాయము 22. మద్దతు మరియు నిర్వహణ

ABRT 2.1

Red Hat Enterprise Linux 7.0 ఆటోమాటిక్ బగ్ రిపోర్టింగ్ టూల్ (ABRT) 2.1 ను అందిస్తోంది అది మెరుగైన వాడుకరి ఇంటర్ఫేస్ కలిగివుంది మరియు uReport లు పంపగలదు, క్రాష్ గణాంకాలను సేకరించడం వంటి మిషన్ ప్రోసెసింగ్‌కు తగిన లైట్‌వెయిట్ ఎనానిమస్ ప్రోబ్లమ్ రిపోర్ట్స్ పంపగలదు. సాధ్యమైనన్ని సాఫ్టువేర్ బగ్‌లను కనుగొనుటకు, Red Hat Enterprise Linux 7.0 నందు చేర్చిన ABRT, అప్రమేయంగా, క్రాష్ నివేదికలను స్వయంచాలకంగా Red Hat కు పంపుటకు ఆకృతీకరించెనని గమనించండి.
ABRT 2.1 నందు Java మరియు Ruby లాంగ్వేజెస్ తోడ్పాటు విస్తరించబడెను.

పునఃపరిశీలన చరిత్ర

పునఃపరిశీలన చరిత్ర
పునఃపరిశీలన 0.0-0.8.2Mon Mar 24 2014Krishnababu krothapalli
Updated Telugu Translations
పునఃపరిశీలన 0.0-0.8.1Tue Mar 11 2014Chester Cheng
అనువాద ఫైళ్ళు XML మూలాలతో సింక్రొనైజ్ అగును 0.0-0.7
పునఃపరిశీలన 0.0-0.8Thu Dec 11 2013Eliška Slobodová
Red Hat Enterprise Linux 7.0 బీటా విడుదల నోట్స్ విడుదల.